S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/13/2018 - 11:59

పోర్ట్‌బ్లెయిర్: అండమాన్ దీవుల్లో మరో భారీ భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్ర 5.6గా నమోదైంది. ఇవాళ ఉదయం 8:09 ప్రాంతంలో ఇక్కడ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్టు వాతావరణ విభాగం వెల్లడించింది.

02/13/2018 - 11:56

గోకవరం: రాజమండ్రిలోని గోకవరం మండలం తిరుమలాయపాలెంలో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతులు షేక్‌ (4), షేక్‌ అబ్దుల్లా(3)గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

02/13/2018 - 16:34

హైదరాబాద్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలకు భక్తజనం పోటెత్తుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తజనసంద్రంగా మారాయి.తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్దఎత్తున బారులు తీరారు. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగుతున్నాయి.

02/13/2018 - 11:48

ముంబయి: ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్‌ బోర్డు బీసీసీఐ త్వరలోనే సమాచార హక్కు చట్టం పరిధిలోకి తెచ్చేలా నివేదిక సిద్ధం చేశామని త్వరలోనే న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు సమర్పిస్తామని న్యాయ కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ బీఎస్‌ చౌహాన్‌ మీడియాకు తెలిపారు. ఇప్పటి వరకు బీసీసీఐపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసే అవకాశం లేదు. అలాగే సమాచార హక్కు చట్టం కింద ప్రశ్నించలేం.

02/13/2018 - 11:47

రాంచి: మరో విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఝార్ఖండ్‌ రాజధాని రాంచిలోని బిర్సాముండా విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ 398 విమానంలో పైలట్‌ సాంకేతిక సమస్యను గుర్తించాడు. దాంతో వెంటనే విమానం నుంచి దిగి టెక్నీషియన్లను పిలిపించాడు. ఆ సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానానికి మరమ్మతులు చేయడానికి దాదాపు రెండున్నర గంటల సమయం పట్టింది.

02/13/2018 - 11:45

ముంబయి: ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం అమలులో ఉన్న ఉద్యోగ భవిష్యనిధి వడ్డీరేటును 8.65శాతం వద్ద యథాతథంగా కొనసాగించే సూచనలు కనిపిస్తున్నాయి. 5కోట్ల మంది ఉద్యోగులకు సంబంధించిన భవిష్యనిధిపై ఈ నెల 21న జరగబోయే సమావేశంలో ధర్మకర్తల నిర్ణయం తీసుకోనున్నారు.ప్రస్తుతం ఉన్న ఈటీఎఫ్‌లను ఉద్యోగుల భవిష్యనిధి అకౌంట్లలో వేసే ఆలోచననూ పరిశీలిస్తున్నారు.

02/13/2018 - 04:19

శ్రీనగర్, ఫిబ్రవరి 12: కశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు తెగబడగా వారి ప్రయత్నాలు భద్రతా దళాలు తిప్పికొట్టాయి. దాడి చేసిన తీవ్రవాదులను మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నాయి. కశ్మీర్‌లో గడచిన వారంలో ఉగ్రవాదులు దాడులకు తెగబడటం ఇది మూడోసారి. శ్రీనగర్ నడిబొడ్డునున్న కరణ్‌నగర్‌లో సీఆర్‌పీఎఫ్ శిబిరంపై సోమవారం తెల్లవారుఝామున ఉగ్రవాదులు దాడుల ప్రయత్నం భగ్నమైంది.

02/13/2018 - 04:16

జైపూర్, ఫిబ్రవరి 12: ఉత్తరాది రాష్టమ్రైన రాజస్థాన్‌లో భారీఎత్తున బంగారు నిక్షేపాలున్నాయని భూగర్భ శాస్త్ర నిపుణులు, శాస్తవ్రేత్తలు గుర్తించారు. దాదాపు 11.48 కోట్ల టన్ను బంగారు నిక్షేపాలు చాలా తక్కువ లోతులోనే ఉన్నట్లు వారు గుర్తించారు. ప్రధానంగా రాజస్థాన్‌లోని సికార్ జిల్లాలోని ‘నీమ్ కా థానా’లో రాగి, బంగారు నిక్షేపాల కోసం అనే్వషిస్తున్న సమయంలో ఈ విషయం బయటపడింది.

02/13/2018 - 04:15

అయోధ్యలోని కరసేవాపురంలో సోమవారం రామ జన్మభూమి ఆలయం నమూనాతో రూపొందించిన ప్రచార రథాన్ని పరిశీలిస్తున్న సాధువులు. మంగళవారం నుంచి అయోధ్య - రామేశ్వరం రామరాజ్య యాత్ర ప్రారంభించనున్నారు.

02/13/2018 - 04:12

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: దేశ రక్షణ బలగాలను కించపరిచేలా చేసిన వ్యాఖ్యలపై జాతికి, సైనిక బలగాలకు ఆర్‌ఎస్‌ఎస్ సారధి క్షమాపణ చెప్పి తీరాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఒకవేళ యుద్ధం చేయాల్సి వస్తే సైనిక దళాలను మొహరించడానికి ఆర్మీకి ఆరేడు నెలలు పడితే ఆర్‌ఎస్‌ఎస్ కేవలం మూడురోజుల్లో ఆ పని చేస్తుందని చేసిన భగవత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది.

Pages