S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/12/2018 - 17:05

న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సమాచార హక్కు చట్టం పరిధిలోకి రావాల్సిందేనని లా కమిషన్ సూచించింది. ప్రస్తుతం బీసీసీఐ సొసైటీస్ యాక్ట్ పరిధిలో ఉంది. ప్రభుత్వానికి జవాబుదారీగా లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు తీసుకోని నేపథ్యంలో తమది ప్రైవేట్ సంస్థేనని గత కొంతకాలంగా బీసీసీఐ వాదిస్తోంది. బోర్డు కార్యకలాపాలన్ని ప్రజలతో సంబంధం కలిగి ఉండటం వల్ల లా కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది.

02/12/2018 - 16:20

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లోని ఉత్తర కాశీలో సోమవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఒకరు స్వల్పంగా గాయపడ్డారు.

02/12/2018 - 15:55

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని కరణ్ నగర్ ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు చేసిన కుట్రను సీఆర్పీఎఫ్ జవాన్లు భగ్నం చేశారు. ఆర్మీ క్యాంపులోకి సోమవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఇద్దరు ఉగ్రవాదులు భారీగా ఆయుధాలతో ప్రవేశించేందుకు ప్రయత్నం చేశారు. ఉగ్రవాదుల ప్రవేశాన్ని పసిగట్టిన భద్రతా బలగాలు.. వారిపై కాల్పులు జరిపారు. దీంతో అక్కడ్నుంచి ఉగ్రవాదులు తప్పించుకున్నారు.

02/12/2018 - 16:30

న్యూఢిల్లీ : దేశం కోసం ప్రాణాలొడ్డిన సైనికులను అగౌరవపరిచేలా ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ వ్యాఖ్యానించారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆరోపించారు. సైన్యం కంటే వేగంగా సుశిక్షితులైన సైనికులను ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధం చేస్తుందని భగవత్‌ చేసిన వ్యాఖ్యల పట్ల రాహుల్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ దీనిపై బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

02/12/2018 - 16:50

న్యూఢిల్లీ : గత ఆర్థిక సంవత్సరంలో (2016-17) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) రూ.20,339 కోట్ల విలువైన మొండి బకాయిలను సాంకేతికంగా రద్దు (రైటాఫ్‌) చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ (పీఎస్‌బీలు) కలిపి రద్దు చేసిన రుణాల మొత్తం రూ.81,683 కోట్లు కాగా.. ఇందులో ఎస్‌బీఐ వాటాయే అధికం. ఈ గణాంకాలు ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల విలీనం కాకముందు కాలానివి.

02/12/2018 - 16:44

చెన్నై: మూడు దశాబ్దాలపాటు తమిళనాట ఓ వెలుగు వెలిగి.. ఆరు పర్యాయాలు రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత ముఖ్యమంత్రి జయలలిత చిత్రపటాన్ని అసెంబ్లీ భవనం గ్యాలరీలో ఏర్పాటు చేయడంపై ప్రతిపక్ష డీఎంకే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాన్ని బహిష్కరించాయి.

02/12/2018 - 15:37

ఒమన్‌ : రక్షణ, ఆరోగ్యం, పర్యాటక రంగాల్లో పరస్పర సహకారంపై భారత్‌, ఒమన్‌ దేశాలు ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు పశ్చిమాసియా దేశాల పర్యటనలో భాగంగా చివరగా ఒమన్‌ వెళ్లారు. ఒమన్‌ రాజు ఖబూస్‌తో విస్తృత చర్చల్లో పాల్గొన్న అనంతరం పలు ఒప్పందాలకు అంగీకారం తెలిపారు. దుబాయ్‌ నుంచి నిన్న ఒమన్‌కు చేరుకున్న మోదీ ఉన్నత స్థాయి అధికారులతో, ఒమన్‌ రాజుతో చర్చలు జరిపారు.

02/12/2018 - 06:14

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: ఆంధ్రప్రదేశ్‌కు 588 కోట్లు సహా దేశవ్యాప్తంగా స్మార్ట్ సిటీల నిర్మాణంలో భాగంగా వివిధ రాష్ట్రాలకు 9,940 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో మహారాష్టక్రు అత్యధిక స్థాయిలో 1378 కోట్లు, రెండోస్థానంలోవున్న మధ్యప్రదేశ్‌కు 984 కోట్లు లభించాయి.

02/12/2018 - 00:43

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: నేర రాజకీయాలను అరికట్టే దిశగా ఎన్నికల కమిషన్ కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఐదేళ్లపాటు శిక్షకు గురయ్యే నేరాలకు పాల్పడిన వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించేలా కేంద్రానికి సిఫార్స్ చేసినట్టు, అందుకు అనుగుణంగా చట్టాన్ని సవరించాలని కోరినట్టు సుప్రీంకోర్టుకు నివేదించింది. ఈమేరకు సుప్రీం కోర్టులో ఎన్నికల కమిషన్ ఓ అఫిడవిట్ దాఖలు చేసింది.

02/12/2018 - 00:33

కొప్పళ్ (కర్నాటక), ఫిబ్రవరి 11: కర్నాటకలోని అధికార కాంగ్రెస్ పార్టీ నిష్కళంకమని పార్టీ అధినేత రాహుల్‌గాంధీ స్పష్టం చేవారు. అవినీతి రహితమైన పరిపాలననే సిద్ధరామయ్య ప్రభుత్వం అందిస్తోందని చెప్పిన ఆయన, బీజేపీ మాత్రం అవినీతిలో కొత్త రికార్డు సృష్టించిందని ఆరోపించారు.

Pages