S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/12/2018 - 00:28

సుంజువాన్ (జమ్ము), ఫిబ్రవరి 11: జమ్ములో జరిగిన మిలిటెంట్ దాడిలో మరణించిన వారి సంఖ్య ఆరుకు పెరిగింది. ముగ్గురు జవాన్లు, ఓ పౌరుడి మృత దేహం లభించిందని ఆర్మీ ఆదివారం తెలిపింది.

02/12/2018 - 00:27

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: విద్య, సాహిత్య అధ్యయనాన్ని కేవలం ఉపాధి, వ్యాపారానికే పరిమితం చేయకుండా జ్ఞాన సముపార్జనకు సాధనంగా ఉపయోగించుకోకొవాలని హార్వర్డ్ విద్యార్థులకు కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ హితవు పలికారు. అమెరికాలోని బోస్టన్‌లో ప్రతి ఏడాది జరిగే భారతీయ ఉత్సవం-2018 సమ్మేళనంలో భారతీయ సాహిత్యంపై జరిగిన చర్చా గోష్టిలో ప్రధానకర్తగా యార్లగడ్డ పాల్గొన్నారు.

02/12/2018 - 00:17

పనాజి, ఫిబ్రవరి 11: రాజ్యసభలో నవ్విన తనను రామాయణం సీరియల్‌లో శూర్పణఖతో పోల్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నాయకురాలు రేణుకాచౌదరి ఎదురుదాడికి దిగారు. నవ్వుపై ఎలాంటి వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) లేదని, తాను నవ్వడానికి ఎవరి నుంచి అనుమతి తీసుకోవలసిన అవసరం అంతకన్నా లేదని ఆమె అన్నారు.

02/11/2018 - 02:30

జమ్మూ, ఫిబ్రవరి 10: పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలతో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ అట్టుడికింది. శనివారం తెల్లవారుఝామున సుంజువాన్ ఆర్మీ క్యాంపుపై విరుచుకుపడిన ఉగ్రవాదులు, ఇద్దరు సైనికుల ప్రాణాలు పొట్టనపెట్టుకున్న ఘటనను అసెంబ్లీ తీవ్రంగా పరిగణించింది. ఘటనపై అత్యవసరంగా సమావేశమైన అసెంబ్లీలో పార్టీలకు అతీతంగా సభ్యులు ఉగ్రవాద వ్యతిరేక నినాదాల చేశారు.

02/11/2018 - 02:28

అహ్మదాబాద్, ఫిబ్రవరి 10: ఆర్మీ, ఇతర భద్రతా బలగాలు సమర్థవంతమైన పనితీరునే ప్రదర్శిస్తున్నాయని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కితాబిచ్చారు. కాశ్మీర్‌లో చోటుచేసుకున్న ఉగ్రదాడిపై ఇది మాట్లాడే సమయం కాదని, అక్కడ ఇంకా ఆపరేషన్ కొనసాగుతోందని అన్నారు. కాశ్మీర్‌లోని సంజవాన్ ఆర్మీ క్యాంపుపై తెగబడిన ముష్కరులు ఇద్దరు జవాన్ల ప్రాణాలు పొట్టనుపెట్టుకోవడం తెలిసిందే.

02/11/2018 - 02:23

అగర్తల, ఫిబ్రవరి 10: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో 297 మంది పోటీ చేస్తుండగా 22 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. ప్రజాస్వామ్య సంస్కరణల పేరుతో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ జరిపిన అధ్యయనంలో అభ్యర్థుల ‘జాతకాలు’ వెల్లడయ్యాయి. 17 మంది అభ్యర్థులపై ఉన్నవి చిన్నాచితకా కేసులు కాదు. దోపిడీలు, హత్యలు, అత్యాచారం వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడినట్టు కేసులు నమోదయ్యాయి.

02/11/2018 - 02:17

జమ్మూ, ఫిబ్రవరి 10: జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ జిల్లా నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వద్ద జనావాసాలను లక్ష్యంగా చేసుకుని పాక్ సైనికులు మోర్టర్‌షెల్ (్ఫరంగి గుళ్ల)తో దాడులకు తెగబడ్డారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పోలీసులు వెల్లడించారు. ‘పూంచ్‌లోని ఖాదీ కర్మారా ప్రాంతంలో ఉదయం 11 గంటల సమయంలో ఫిరంగి దాడులకు దిగినట్టు వారు తెలిపారు. అవి ఇళ్లవైపు దూసుకురావడంతో జనం భీతిల్లినట్టు అధికారులు చెప్పారు.

02/11/2018 - 02:17

అగర్తల, ఫిబ్రవరి 10: త్రిపురలో శాంతి, సామరస్య వాతావరణాన్ని భగ్నం చేయడానికి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రయత్నిస్తోందని అధికార వామపక్ష ఫ్రంట్ నిప్పులు చెరిగింది. అభివృద్ధే లక్ష్యంగా వామక్ష ఫ్రంట్ పనిచేస్తుంటే రాజకీయ ప్రయోజనాలు ఆశించి బీజేపీ దురుద్దేశంతో వ్యవహరిస్తోందని త్రిపుర లెఫ్ట్ ఫ్రంట్ కన్వీనర్ బిజన్ ధర్ ఆరోపించారు.

02/11/2018 - 02:16

వారణాసి (యూపీ), ఫిబ్రవరి 10: ప్రముఖ షెనాయ్ విద్వాంసుడు దివంగత ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ మూడో కుమారుడు జమీన్ హుస్సేన్ ఖాన్ శనివారం ఉదయం మరణించారు. ఆయన వయస్సు 74 సంవత్సరాలు ఆయనకు భార్య, ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. జమీన్ కుమారుడు అఫఖ్ హైదర్ కూడా షెనాయ్ విద్వాంసుడే. జమీన్ కొన్ని రోజులుగా కిడ్నీకి సంబంధించిన వ్యాధిలో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.

02/11/2018 - 01:04

హోస్పేట (కర్నాటక), ఫిబ్రవరి 10: కాంగ్రెస్ ప్రభుత్వాలు గతంలో అనుసరించిన విధానాలను విమర్శిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ మరోసారి విమర్శల దాడి చేశారు. వెనుకకు చూస్తూ వాహనాలు నడిపే తీరులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఎద్దేవా చేశారు. అది ప్రమాదాలకు దారితీసే విధానమని, దేశాన్ని ఆ తీరులో ముందుకు తీసుకువెళ్లలేరని విమర్శించారు.

Pages