S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/11/2018 - 00:57

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డీయే ప్రభుత్వం రాష్ట్ర విభజన హామీలకు కట్టుబడి ఉంది. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావలసిన అన్ని నిధులు, సంస్థలను ఇస్తోందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు హరిబాబు చెప్పారు. హరిబాబు శనివారం విలేఖరులతో మాట్లాడుతూ బడ్జెట్ లోటును భర్తీ చేసేందుకు కేంద్రం ఇంతవరకు 3,979కోట్లు విడుదల చేసింది.

02/11/2018 - 00:26

జమ్మూ, ఫిబ్రవరి 10: నగర శివార్లలోని సంజ్‌వాన్ సైనిక స్థావరంపై శనివారం వేకువ జామున జైషే ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఇద్దరు సైనికాధికారులు మృతి చెందారు. ఓ కల్నర్ ర్యాంక్ అధికారి, ఓ సైనికాధికారి కుమార్తెతోపాటు ఆరుగురు గాయపడ్డారు. అప్రమత్తమైన భద్రతాదళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

02/11/2018 - 00:23

కర్నాటక ఎన్నికలకు కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు రాహుల్ గాంధీ ముందే సన్నద్ధమయ్యారు. 19ఏళ్ల క్రితం తల్లి సోనియా సెంటిమెంట్‌గా బళ్లారి నుంచి ప్రారంభించిన ఎన్నికల ప్రచారాన్ని రాహుల్ సైతం కొనసాగించాడు. డు ఆర్ డై పేరిట నిర్వహిస్తున్న ప్రచారంలో మహిళాభిమానులను పలకరిస్తున్న యువనేత

02/10/2018 - 04:13

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించం ద్వారా గతనెల 29న ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు మార్చి 5వ తేదీ వరకూ వాయిదా పడ్డాయి. ఆరు రోజుల పాటు సమావేశాలు జరిగిన తరువాత వచ్చేనెల 5కు వాయిదా వేస్తూ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. శుక్రవారం నాడు లోక్‌సభ కేవలం 15 నిముషాలు నడిచింది.

02/10/2018 - 02:35

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9:దేశంలోని ఆరోగ్య రంగం భేషుగ్గా ఉన్న పెద్ద రాష్ట్రాల్లో కేరళ అగ్రస్థానంలో నిలవగా ఉత్తర ప్రదేశ్ అట్టడుగున ఉండిపోయింది. గత ఏడాదితో పోలిస్తే యూపీలో పరిస్థితి మెరుగుపడినప్పటికీ జాబితాలో చివరిస్థానంతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. నీతి ఆయోగ్ విడుదల చేసిన తాజా ‘ఆరోగ్య సూచిక’లో ఈ వివరాలున్నాయి. కాగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో పంజాబ్, తమిళనాడు, నాలుగో స్థానంలో గుజరాత్ నిలిచాయి.

02/10/2018 - 02:36

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ఆంధ్రప్రదేశ్ విభజన హామీల అమలుకోరుతూ పార్లమెంట్‌లో రాష్ట్ర ఎంపీలు వరుసగా నాలుగోరోజూ నిరసన కొనసాగించారు. శుక్రవారం తెదేపా, వైకాపా, కాంగ్రెస్ ఎంపీలు వివిధ రూపాల్లో పార్లమెంట్ లోపల, బయటా ఆందోళన కొనసాగించారు. విభజన హామీల అమలు, కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంట్ ఆవరణలో తెదేపా ఎంపీలు నిరసన కొనసాగించారు.

02/10/2018 - 02:31

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: పోలవరం నిర్మాణ పనులు నిరంతరంగా కొనసాగుతాయి. పోలవరం పనులు ఏ దశలోనూ ఆగనిచ్చేది లేదు అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో ప్రకటించారు. శుక్రవారం రాజ్యసభలో 2018-19 వార్షిక బడ్జెట్‌పై జరిగిన చర్చకు జైట్లీ బదులిస్తూ ఏపీ అంశాన్ని మరోసారి ప్రస్తావించారు.

02/10/2018 - 00:10

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: తెలంగాణకు కేంద్ర బడ్జెట్‌లో అరకొరగా నిధులు కేటాయింపుజరిగిందని టీఆర్‌ఎస్ ఎంపీ కే కేశవరావుఆరోపించారు. నిధుల విషయంలో కేంద్రంపై పోరాడి సాధించుకుంటామని శుక్రవారం ఆయన హెచ్చరించారు. బడ్జెట్‌పై జరిగిన చర్చలో పాల్గొన్న కేకే ఆంధ్రాకు అన్యాయం జరిగిందంటూ ఆ రాష్ట్రానికి చెందిన ఎంపీలు చేస్తున్న పోరాటంపై స్పందిస్తూ అసలు సభలో ఏం జరుగుతోందని ప్రశ్నించారు.

02/09/2018 - 23:55

ఇందిరా గాంధీ హత్యానంతరం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన అల్లర్లలో మరణించినవారి కుటుంబాలు తమకు న్యాయం చేయాలంటూ శుక్రవారం హస్తినలో భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు
నిర్వహించాయ. ఆ ప్రదర్శనలో పాల్గొన్న ఓ మహిళ దోషులను శిక్షించి తీరాల్సిందేనంటూ
తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న దృశ్యమిది.

02/09/2018 - 23:54

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అన్ని చిన్నారుల హక్కుల సంఘాలలో ఖాళీలను భర్తీ చేయాలని, తద్వారా బాల్య న్యాయ చట్టాన్ని సమర్ధంగా అమలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Pages