S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/09/2018 - 23:54

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై బీజేపీ చీఫ్ అమిత్‌షా శుక్రవారం ఇక్కడ తీవ్రమైన ఆరోపణలు చేశారు. పార్లమెంటులో రాహుల్ వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామ్యంగా ఉందని అమిత్‌షా మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగానికి ప్రతిపక్ష పార్టీ అడ్డుతగలడం దారుణమని ఆయన విమర్శించారు.

02/09/2018 - 23:52

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ప్రధాని నరేంద్ర మోదీ మూడు పశ్చిమ ఆసియా దేశాల పర్యట నిమిత్తం శుక్రవారం బయలుదేరి వెళ్లారు. ఆయన సాయంత్రానికి జోర్డాన్ చేరుకున్నారు. ఆర్నేళ్ల క్రితం ఇజ్రాయెల్‌లో పర్యటించిన ప్రధాని ఆసారి పాలస్తీనా వెళ్తున్నారు. భద్రత, వాణిజ్యానికి సంబంధించి ఆయన పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్ అబ్బాస్‌తో మోదీ వ్యూహాత్మక చర్చలు జరుపుతారు.

02/09/2018 - 23:57

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్లాలని బీజేపీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ముఖ్యంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రతిపాదించిన సంక్షేమ పథకాల ప్రయోజనాల గురించి ప్రజలకు ఎంతగా వివరించగలిగితే అంతగానూ వచ్చే ఎన్నికల్లో పార్టీ లబ్దిపొందే అవకాశం ఉంటుందని బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ ఉద్ఘాటించారు.

02/09/2018 - 23:50

బెంగళూరు, ఫిబ్రవరి 9:ఆయోధ్య వివాదంలో కీలకమైన మసీదును వివాదాస్పద ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించాలన్న ప్రతిపాదనకు వివిధ ముస్లిం వర్గాలు మద్దతు ప్రకటించాయని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్ పేర్కొన్నారు. ఈ వివాదంపై అయోధ్యలో త్వరలో అతిపెద్ద సమావేశం నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

02/09/2018 - 23:46

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9:స్వాతంత్య్రానంతరం దేశంలో నిర్మించిన రైల్వే వంతెనలకన్నా ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన కొన్ని రైల్వే వంతెనలే ఇప్పటికీ నాణ్యంగా, పటిష్టంగా ఉన్నాయని పార్లమెంటరీ సభాసంఘం తన నివేదికలో పేర్కొంది. కొత్తగా కట్టిన, పునరుద్ధరించిన వంతెనల్లో నాణ్యత లోపానికి అధికారులు, గుత్తేదారుల మధ్య ఉన్న సంబంధాలే కారణమని తప్పుబట్టింది.

02/10/2018 - 02:45

న్యూఢిల్లీ,్ఫబ్రవరి 8:తెలంగాణ ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం చేయాలని కేంద్రాన్ని పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ ఎంపీ కె.కవిత విజ్ఞప్తి చేశారు.విభజన హామీల అమలు కోసం టీడీపీ,వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ లు పార్లమెంట్‌లో చేస్తున్న పోరాటానికి తాము మద్దతిస్తున్నట్టు ఆమె ప్రకటించారు.ఉమ్మడి ఏపీ విభజన సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలకు హామీలపై కేం ద్రం కట్టుబడి ఉండాలని కట్

02/09/2018 - 03:37

పాట్నా, ఫిబ్రవరి 8: బిహార్‌లోని పాట్నా జిల్లా అసోపూర్‌లో జరిగిన భూకబ్జా కేసులో కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత గిరిరాజ్‌సింగ్ పేరు నమోదైంది. ఆయనతోపాటు మరో 32మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

02/09/2018 - 01:58

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన చివరి బడ్జెట్ ప్రతిపాదనలు ద్రవ్య లోటును మరింత పెంచేవే అవుతాయని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం విమర్శలు గుప్పించారు. గత నాలుగేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే సృష్టించిన ఉపాధి అవకాశాలు ఏ మేరకు ఉన్నాయని, ఎన్ని ఉద్యోగాలను మోదీ ప్రభుత్వం యువతకు అందించిందని ఆయన ప్రశ్నించారు.

02/09/2018 - 01:56

చెన్నై, ఫిబ్రవరి 8: తమిళనాడులో వచ్చే ఎన్నికల్లో కలసి పనిచేసే విషయమై తాను, రజనీకాంత్ కలసి ఆలోచించాల్సి ఉందని ప్రముఖ నటుడు కమల్‌హాసన్ అన్నారు. కొత్తగా పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి ప్రవేశించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న కమల్ ఈ మేరకు తన ఆలోచనలను ఓ వ్యాసంలో వెల్లడించారు.

02/09/2018 - 01:55

జైపూర్‌లోని జోహారీ బజార్‌లో కలష్ శోభాయాత్రను నిర్వహిస్తున్న భక్తులు

Pages