S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/05/2018 - 04:21

లక్నో, ఫిబ్రవరి 4: గోవు మూత్రాన్ని ఇంతకాలం మనం పవిత్ర జలంగానూ, వాకిళ్లను శుభ్రం చేసుకునేందుకు మాత్రమే ఉపయోగించుకునేవాళ్లం. అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దీనిపై మరిన్ని పరిశోధనలు జరిపి మందులలో వాడేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. గోమూత్రం కాలేయానికి సంబంధించిన వ్యాధుల నివారణకు, కీళ్ల నొప్పుల నివారణకు, రోగనిరోధక శక్తి పెంచేందుకు ఉపకరిస్తుందని ఆ రాష్ట్ర ఆయుర్వేద శాఖ పేర్కొంది.

02/05/2018 - 04:20

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: మతం, కులం, ప్రాంతం, భాష పేరుతో ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పని ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇక్కడి ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్‌లో తొలి అంతర్జాతీయ ‘కళామేళా’ను ఆదివారం నాడు ఆయన ప్రారంభించారు. ఎన్ని విభేదాలున్నా కలసిమెలసి జీవించడమన్నది మనదేశ సంస్కృతి అని, అందువల్ల ఇతరుల మనోభావాలను గాయపచకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన హితవు చెప్పారు.

02/05/2018 - 04:19

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ఆంధ్రప్రదేశ్ హక్కుల సాధనకోసం చేసే పోరాటంలో తనను పిచ్నోణ్ణి అన్నా గర్వంగానే భావిస్తానని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సహాయం చేయాలనే ప్లకార్డ్‌తో రాజ్యసభలో వౌనవ్రతం చేసిన సందర్భంలో ఎంపీ కేవీపీపై రాజ్యసభ ఉపాధ్యక్షుడు పిజే కురియన్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘పిచ్చి పట్టిందా’ అన్న విషయం తెలిసిందే.

02/05/2018 - 01:13

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: రైల్వే టికెట్లు బుక్ చేసుకోవడం మరింత సులభతరం కానుంది. దేశవ్యాప్తంగా పోస్ట్ఫాసుల్లో త్వరలో పాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ కౌంటర్ల (పీఆర్‌ఎస్)లను ఏర్పాటు చేసేందుకు భారతీయ రైల్వేలు సన్నాహాలు చేస్తున్నాయి. రైల్వే సహాయ మంత్రి రాజన్ గొహెయిన్ రాజ్యసభలో ఇటీవల ఈ మేరకు ఒక ప్రకటన చేశారు.

02/04/2018 - 03:58

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాసిన ‘ఎగ్జామ్ వారియర్స్’ పుస్తకాన్ని శనివారం
ఢిల్లీలో విడుదల చేస్తున్న మానవ వనరుల మంత్రిత్వ శాఖ మంతి ప్రకాష్ జావడేకర్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్

02/04/2018 - 02:50

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా కాలుష్య కాసారమవుతోన్న ఢిల్లీ పరరిక్షణకు ఉపాధ్యాయులు నడుంకట్టాలని కేంద్ర పర్యావరణ శాఖా మంత్రి హర్షవర్దన్ పిలుపునిచ్చారు. ఢిల్లీలో అతి ప్రమాదకర స్థితికి చేరిన వాతావరణ కాలుష్యాన్ని నివారించే ప్రచారంలో ఉపాధ్యాయులు ఇతోధిక బాధ్యత స్వీకరించాలని పిలుపునిచ్చారు.

02/04/2018 - 02:50

ఆహిర్ కులానికి చెందిన 502 మంది పెళ్లికూతుర్లు చేతులకు గోరింటాకు పెట్టుకుంటున్న దృశ్యమిది. ఈ విధంగా గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకునేందుకు ప్రయత్నించారు.
సూరత్‌లో శనివారం సామూహిక వివాహాలు నిర్వహించిన సందర్భంగా ఈ సంఘటన చోటుచేసుకుంది.

02/04/2018 - 02:45

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: బోఫోర్స్ ముడుపుల కేసును మళ్లీ దర్యాప్తు చేయడానికి అనుమతించాలని కోరుతూ కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసుకు సంబంధించి తాజా పత్రాలు, ఆధారాలు తనకు లభ్యం అయ్యాయని కోర్టుకు విన్నవించింది. ఢిల్లీలోని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అశు గార్గ్ ముందు సీబీఐ గురువారం ఈ పిటిషన్ సమర్పించింది. రూ.

02/04/2018 - 02:44

భద్రాచలం టౌన్, ఫిబ్రవరి 3: దండకారణ్యం శనివారం తుపాకీ కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఈ నెల 5న మావోయిస్టులు దండకారణ్య బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏదో ఒక హింసాత్మక సంఘటన నెలకొంటుందని భావిస్తున్న తరుణంలో మావోయిస్టులు విరుచుకుపడి కలకలం రేపారు. పట్టపగలే చత్తీస్‌గఢ్ సరిహద్దులోని పామేడు పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న తోగ్గూడెం అవుట్ పోస్టుపై 150 మంది మావోయిస్టులు దాడికి యత్నించి, కాల్పులకు తెగబడ్డారు.

02/04/2018 - 02:39

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: సరకు రవాణా చేస్తున్న ఒక నౌక ఆఫ్రికా సమీపంలో గల్లంతైంది. అందులని 22 మంది భారత నావికుల ఆచూకీ తెలియడం లేదు. నౌకను హైజాక్ చేసి ఉంటారని లేదా భారీ సొమ్మును డిమాండ్ చేయడానికి వీలుగా నావికులను బంధించి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Pages