S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/04/2018 - 02:13

చండీగఢ్, ఫిబ్రవరి 3: జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు హర్యానాలోని మహేంద్రగఢ్ ప్రాంతంలో దాడికి గురైన సంఘటన శనివారం కాశ్మీర్ అసెంబ్లీని కుదిపేసింది. జమ్ముకాశ్మీర్‌కు చెందిన ఇద్దరు సెంట్రల్ వర్శిటీ విద్యార్థులు హర్యానాలో శుక్రవారం దాడికి గురవ్వడం తెలిసిందే. అయితే, దాడి సమాచారం అందుకున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు.

02/04/2018 - 01:37

గౌహతి, ఫిబ్రవరి 3: విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) అత్యంత ప్రాధాన్యమిచ్చే దేశంగా భారత్‌ను తీర్చిదిద్దడానికి తమ ప్రభుత్వం ఎన్నో కీలక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. తమ ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా గత ఆర్థిక సంవత్సరం 60 బిలియన్ డాలర్ల ఎఫ్‌డీఐలు దేశంలోకి వచ్చాయని ప్రకటించారు.

02/04/2018 - 01:01

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురై వర్ధంతి సందర్భంగా శనివారం చెన్నైలో డీఎంకె నేత
ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతి ర్యాలీకి భారీగా తరలివచ్చిన అభిమానులు

02/04/2018 - 00:48

ముంబయి లో శనివారం నిర్వహించిన లాక్మీ ఫ్యాషన్ వీక్‌లో అనుశ్రీ రెడ్డి డిజైన్ చేసిన వస్త్రాలతో తళుక్కుమన్న ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా

02/04/2018 - 00:41

గన్నవరం, ఫిబ్రవరి 3: విజయవాడ (గన్నవరం) ఎయిర్‌పోర్డులో దట్టమైన పొగమంచు కారణంగా విమానాలు రెండు గంటలు ఆలస్యంగా దిగాయి. శనివారం ఉదయం పొగమంచు తెరలు రన్‌వేని కప్పివేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో దిగాల్సిన విమానాలకు సిగ్నల్స్ అందక గాలిలోనే చక్కర్లు కొట్టాయి. ఉదయం 7.40 గంటలకు హైదరాబాద్ నుండి రావాల్సిన ట్రూజెట్ విమానం 10 గంటలకు చేరుకుంది.

02/04/2018 - 00:40

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: ఎవరి నాయకత్వంలో పని చేయాలనే అంశంపై ప్రతిపక్షంలో విభేదాలు పొడసూపాయి. సోనియా గాంధీ స్థానంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుండి ప్రతిపక్షానికి ఎవరు నాయకత్వం వహించాలనే చర్చ ప్రారంభమైంది. ఎన్‌సీపీ అధినాయకుడు శరద్ పవార్, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిపక్షం నాయకత్వంపై కనే్నశారు.

02/03/2018 - 05:13

బెలోనియా (త్రిపుర), ఫిబ్రవరి 2: త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాష్ట్రానికే కాకుండా మొత్తం దేశానికే దిశానిర్దేశన చేస్తాయని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ అన్నారు. ఈనెల 18న జరిగే ఎన్నికలు అనేక కోణాల్లో రాజకీయంగా కీలకమైనవేనని ఉద్ఘాటించారు.

02/03/2018 - 05:09

కోల్‌కతా, ఫిబ్రవరి 2: పశ్చిమ బెంగాల్‌లోని కాంగ్రెస్ పార్టీ నాయకులంతా పిగ్మీలని, తమ మద్దతు లేకుండా ఆ పార్టీ ఢిల్లీలో పనిచేయలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని వ్యతిరేకించేందుకు కాంగ్రెస్ నేతలు సిపిఎమ్‌తో కుమ్మక్కయ్యారని మమత ధ్వజమెత్తారు.

02/03/2018 - 01:04

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: ఆంధ్రప్రదేశ్‌కు సహాయం చేయాలనే ప్లకార్డ్‌తో రాజ్యసభలో వౌనవ్రతం చేసిన ఏపీ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కె.వి.పి.రామచందర్‌రావుపై రాజ్యసభ ఉపాధ్యక్షుడు పి.జె.కురియన్ మండిపడ్డారు. రామచందర్ రావు ఎందుకిలా వ్యవహరిస్తున్నారు, ఈయనకు పిచ్చి పట్టింది, చెప్పేది కూడా వినిపించుకోవటం లేదు, ఇలాగే వ్యవహరిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకోవలసి వస్తుందని అంటూ కురియన్ ఆయనపై నిప్పులు కురిపించారు.

02/03/2018 - 01:01

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: కేంద్ర బడ్జెట్‌పై తెలుగుదేశం అధినాయకులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు, కోపతాపాలపై తొందరపడి వ్యాఖ్యానించకూడదని బి.జె.పి భావిస్తొంది. కేంద్ర బడ్జెట్ మొత్తం దేశానికి సంబంధించినది, అన్ని అంశాలను లోతుగా పరిశీలించిన తరువాతనే కేటాయింపులు జరుగుతాయనేది మరిచిపోరాదని బి.జె.పి జాతీయ నాయకులు చెబుతున్నారు.

Pages