S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/03/2018 - 01:45

న్యూఢిల్లీ, జనవరి 2: చారిత్రక ట్రిపుల్ తలాక్ బిల్లు బుధవారం రాజ్యసభలో చర్చకువస్తోంది. బిల్లును మంగళవారం రాజ్యసభ కార్యకలాపాల్లో పొందుపర్చినా, దాన్ని సభలో ప్రతిపాదించక పోవటంతో చర్చించే ఆస్కారం కలగలేదు. ఎన్డీయేకు నాయకత్వం వహిస్తున్న బీజేపీకి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు జరుగుతున్న తెరవెనుక చర్చలు కొలిక్కి రాకపోవడంతోనే బిల్లుపై మంగళవారం ఎలాంటి అడుగూ పడలేదు.

01/03/2018 - 00:41

హైదరాబాద్, జనవరి 2: సికింద్రాబాద్ ఆర్మీ విభాగం 2017లో రెండు అతి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచ రికార్డులను నెలకొల్పినందుకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్ధ ఎండి డాక్టర్ క్రిస్టినా జడ్ చోగ్తూ అభినందించారు. 2017లో జరిగిన ఆర్మీడే సందర్భంగా అతి పెద్ద స్వచ్చంద రక్త దానం, అవగాహన శిబిరాన్ని సికింద్రాబాద్ ఆర్మీ నిర్వహించింది.

01/02/2018 - 04:13

చిత్రాలు.. కొత్త సంవత్సరం సందర్భంగా సోమవారం రాష్టప్రతి భవన్ వద్ద తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన ప్రజలతో రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్.
*శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రధాని నరేంద్ర మోదీ

01/02/2018 - 03:30

కోల్‌కతా, జనవరి 1: దేశ చరిత్రను వక్రీకరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, అవి అత్యంత ప్రమాదకరమని ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ జనరల్ ప్రెసిడెంట్ కేఎం షరిమలీ హెచ్చరించారు. ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ హిందుత్వం అజెండాగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. మతప్రాతిపదికపై దేశాన్ని విడదీయడానికి కుట్ర జరుగుతోందని ఢిల్లీ యూనివర్శిటీ చరిత్ర విభాగం మాజీ ప్రొఫెసర్ విమర్శించారు.

01/02/2018 - 03:28

న్యూఢిల్లీ, జనవరి 1: దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం భారీగాట్రాఫిక్ జామ్ అయింది. కొత్త సంవత్సర వేడుకలుకోసం ఒక్కసారిగా ప్రజలు రోడ్డెక్కడంతో న్యూఢిల్లీలోని ఇండియా గేట్, కన్నాట్‌ప్లేస్, కరోల్‌బాగ్ తదితర ప్రాంతాలతోపాటు, న్యూఢిల్లీ లోపలకి ప్రవేశించే రోడ్లన్నీ ట్రాఫిక్‌తో కిక్కిరిసిపోయాయి. ఇండియాగేట్ వద్దకు వేలాది మంది పర్యాటకులు రావడంతో వేలాది వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి.

01/02/2018 - 03:27

న్యూఢిల్లీ, జనవరి 1: పార్లమెంట్‌లో అత్యంత తక్కువ ధరలకు లభించే ఆహారం మరింత రుచికరంగా అందించేందుకు రైల్వే శాఖ సమాయత్తం అవుతోంది. ప్రస్తుతం రైల్వే శాఖ నేతృత్వంలో పార్లమెంట్‌లో నడిచే క్యాంటీన్‌లో నూతన పాలసీ ప్రకారం ప్రముఖ సంస్థల్లో శిక్షణ పొందిన, అర్హత ఉన్నవారిని మాత్రమే క్యాంటీన్ సిబ్బందిగా తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

01/02/2018 - 03:26

న్యూఢిల్లీ, జనవరి 1: సంక్షుభిత కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పడుతున్నాయంటూ చెప్పుకుంటూ వస్తున్న భద్రతా దళాలకు నమ్మలేని నిజం ఒకటి తెలిసొచ్చింది. పుల్వామాలోని సిఆర్‌పిఎఫ్ క్యాంప్‌పై ఆదివారం ఉగ్రవాదులు జరిపిన దాడితో భద్రతా దళాలే కాదు యావద్దేశం ఆశ్చర్యచకితులు కావాల్సిన పరిస్థితి. ఈ ఉగ్రదాడిలో ఐదుగురు సైనికులను పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే.

01/02/2018 - 03:25

న్యూఢిల్లీ, జనవరి 1: భారతదేశ శక్తిసామర్థ్యాలను బయటి ప్రపంచానికి తెలియజేసేందుకు సైనికులు దృఢచిత్తం, రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగాలని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ పిలుపునిచ్చారు. కొత్త సంవత్సరం ఆరంభం సందర్భంగా సోమవారం ఆయన ఈ మేరకు సైనికులను ఉద్దేశించి ఒక సందేశం ఇచ్చారు. గత యేడాది ఇంట, బయట ఎదురైన ఎన్నో సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు సైనికులు చూపిన చొరవ, తెగువలను ఆయన అభినందించారు.

01/02/2018 - 03:23

విజయవాడ, జనవరి 1: భారతీయ సంస్కృతిలోను, నిత్య జీవితంలోనూ పుస్తకం ఎంతో కీలకమైనదని ప్రధానంగా మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించడంలో పూర్వకాలం నుంచి కూడా పుస్తకాలు ముఖ్య భూమికను పోషిస్తున్నాయని భారత ఉప రాష్టప్రతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. అక్షరానికి దైవస్థానం ఇస్తున్నామంటే జ్ఞానానికి ఇచ్చినట్లే..

01/02/2018 - 02:03

కోల్‌కతా, జనవరి 1: యువతరంలో సైన్స్‌పట్ల మరింత ఆసక్తి పెంచేందుకు వ్యవహారిక భాషలో శాస్త్ర సమాచార సరఫరా సాగాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. భాష సౌకర్యవంతంగా ఉండాలే తప్ప, భారమైనది కాకూడదన్నారు. నవీన భారతాన్ని దృష్టిలో పెట్టుకుని పరిశోధనలు, ఆవిష్కరణలు సాగాలని శాస్తవ్రేత్తలకు పిలుపునిచ్చారు.

Pages