S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

01/01/2018 - 03:37

న్యూఢిల్లీ, డిసెంబర్ 31: మహిళలపై అత్యాచారానికి ఒడిగట్టినట్టు లేదా వేధించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక మైనర్ బాలుడికి సంబంధించిన వివరాలను ఏ దశలోనూ బహిర్గతం చేయడానికి వీల్లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. బాలనేరస్థుల న్యాయ చట్టానికి లోబడి నిందితుల పేర్లనుగానీ ఇతరత్రా వివరాలనుగానీ బయటపెట్టడానికి ఎంతమాత్రం వీల్లేదని హిమా కోహ్లీ, రేఖాపల్లితో కూడిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం తెలిపింది.

01/01/2018 - 03:09

ద్విచక్ర వాహనంపై ఇద్దరు మించి ప్రయాణించడానికి వీలులేదు. అలాంటిది ఓ చిన్న స్కూటర్ మీద ఏకంగా 9 మంది పిల్లలతో ప్రయాణం సాగిస్తున్నాడు. పంజాబ్‌లోని జలంధర్‌లో ఆదివారం నాటి దృశ్యమిది

01/01/2018 - 02:13

చెన్నై, డిసెంబర్ 31: ఏడాది అంతంలో తమిళ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. కొంతకాలంగా అంచనాలకే పరిమితమైన రజనీ రాజకీయ పార్టీ ఆవిర్భావ ప్రకటన వెలువడింది. చెన్నైలో వారం రోజులుగా సాగుతోన్న నాటకీయ ఫక్కీకి తమిళ తలైవా తెరదించుతూ, మనసులో మాట ప్రకటించారు. ఆదివారం అభిమానులతో సమావేశం నిర్వహించి రాజకీయ పార్టీ ఆవిర్భావంపై బహిరంగ ప్రకటన చేశారు.

01/01/2018 - 02:10

శ్రీనగర్, డిసెంబర్ 31: దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సిఆర్‌పిఎఫ్ శిక్షణ శిబిరంపై సాయుధ మిలిటెంట్లు పంజా విసిరారు. ఆదివారం తెల్లవారుఝామున ఆకస్మికంగా దాడులకు తెగబడిన ఘటనలో ఐలుగురు జవాన్లు మృతిచెందారు. మృతుల్లో ఒకరు నౌగం ప్రాంతవాసి సైఫుద్దీన్‌గా గుర్తించినట్టు అధికారులు చెప్పారు.

12/31/2017 - 03:53

ముంబయి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిర్వహిస్తున్న టెక్‌ఫెస్ట్ 2017లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సోఫియా. ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో సిటిజన్‌గా దీనికి గుర్తింపు లభించింది.

12/31/2017 - 03:47

అహ్మదాబాద్‌లో శనివారం పూల ప్రదర్శనను గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సతీ సమేతంగా ప్రారంభించి, ప్రదర్శనలో ఉంచిన పూలను తిలకించి ముగ్ధులయ్యారు. అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో తీర్చిదిద్దిన పూలబాలిక పలువురిని విశేషంగా ఆకర్షిస్తోంది.

12/31/2017 - 03:13

బెంగళూరు, డిసెంబర్ 30: ‘భారత్‌లో మానసిక అనారోగ్యం అంటువ్యాధిలా ప్రబలుతోంది. 2022నాటికి ఈ పరిస్థితిని రూపుమాపడానికి సమాయత్తంకండి’ అని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ పిలుపునిచ్చారు. బెంగళూరులో శనివారం జరిగిన మానసిక ఆరోగ్యం, నాడీశాస్త్ర జాతీయ కేంద్రం (ఎన్‌ఐఎంహెచ్‌ఎఎన్‌ఎస్) 22వ స్నాతకోత్సవంలో యువ వైద్యులకు పిలుపునిస్తూ, జనాభా ప్రాతిపదికన భారత్‌లో మరింతమంది మానసిక ఆరోగ్య నిపుణుల అవసరం ఉందన్నారు.

12/31/2017 - 03:12

ముంబయి, డిసెంబర్ 30: ఎట్టకేలకు పద్మావతి చిత్రం వివాదాలు కొలిక్కివచ్చాయి. సెన్సార్ సర్ట్ఫికేట్ జారీ చేయాలంటే షరతులకు తలొగ్గాలని, చిన్న చిన్న మార్పులు చేయాలన్న సిబిఎఫ్‌సి సూచనలకు నిర్మాతలు అంగీకరించటంతో వివాదాలు సద్దుమణిగాయి. దీంతో యుఏ సర్ట్ఫికేట్ ఇవ్వడానికి సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్ట్ఫికేట్ (సిబిఎఫ్‌సి) నిర్ణయం తీసుకుంది.

12/31/2017 - 03:10

న్యూఢిల్లీ, డిసెంబర్ 30: దేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా 2017 సంవత్సరంలో తెలుగువారి గౌరవం పెరిగిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. శనివారం ఢిల్లీ ఆంధ్రా అసోసియేషన్ 2018 క్యాలెండర్‌ను ఆయన అవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సమాచార శాఖ కమిషనర్ మాడభూషి శ్రీధర్, ఆంధ్రా భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్, ఆంధ్రా అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

12/31/2017 - 03:08

ఒడిశాలోని కంధమాల్ జిల్లాలో జన్మించిన అవిభక్త కవలలను ఢిల్లీలోని ఎయమ్స్ వైద్యులు ఇటీవల శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించి విడదీశారు. పిల్లలు జగ, కాలియాలతో వారి తల్లిని ఈ చిత్రంలో చూడవచ్చు. శనివారం ఈ పిల్లలను అత్యవసర విభాగం నుంచి జనరల్ వార్డుకు తరలించారు.

Pages