S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/18/2016 - 05:50

న్యూఢిల్లీ: దేశద్రోహం కేసులో అరెస్టయిన జెఎన్‌యు విద్యార్థి నాయకుడు కన్హయ కుమార్‌ను బుధవారం పాటియాలా కోర్టుకు తీసుకొచ్చిన సందర్భంగా తీవ్రస్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యాహ్నం 2.45 నిమిషాలకు కన్హయను కోర్టుకు తీసుకువచ్చిన సందర్భంగా ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆయనపై దాడి చేసినట్లుగా చెబుతున్నారు.

02/18/2016 - 07:44

న్యూఢిల్లీ: కేంద్ర పథకం అమృత్ కింద ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 45 నగరాల అభివృద్ధికి వచ్చే ఐదేళ్లలో 37వేల 58 కోట్లు కేటాయించినట్టు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. కేంద్రం అందరికీ ఇళ్లు పథకం కింద మంజూరు చేసిన 4లక్షల 75వేల ఇళ్లలో దాదాపు సగభాగాన్ని తెలుగు రాష్ట్రాలకే కేటాయించినట్టు బుధవారం మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు.

02/18/2016 - 03:55

న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్టప్రతి పాలనను తొలగించాలని కేంద్ర మంత్రివర్గం బుధవారం సిఫార్సు చేసింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి సంబంధించి గవర్నర్‌ను నియంత్రించలేమంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో అరుణాచల్ ప్రదేశ్‌పై చర్చించారు. అనంతరం రాష్టప్రతి పాలనను తొలగించాలంటూ సిఫార్సు చేశారు.

02/17/2016 - 17:57

న్యూదిల్లి:జెఎన్‌యులో జాతివ్యతిరేక వ్యాఖ్యలేవీ తాను చేయలేదని, కొందరు వ్యక్తులు చేసిన నినాదాలు దురదృష్టకరమని జాతివ్యతిరేక వ్యాఖ్యల కేసులో నిందితుడు కన్నయ్యకుమార్ పేర్కొన్నాడు. బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కన్నయ్య కోర్టుకు వచ్చినపుడు రెండోసారి దాడి జరిగిన విషయం తెలిసిందే. కాగా ఈ దాడికి పాల్పడిన న్యాయవాదిని గుర్తించిన కన్నయ్య జెఎన్‌యులో జరిగిన వివాదంపై వ్యాఖ్యానించాడు.

02/17/2016 - 17:06

న్యూదిల్లి:జెఎన్‌యులో జాతివ్యతిరేక చర్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అరెస్టయిన విద్యార్థిసంఘం నాయకుడు కన్నయ్యకుమార్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానం ఆదేశించింది. కాగా పాటియాలా కోర్టువద్దకు బుధవారం వచ్చిన కన్నయ్యకుమార్‌పై కొందరు న్యాయవాదులు దాడిచేశారు.

02/17/2016 - 16:36

న్యూదిల్లి:అరుణాచల్ ప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వివిధ పార్టీలు ముందుకు వస్తున్న నేపథ్యంలో రాష్టప్రతిపాలనకు తెరవేసేందుకు కేంద్రప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. బుధవారం మధ్యాహ్నం జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకుని రాష్టప్రతికి సిఫారసు చేసినట్లు తెలిసింది.

02/17/2016 - 16:18

దిల్లీ: దేశద్రోహం కేసులో పోలీసులు అరెస్టు చేసిన జెఎన్‌యు విద్యార్థి నేత కన్నయ్య కుమార్‌ను ఇక్కడి పటియాలా హౌస్ కోర్టు వద్దకు తీసుకువచ్చిన సందర్భంగా బుధవారం మళ్లీ ఘర్షణలు చెలరేగి ఉద్రిక్తతకు దారితీసింది. తమపై కొందరు లాయర్లు దాడిచేశారని జర్నలిస్టులు ఆరోపిస్తున్నారు. లాయర్లు రెండు వర్గాలుగా విడిపోయి దాడులకు దిగారు. కన్నయ్యకుమార్‌పై కొందరు న్యాయవాదులు దాడి చేశారని సమాచారం.

02/17/2016 - 12:09

దిల్లీ: నగరంలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు)లో ఇటీవలి ఘర్షణల నేపథ్యంలో 13 మంది పోలీసులను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. దేశద్రోహం కేసులో జెఎన్‌యు విద్యార్థి కన్నయ్య కుమార్‌ను కొద్దిరోజుల క్రితం పాటియాలా హౌస్‌లోని కోర్టులో హాజరు పరచినప్పుడు విద్యార్థులు, అధ్యాపకులు, జర్నలిస్టులపై న్యాయవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే.

02/17/2016 - 12:03

భువనేశ్వర్: నల్గొండ జిల్లాకు చెందిన పోలీసులు ఒడిశా పోలీసుల సహకారంతో రౌర్కెలాలోని ఓ ఇంటిపై మంగళవారం అర్ధరాత్రి దాడిచేసి నలుగురు సిమి ఉగ్రవాదులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య సుమారు మూడు గంటలసేపు కాల్పులు జరిగాయి. గత ఏడాది నల్గొండ జిల్లా కోదాడలో కాల్పుల సంఘటనతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు రౌర్కెలాలో తలదాచుకున్నట్లు తెలంగాణ పోలీసులకు సమాచారం అందింది.

02/17/2016 - 08:25

న్యూఢిల్లీ: పటియాలా హౌస్ కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో విలేఖర్లపై జరిగిన దాడిని నిరసిస్తూ మంగళవారం న్యూఢిల్లీలో వందలాది మంది పాత్రికేయులు, జాతీయ ప్రచార మాధ్యమాలకు చెందిన పలువురు సంపాదకులు కదం తొక్కారు.

Pages