S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/30/2017 - 02:16

బెంగళూరు, డిసెంబర్ 29: అంతరిక్ష పరిశోధనల్లో ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్న ఇస్రో మరో అద్భుత ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. పోలార్ రాకెట్ ద్వారా వచ్చే నెల 10న కార్టోశాట్ సిరీస్‌తోపాటు 31 ఉపగ్రహాలను ఏకకాలంలో ప్రయోగించేందుకు సన్నద్ధమవుతోంది.

12/30/2017 - 02:12

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: లోక్‌సభ ఆమోదించిన ట్రిపుల్ తలాక్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో సవరణలు ప్రతిపాదించనున్నది. ట్రిపుల్ తలాక్ ఇవ్వటాన్ని క్రిమినల్ చర్యగా నిర్దారించి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించటాన్ని సవరించాలన్నది కాంగ్రెస్ సవరణ ప్రధాన లక్ష్యం.

12/30/2017 - 02:11

ముంబయి, డిసెంబర్ 29: ముంబయిలో గురువారం రాత్రి పొద్దుపోయిన తరువాత జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 14మంది సజీవదహనమయ్యారు. ఓ ఇంటిపైకప్పుపై పుట్టిన రోజు వేడుక జరుపుకుంటున్న సమయంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. మరణించిన వాళ్లలో దాదాపు ఎక్కువ మహిళలే ఉన్నారని అధికారులు శుక్రవారం తెలిపారు. ఈ సంఘటనల్లో 21మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు.

12/30/2017 - 00:49

భువనేశ్వర్, డిసెంబర్ 29: రాజ్యాంగ సార్వభౌమత్వం లేకపోతే అరాచక పరిస్థితులు తాండివిస్తాయని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా హెచ్చరించారు. రాజ్యాంగ సార్వభౌమత్వం శిరోధార్యమని, దానికి ప్రతి ఒక్కరూ లోబడి ఉండాల్సిందేనన్నారు.

12/30/2017 - 00:38

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖపట్నంలో ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేసేందుకు 1989 రైల్వే చట్టాన్ని సవరించాలంటూ తెలుగుదేశం సభ్యుడు కింజారపు రామమోహన్ నాయుడు శుక్రవారం లోక్‌సభలో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రతిపాదించారు.

12/30/2017 - 00:32

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: ట్రిపుల్ తలాక్‌ను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఓ కీలక బిల్లును లోక్‌సభలో ఆమోదించిన నేపథ్యంలో ముస్లిం పురుషుల్లో ప్రబలంగా ఉన్న బహు భార్యత్వాన్ని కూడా నిషేధించాలన్న డిమాండ్లు తీవ్రమవుతున్నాయి. బహు భారత్వమన్నది ట్రిపుల్ తలాక్ కంటే కూడా ఘోరమైనదని ముస్లిం మహిళలు అంటున్నారు.

12/30/2017 - 00:32

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: ఎస్సీ వర్గీకరణపై మందకృష్ణ మాదిగకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రం ప్రభుత్వంపై పోరాటం చేయాలి కాని, రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన కక్ష సాధింపు ఏమిటని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి ప్రశ్నించారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఈ మేరకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

12/30/2017 - 00:31

న్యూఢిల్లీ, డిసెంబరు 29: ఆంధ్రప్రదేశ్‌లో అర్హులైన వారికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లను మంజూరు చేయాలని గ్రామీణ గృహ నిర్మాణశాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నాడు మంత్రి కాలువ శ్రీనివాసులు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమార్‌తో భేటీ అయ్యారు.

12/30/2017 - 00:31

న్యూఢిల్లీ, డిసెంబర్ 29: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో జోక్యం చేసుకొని, త్వరగా పూర్తి చేయాలని ప్రధాని నరేంద్రమోదీకి సీపీఐ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆ పార్టీ నాయకులు డి.రాజా, కె.నారాయణలు పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్రమోదీని కలిశారు.

12/29/2017 - 19:50

భారత న్యాయవ్యవస్థలో 2017 సంవత్సరం చిరకాలం గుర్తుండేలా కొన్ని కీలక తీర్పులు వెలువడ్డాయి. ముఖ్యమైన కొన్ని కేసులకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన చారిత్రక తీర్పులు న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం పెంచేందుకు దోహదపడ్డాయి. కొన్ని తీర్పులు కొందరికి మోదం కలిగించగా, న్యాయస్థానాలు తీసుకున్న కొన్ని నిర్ణయాలు దేశవ్యాప్త చర్చకు దారితీశాయి.

Pages