S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/29/2017 - 19:48

మూడేళ్ల క్రితం కేంద్రంలో అధికారానికి వచ్చిన భారతీయ జనతాపార్టీకి ఇటు రాజకీయంగాను, అటు ఎన్నికల పరంగాను ఈ ఏడాది అన్ని విధాలుగా కలసివచ్చింది. రాష్టప్రతి ఎన్నిక మొదలుకొని తాజాగా జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల వరకూ బీజేపీ అన్ని విధాలుగా విజయదుందుభి మోగించింది.

12/29/2017 - 03:52

సూళ్లూరుపేట, డిసెంబర్ 28: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో ప్రయోగానికి సన్నద్ధమైయింది. నాలుగు నెలల విరామం అనంతరం మరోసారి పిఎస్‌ఎల్‌వి ప్రయోగానికే ఇస్రో శ్రీకారం చుట్టింది.

12/29/2017 - 03:23

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: ఆధార్ కార్డు లేదన్న సాకుతో అర్జీదారునికి సమాచారం ఇవ్వడానికి నిరాకరిస్తే అది సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) ఉల్లంఘన అవుతుందని, వేధింపులకు గురిచేసినట్టు భావించాల్సి వస్తుందని కేంద్ర సమాచార కమిషన్ (సిఐసి) స్పష్టం చేసింది. సమాచారం ఇవ్వడానికి నిరాకరించినందుకు ‘హడ్కో’ (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్)లోని ఆర్టీఐ వ్యవహారాలను చూసే అధికారికి సిఐసి జరిమానా విధించింది.

12/29/2017 - 03:19

హైదరాబాద్, డిసెంబర్ 28: ఇంజనీరింగ్ పట్ట్భద్రులకు అవకాశాలు తగ్గడంతో దాని ప్రభావం ఇంజనీరింగ్ కాలేజీలపైనా పడింది. దేశవ్యాప్తంగా బిటెక్ కోర్సులో 16.07 సీట్లు ఉండగా, 2017-18 విద్యాసంవత్సరంలో కేవలం 8.67 లక్షల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 54 శాతం సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. ఈ ఏడాది 275 కాలేజీల యాజమాన్యాలు మూసివేతకు అనుమతి ఇవ్వాలని ఎఐసిటిఇని కోరాయి.

12/29/2017 - 02:40

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: రాజ్యాంగంపై కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి అనంతకుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు వరుసగా రెండోరోజూ పార్లమెంట్‌లో దుమారం లేపాయి. తాను చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి హెగ్డే లోక్‌సభలో ఎట్టకేలకు క్షమాపణలు చెప్పారు.

12/29/2017 - 02:40

చెన్నై, డిసెంబర్ 28: తమిళనాడులోని ఆర్కేనగర్ అసెంబ్లీ స్థానానికి ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో శశికళ మేనల్లుడు, ఇండిపెండెంట్ అభ్యర్థిగా విజయం సాధించిన టీవీవీ దినకరన్‌కు పరోక్షంగా మద్దతు పలికిన పలువురు ఏఐఏడీఎంకే నాయకులను ఆ పార్టీ బహిష్కరించింది. 44 మందిపై బహిష్కరణ వేటు వేయడంతోపాటు పార్టీలో వివిధ స్థాయిల్లో ఉన్న మరో ఇద్దరిని ఆయా పదవుల నుండి తప్పించింది.

12/29/2017 - 02:39

జమ్మూ, డిసెంబర్ 28: పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పూంఛ్ జిల్లాలోని జమ్మూకాశ్మీర్‌లో గురువారం రెండుసార్లు కాల్పులకు తెగబడింది. ఈ ప్రాంతాల్లోని సరిహద్దులో గల భారత సైనిక దళాలు, పలు గ్రామాలను లక్ష్యంగా చేసుకుని పాక్ ఈ చర్యలకు పాల్పడింది. అయితే, ఈ సంఘటనల్లో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లినట్టు సమాచారం లేదని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

12/29/2017 - 02:38

చిత్రం..లోక్‌సభలో ట్రిపుల్ తలాక్ నిషేధ బిల్లును ప్రవేశ పెట్టడంతో
ఆనందోత్సాహంలో మిఠాయలు తినిపించుకుంటున్న యూపీ ముస్లిం మహిళలు

12/29/2017 - 02:36

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు నుంచి గడిచిన మూడేళ్ల కాలంలో రెండు లక్షల మంది కార్మికులు జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లినట్లు విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకే సింగ్ తెలిపారు.

12/29/2017 - 02:35

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: లోక్‌సభ గురువారం పాకిస్తాన్ ముర్దాబాద్ నినాదాలతో మార్మోగింది. అధికారపక్షంతోపాటు ప్రతిపక్షానికి చెందిన కొందరు ఎంపీలు కూడా పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ భారత నావికా దళం అధికారి కుల్‌భూషణ్ జాదవ్ తల్లి అవంతి, భార్య చేతన పట్ల అవలంభించిన అవమానకర విధానం పట్ల తీవ్ర ఆగ్రహం, ఆవేశం, ఆందోళన వ్యక్తం చేశారు.

Pages