S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/29/2017 - 02:15

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: ఏపీ ప్రభుత్వం వసతి సౌకర్యం కల్పించిన వెంటనే అక్కడ తాత్కాలిక హైకోర్టు ఏర్పాటవుతుందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. హైకోర్టు విభజన విషయమై మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం లోక్‌సభలో ఒక ప్రకటన చేశారు.

12/29/2017 - 03:50

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: త్రిపుల్ తలాక్‌ను శిక్షార్హ నేరంగా పరిగణిస్తూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన బిల్లుపై సభ్యులందరూ ఏకాభిప్రాయ ప్రాతిపదికగా ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ చేసిన ప్రసంగ వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత కుమార్ గురువారం నాడిక్కడ మీడియాకు వివరించారు.

12/29/2017 - 02:10

న్యూఢిల్లీ,డిసెంబర్ 28: దేశంలోని ముస్లిం మహిళల గుండెలపై కుంపటిగా మారిన ‘ట్రిపుల్ తలాక్’ను క్రిమినల్ నేరంగా పరిగణిస్తూ, ఈ తప్పు చేసే వారికి మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించేలా ‘ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లు’ను లోక్‌సభ గురువారం ఆమోదించింది. ఈ బిల్లుపై అధికార, విపక్షాలకు చెందిన సభ్యులు సుదీర్ఘంగా చర్చించడంతో రాత్రి సమయంలో తలాక్ బిల్లును ఆమోదించారు.

12/28/2017 - 00:10

కేంద్ర మంత్రిపై లోక్‌సభలో విపక్షం పట్టు కొనసాగిన వాయిదాల పర్వం
రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలంటూ నిరసన లౌకికవాదులను కించపరిచారని ఆగ్రహం

12/27/2017 - 23:53

లోక్‌సభలో తెరాస లొల్లి దిగివచ్చిన ఎన్డీయే సర్కారు
నేడు ప్రత్యేక ప్రకటనకు హామీ

12/27/2017 - 22:53

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా జైరామ్ ఠాకూర్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఐదుసార్లు బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన ఠాకూర్ బుధవారం ఎన్డీయే ప్రభుత్వ పెద్దలు, పార్టీ దిగ్గజాల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఠాకూర్ సొంత జిల్లా మండీలోని ప్రతిష్టాత్మక రిడ్జ్ మైదానంలో ఏర్పాటు చేసిన వేదికపై హిమాచల్ గవర్నర్ ఆచార్య దేవ్త్ ఆయనచేత పదవీ, గోప్యతా ప్రమాణం చేయించారు.

12/27/2017 - 22:50

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గుజరాత్ శాసన సభ ఎన్నికల సందర్భంగా చేసిన ప్రసంగాల్లో ఎక్కడా మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, మాజీ ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీకి దేశం పట్ల ఉన్న నిబద్ధతను ప్రశ్నించలేదు, ప్రశ్నించాలని ఆలోచించలేదని రాజ్యసభ నాయకుడు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం రాజ్యసభలో ప్రకటించారు.

12/27/2017 - 22:47

చెన్నై, డిసెంబర్ 27: చెన్నైలోని ఆర్కేనగర్ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో డీఎంకే ఓటమికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ కారకుడని ఆ పార్టీ బహిష్కృత నేత, స్టాలిన్ సోదరుడు ఎంకే అళగిరి ధ్వజమెత్తారు. ఒక్క ఆర్కేనగర్‌లోనే కాదు... ఎక్కడ ఎన్నికలు జరిగినా స్టాలిన్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నంతవరకు డీఎంకే విజయం సాధించలేదని ఒక మ్యాగ్‌జైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తీవ్రంగా వ్యాఖ్యానించారు.

12/27/2017 - 22:46

ఇస్లామాబాద్, డిసెంబర్ 27: కులభూషణ్ జాదవ్‌ను అతని భార్య, తల్లి కలిసేందుకు మానవతా దృక్పథంతో అనుమతి ఇచ్చామని చెబుతున్న పాకిస్తాన్ మరోసారి తన కుటిల మనస్తత్వాన్ని బయటపెట్టుకుంది. ఇస్లామాబాద్ జైలుకు వచ్చినపుడు జాదవ్ భార్య వేసుకున్న బూట్లను స్వాధీనం చేసుకుని వాటిని తిరిగి ఇచ్చేందుకు అక్కడి భద్రతా అధికారులు నిరాకరించిన సంగతి తెలిసిందే.

12/27/2017 - 22:45

లక్నో, డిసెంబర్ 27: ట్రిపుల్ తలాఖ్‌పై ప్రభుత్వం చేయబోతున్న చట్టం ఖరాన్ భావాలకు విరుద్ధంగా ఉంటే ఆమోదించేది లేదని బుధవారం ముస్లిం మహిళా సంఘాల ప్రకటించాయి. ట్రిపుల్ తలాఖ్‌పై నేడు పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టనున్న తరుణంలో ముస్లిం మహిళా సంఘాలు ఈ ప్రకటన చేయడం గమనార్హం. ‘పెళ్లి ఒక ఒప్పందమే. ఆ ఒప్పందానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఎవ్వరైనా శిక్షార్హులే.

Pages