S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/27/2017 - 22:45

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: రెండేళ్ల క్రితం సంభవించిన తీవ్ర భూకంపం నేపథ్యంలో ఎవరెస్టు శిఖరం ఎత్తును సమష్టిగా మళ్లీ కొలుద్దామంటూ భారత్ చేసిన ప్రతిపాదనను నేపాల్ తిరస్కరించింది. ఈ విషయంలో ఎవరితోనూ చేతులు కలిపేది లేదని, తామే ఎవరెస్టు శిఖరం ఎత్తును మళ్లీ అంచనా వేస్తామని వెల్లడించింది.

12/27/2017 - 22:44

చెన్నై, డిసెంబర్ 27: తమిళనాడు సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. తన రాజకీయ ప్రవేశంపై మరో నాలుగు రోజులు వేచిచూడండని ఆయన సూచించారు. ఈ విషయమై ఈ నెల 31న తన నిర్ణయం వెల్లడిస్తానని ఆయన ప్రకటించారు. రజనీ తాజా ప్రకటనతో తమిళనాట ఆయన రాజకీయాల్లోకి వచ్చేందుకు దారులు సుగమమైనట్టు తెలుస్తోంది.

12/27/2017 - 22:43

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ట్రిపుల్ తలాఖ్, హాజ్ అంశాలపై ముసురుకున్న వివాదాలు, చోటుచేసుకున్న సంస్కరణల... ఆయా వర్గాల సంక్షేమానికి కేంద్రం చేపట్టిన చర్యలు మరుగునపడేలా చేశాయని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అభిప్రాయపడ్డారు. అయితే, బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని బుధవారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ వెల్లడించారు.

12/27/2017 - 03:07

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: కనీస మర్యాదలకు తూట్లు పొడుస్తూ కులభూషణ్ జాదవ్ తల్లి, భార్య పట్ల పాక్ అధికారులు అత్యంత అమానవీయంగా ప్రవర్తించారని భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

12/27/2017 - 02:59

చెన్నై, డిసెంబర్ 26: రాజకీయ రంగంలోకి తాను వచ్చే విషయమై ఈ నెల 31న కీలక ప్రకటన చేస్తానని సూపర్‌స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. రజనీ రాజకీయ పార్టీని స్థాపిస్తారన్న ఊహాగానాలు చాలాకాలంగా చోటుచేసుకున్నప్పటికీ ఇన్నాళ్లూ ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు. అయిత, తొలిసారిగా ఆయన తన నిర్ణయం ప్రకటించేందుకు సిద్ధం కావడం గమనార్హం.

12/27/2017 - 02:57

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: గూఢచర్యం ఆరోపణలపై పాక్ జైల్లో ఉన్న కుల్‌భూషణ్ జాదవ్ కలిసిన సందర్భంగా అతని తల్లి అవంతి, భార్య చేతన్‌కుల్‌ను పాక్ అధికారులు అవమానించడంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు మండిపడ్డారు.

12/27/2017 - 02:57

శ్రీనగర్, డిసెంబర్ 26: జైషే మహమ్మద్ టాప్ కమాండర్ నూర్ మహమ్మద్ తాంత్రే మంగళవారం సైనిక దళాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో హతుడయ్యాడు. కాశ్మీర్‌లోయలో ఉగ్రవాదాన్ని మళ్లీ రగిలించేందుకు జైషే మహమ్మద్ చేపట్టిన చర్యల్లో తాంత్రే కీలకపాత్ర వహించాడు.

12/27/2017 - 02:55

13 ఏళ్ల క్రితం చెన్నయ్ మహానగారాన్ని ఓ భయానక సునామీ అతలాకుతలం చేసింది.
ఇప్పటికీ కోలుకోలేనంత తీవ్ర స్థాయలో వందలాది మందిలో మానసిక వేదననే మిగిల్చింది.
ఆనాటి ప్రకృతి విలయంలో మరణించిన వారికి చెన్నయ్‌లో నివాళులు అర్పిస్తున్న మహిళలు.

12/27/2017 - 02:52

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: ఐఏఎస్ అధికారులంతా వచ్చే నెలాఖరునాటికి స్థిరాస్తుల వివరాలు కచ్చితంగా వెల్లడించాలని కేంద్ర పరిపాలన, సిబ్బంది శిక్షణ విభాగం (డివోపిటి) ఆదేశించింది. ఆస్తుల వివరాలు అందచేయని పక్షంలో భవిష్యత్ పదోన్నతులు, విదేశీ పోస్టింగ్‌లపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.

12/27/2017 - 02:50

న్యూఢిల్లీ, డిసెంబర్ 26: భారత కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) 92వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం మంగళవారం ఢిల్లీలో ఘనంగా జరిగింది. దేశ రాజధానిలోని అజయ్‌భవన్‌లో గల పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టీ సీనియర్ నేతలు డి.రాజా, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ, కార్మిక సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డి.రాజా పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఎగురవేశారు.

Pages