S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/09/2017 - 02:51

భాభార్ (గుజరాత్), డిసెంబర్ 8: కాంగ్రెస్ నుంచి సస్పెండైన మణిశంకర్ అయ్యర్‌పై ప్రధాని నరేంద్రమోదీ రెండోరోజుకూడా మరిన్ని తీవ్ర ఆరోపణలతో ధ్వజమెత్తారు. తాను పాకిస్తాన్ పర్యటనలో ఉండగా తనను ‘తొలగించడానికి’ మణిశంకర్ సుపారీ (కాంట్రాక్ట్) ఇచ్చారని మోదీ ఆరోపించారు. దారిలోనే తనను తొలగించడం ద్వారా భారత్-పాకిస్తాన్ మధ్య శాంతి స్థాపనకు ప్రయత్నించారని ఆయన అన్నారు.

12/08/2017 - 03:24

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: ‘ఈపీఎఫ్-95’ స్కీమ్ కింద పెన్షన్ మొత్తాన్ని కనిష్ఠంగా రూ.7,500కు పెంచాలని గురువారం దేశ రాజధానిలో వేలాదిమంది పెన్షనర్లు ప్రదర్శన జరిపారు. ‘ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ’ పరిధిలోకి వచ్చే వారికి ప్రస్తుతం నెలకు వెయ్యి రూపాయల పెన్షన్ చెల్లిస్తున్నారు.

12/08/2017 - 02:57

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: అంబేద్కర్ పేరుతో ఓట్లు దండుకుంటున్న పార్టీలు దేశానికి ఆయన చేసిన సేవలను తుడిచిపెట్టేసే ప్రయత్న చేశాయని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు. 33 ఏళ్ల క్రితం తలపెట్టిన అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్ర నిర్మాణానికి అరకొర కృషి చేయడమే ఇందుకు నిదర్శమన్నారు.

12/08/2017 - 02:55

న్యూఢిల్లీ, డిసెంబల్ 7: డోక్లామ్ గొడవ నుంచి ఇటీవలే బైటపడిన భారత, చైనా దేశాలు ఇప్పుడు తాజాగా మరో వివాదం మొదలైంది. భారత సైన్యానికి చెందిన ఒక డ్రోన్ ఆకాశ భాగంలోకి వచ్చి పతనం కావటం ద్వారా తమ సార్వభౌమత్వానికి భంగం కలిగించిందని చైనా రక్షణ శాఖ గురువారం నిరసన తెలపగా డ్రోన్ అదుపుతప్పి చైనా ఆకాశ భాగంలోకి వళ్లిందేతప్ప ఉద్దేశపూర్వకంగా పంపించింది కాదని భారత్ స్పష్టం చేసింది.

12/08/2017 - 02:53

కోట్లాది రూపాయల విలువైన బంగాళా దుంపలను ఇటు యూపీ రైతాంగం, అటు కోల్డ్‌స్టోరేజీ యజమానులు వీధుల్లో పడేస్తున్నారు. ఈ బంగాళా దుంపలను అమ్మడం వల్ల తమకు పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. అంతేకాదు వీటిని నెలల తరబడి కోల్డ్‌స్టోరేజీలో ఉంచేందుకు అవసరమైన ఖర్చునూ భరించలేకపోతున్నామని చెబుతున్నారు.

12/08/2017 - 02:51

రాజ్‌కోట్, డిసెంబర్ 7: భారతీయ జనతా పార్టీకి కంచుకోట అయిన రాజ్‌కోట్ పశ్చిమ నియోజకవర్గంలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కాంగ్రెస్ అభ్యర్థి ఇంద్రనీల్ రాజ్యగురు నుంచి గట్టిపోటీని ఎదుర్కొంటున్నారు. గతంలో ‘రాజ్‌కోట్ రెండో నియోజకవర్గం’గా వ్యవహరింపబడిన ఈ స్థానంలో 1985 నుంచి అప్రతిహతంగా బీజేపీ విజయ పతాకాన్ని ఎగురవేస్తోంది. ఈ నెల 9న పోలింగ్ జరిగే రాజ్‌కోట్ పశ్చిమ నియోజకవర్గంపైనే అందరి దృష్టి పడింది.

12/08/2017 - 02:50

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: 2005 నాటి ‘ప్రశ్నకు నగదు’ కుంభకోణానికి సంబంధించి పదకొండు మంది మాజీ ఎంపీలపై దాఖలైన నేరారోపణలపై విచారించేందుకు ఢిల్లీలోని ఓ న్యాయస్థానం రంగం సిద్ధం చేసింది. 11మంది మాజీ ఎంపీలతో పాటు మరో వ్యక్తిపై విచారణకు ప్రత్యేక న్యాయమూర్తి కిరణ్ బన్సాల్ ఆదేశాలు జారీ చేశారు.

12/08/2017 - 02:49

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: దేశవ్యాప్తంగా మహిళపై జరుగుతున్న నేరాలను అదుపు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సీపీఎం ఆరోపించింది. మహిళలపై నేరాలు పెరుగుతునే ఉన్నట్టు నేషనల్ క్రైమ్ బ్యూరో తాజా నివేదికలో పేర్కొనడంపై పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ ఆందోళన వ్యక్తం చేశారు.

12/08/2017 - 03:09

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: బ్యాంకు ఖాతాలు, సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం చేసుకోడానికి వచ్చే ఏడాది మార్చి 31 వరకూ గడువుపొడిగించడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్రం స్పష్టం చేసింది. సంక్షేమ పథకాలు, బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ దాఖలైన పిటిషన్‌ను రాజ్యాంగ ధర్మాసనం వచ్చేవారం విచారించనుంది.

12/08/2017 - 01:36

న్యూఢిల్లీ, డిసెంబర్ 7: భారత్‌లో వైభవోపేతంగా నిర్వహించే కుంభమేళాకు యునెస్కో గుర్తింపులభించింది. కుంభమేళాను వారసత్వ సంస్కృతిగా యునెస్కో ప్రకటించింది. ఈ మేరకు సంస్థ ట్వీట్టర్‌లో పోస్టు చేసింది. దక్షిణ కొరియాలోని జెజులో జరిగిన యునెస్కో 12వ వార్షిక సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 4న ప్రారంభమైన ఈ సమావేశాలు 9 వరకూ జరుగుతాయి.

Pages