S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/06/2017 - 23:33

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: సరైన ఎదుగుదల లేకుండా వారం రోజుల క్రితం జన్మించిన శిశువు ప్రసవ సమయంలోనే మరణించినట్లు వైద్యులు పొరపాటున ప్రకటించగా, చికిత్స పొందుతూ ఆ శిశువు బుధవారం నిజంగానే మరణించింది. ఈ ఉదంతం దేశ రాజధానిలోని మాక్స్ ఆస్పత్రిలో జరిగింది. గత నెల 30వ తేదీన తమ ఆస్పత్రిలో జన్మించిన శిశువు వారం రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఆ ఆస్పత్రి వర్గాలు బుధవారం తెలిపాయి.

12/06/2017 - 23:32

నోయిడా, డిసెంబర్ 6: నోయిడాలోని ఓ అపార్టుమెంట్‌లో తల్లి, కుమార్తె దారుణ హత్యకు గురయ్యారు. బ్యాట్‌తో కొట్టి, స్క్రూడైవర్‌తో పొడిచి చంపేశారు. రెండు రోజులుగా అపార్ట్‌మెంట్ తలుపులు మూసివుండటం, ఫోన్లకు స్పందించకపోవడంతో ఆ కుటుంబానికి సన్నిహితుడైన అపార్ట్‌మెంట్ వాసి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తలుపులు పగులగొట్టడంతో వీరిద్దరి హత్య వెలుగుచూసింది.

12/06/2017 - 23:32

లక్నో, డిసెంబర్ 6: ముమ్మారు ‘తలాక్’ చెప్పి ముస్లిం పురుషులు విడాకులు తీసుకోవడాన్ని నిరోధిస్తూ కేంద్రం ప్రతిపాదించిన ముసాయిదా బిల్లుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుముఖత తెలిపింది. ఈ ముసాయిదా బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా యూపీ నిలిచింది.

12/06/2017 - 23:31

ముంబయి, డిసెంబర్ 6: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు రాహుల్ గాంధీని నాయకుడిని చేశాయని శివసేన అభివర్ణించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఆలయ సందర్శనలు చేపట్టడం హిందుత్వ విజయంగా పేర్కొంది. ఈ పరిస్థితిని బీజేపీ ఆహ్వానించక తప్పదని వ్యాఖ్యానించింది. శనివారం తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న గుజరాత్‌లో రాహుల్ గాంధీ విస్తృత ప్రచారం నిర్వహించడం తెలిసిందే.

12/06/2017 - 23:30

బెంగళూరు, డిసెంబర్ 6: మహిళా ప్రయాణీకురాలిని కారులో బంధించి, ఆమెపై ఓలా డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన బెంగళూరులో జరిగింది. బాధితురాలు ఫిర్యాదు చేశాక ఈ ఉదంతం మూడు రోజుల ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఘటన ఆదివారం రాత్రి పదిన్నర గంటల సమయంలో నగరంలోని రింగ్‌రోడ్డులో జరిగిందని బాధితురాలైన 23 ఏళ్ల ఫ్యాషన్ డిజైనర్ పోలీసులకు సమాచారం ఇచ్చింది.

12/06/2017 - 02:49

బళ్ళారి, డిసెంబర్ 5: కర్నాటకలో జేడీయస్ సొంతంగా అధికారంలోకి వస్తుందని మాజీ ప్రధాని, పార్టీ జాతీయ అధ్యక్షుడు దేవెగౌడ అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకోబోమని ఆయన అన్నారు. బళ్ళారిలో మంగళవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో తమ పార్టీ బలంగా ఉందన్నారు. కాంగ్రెస్, బీజేపీకి దీటుగా ఓట్లు సాధించి అధికారం చేజిక్కించుకుంటామన్నారు.

12/06/2017 - 02:16

రాజ్‌కోట్, డిసెంబర్ 5: గుజరాత్‌లో మళ్లీ ఆలయ రాజకీయం తెరపైకి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల రాజకీయం పటేల్ వర్గం సారథ్యంలోని రెండు ప్రధాన ఆలయాల చుట్టూ పరిభ్రమిస్తోంది. అందులో ఒకటి పటేదార్ వర్గంలోని లీయువా కమ్యూనిటీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాజకోట్ జిల్లాలోని కోదల్‌ధామ్ ఆలయం అయితే, రెండోది ఉత్తర గుజరాత్‌లోని మెహ్‌సన్ జిల్లాలో కేద్వా కమ్యూనిటీ నిర్మించిన ఉమియా ధామ్ ఆలయం.

12/06/2017 - 02:13

అంజార్ (గుజరాత్), డిసెంబర్ 5: ‘ఎంతసేపూ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీని విమర్శించడం తప్ప, గుజరాత్ భవిత విషయమై ప్రధాని మోదీ వద్ద ఎలాంటి వ్యూహం లేదు..’ అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మంగళవారం కచ్ జిల్లాలో పలు చోట్ల బహిరంగ సభల్లో మాట్లాడుతూ మోదీపై విమర్శలు సంధించారు.

12/06/2017 - 02:11

అహ్మదాబాద్, డిసెంబర్ 5: హోరాహోరీగా సాగుతున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ‘ఓఖి’ తుపాన్ తీవ్ర ఆటంకంగా మారింది. అరేబియా సముద్ర తీరప్రాంతంలో తీవ్రమైన చలిగాలు వీస్తున్నాయి. గజగజ లాడిస్తున్న వాతావరణం మధ్య మంగళవారం ఎన్నికల ప్రచారం సాగలేదు. అన్ని ప్రధాన పార్టీల నాయకుల సభలు, ర్యాలీలు రద్దయ్యాయి. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎన్నికల సభలు రద్దయ్యాయి.

12/06/2017 - 02:08

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించిన అనంతరం సోదరి ప్రియాంకా గాంధీ ఆయనకు అనధికార రాజకీయ సలహాదారుగా పని చేయనున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ సలహా మేరకే ప్రియాంకా గాంధీ సోదరుడు రాహుల్‌కు అనధికార రాజకీయ సలహాదారుగా పని చేసేందుకు సిద్ధమయ్యారని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.

Pages