S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/05/2017 - 04:18

పాట్నా, డిసెంబర్ 4: గుజరాత్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ వైఖరి మితిమీరిన అతివాదానికి అద్దం పడుతోందని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దుయ్యబట్టారు.

12/05/2017 - 04:16

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: బొగ్గు కుంభకోణంలో సీబీఐ మాజీ డైరెక్టర్ రంజిత్ సిన్హా పాత్రపై విచారణ ఎంతవరకు వచ్చిందో తెలియజేయాలని ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)ను సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. నాలుగు వారాల్లోగా ఇందుకు సంబంధించిన నివేదికను కోర్టుకు సమర్పించాలని కూడా స్పష్టం చేసింది.

12/05/2017 - 04:16

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: హైదరాబాద్‌లో ఇటీవల సంచలనం సృష్టించిన మాదక ద్రవ్యాల కేసు విచారణ వాయిదా పడింది. విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల వినియోగం, ప్రభావాలపై కోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన నిపుణులతో కూడిన కమిటీ నివేదిక ఫిబ్రవరి నెలలోగా అందజేస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది.

12/05/2017 - 04:15

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: ఉమ్మడి హైకోర్టుతో పాటుగా దేశ వ్యాప్తంగా పూర్తిస్థాయిలో ప్రధాన న్యాయమూర్తులను నియమించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. పిటిషన్‌ను 10 వారాల తరువాత విచారణ చేపడుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఉమ్మడి హైకోర్టు న్యాయవాది సత్యం రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు.

12/05/2017 - 04:15

అయోధ్య, డిసెంబర్ 4: తమ జీవితాలను త్యాగం చేసిన ‘మందిర యోధుల’ కలలు ఫలించాలంటే అయోధ్యలో రామమందిరం నిర్మించాల్సిందేనని విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) నేత అంబుజ్ ఓజా అన్నారు. అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేసి ఈ నెల 6వ తేదీ నాటికి పాతికేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్ నేత ఈ ప్రకటన చేయడం గమనార్హం.

12/05/2017 - 04:14

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: టిబెట్ ప్రాంతంలో ఇటీవల సంభవించిన భారీ భూకంపం కారణంగానే పవిత్ర బ్రహ్మపుత్ర నదీ జలాలు బురదమయమైనట్టు పార్లమెంటరీ కమిటీ అధ్యయనంలో తేలిందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మొగ్వాల్ స్పష్టం చేశారు. ‘పరిసరాల్లోని కాలుష్యం నదీ గర్భానికి చేరుతుండటంవల్లే బ్రహ్మపుత్ర జలాలు నలుపెక్కుతున్నట్టు ఫిర్యాదులు అందిన మాట వాస్తవమే.

12/05/2017 - 04:26

తిరువనంతపురం, డిసెంబర్ 4: ఓఖి తుపానులో గల్లంతైన 100మంది మత్స్యకారుల ఆచూకీ కోసం కేరళ తీరంలో పెద్దఎత్తున ఆపరేషన్స్ నిర్వహిస్తున్నామని కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఆపరేషన్స్‌లో నేవీ ఓడలు, హెలికాఫ్టర్లు, తీర రక్షణ దళాల బోట్లు, వైమానిక దళాలు నిమగ్నమయ్యాయని, మత్స్యకారుల ఆచూకీ తెలిసేవరకూ ఆపరేషన్స్ కొనసాగుతాయని స్పష్టం చేశారు.

12/05/2017 - 04:24

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ నామినేషన్ వేసిన నేపథ్యంలో ఆ పార్టీ వారసత్వ ప్రక్రియను మొగుల్ పాలకుల వారసత్వంతో పోలుస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు. అవినీతి కేసులో బెయిల్‌పై ఉన్న వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా నిర్ణయించే విషయంలో కాంగ్రెస్ పార్టీ అన్ని రకాలుగా ప్రజా విలువలను మంటగలిపిందన్నారు.

12/05/2017 - 02:59

న్యూఢిల్లీ, డిసెంబర్ 4: యువశకానికి కాంగ్రెస్ నాంది పలికింది. వారసత్వ రాజకీయాల్లో భాగంగా అంతా ఊహించినట్టే ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికవుతున్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ ఒక్కరే సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఇతర నేతలెవ్వరూ నామినేషన్ వేయకపోవటంతో రాహుల్ ఏకగ్రీవ ఎన్నికకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి మొత్తం 89 నామినేషన్లు దాఖలయ్యాయి.

12/05/2017 - 02:57

ముంబయి, డిసెంబర్ 4: దాదాపు నాలుగు దశాబ్దాలపాటు తనదైన విశిష్ట నటనతో రాణించిన బాలివుడ్ నటుడు శశికపూర్ సోమవారం సాయంత్రం కన్నుమూశారు. 79 సంవత్సరాల శశికపూర్ ఇక్కడి కోకిలాబెన్ ధీరూభాయ్ అంబాని ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్టు రణధీర్ కపూర్ వెల్లడించారు. గత కొన్ని సంవత్సరాలుగా శశికపూర్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని, అలాగే నిరంతరం డయాలసిస్ చేయించుకుంటున్నారని రాజ్‌కపూర్ కుమారుడైన రణధీర్ వెల్లడించారు.

Pages