S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/18/2015 - 05:43

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో గురువారం ఢిల్లీలో సమావేశమైన గూగూల్ సిఇఓ సుందర్ పిచాయ్

12/18/2015 - 05:38

సిఎంను, స్పీకర్‌ను ‘తొలగించిన’ రెబెల్ ఎమ్మెల్యేలు
‘ముఖ్యమంత్రి’గా తిరుగుబాటు ఎమ్మెల్యే ఎన్నిక
అడ్డుకున్న గౌహతి హైకోర్టు

12/18/2015 - 05:32

బిజూ జనతాదళ్ ఎంపీలకు ప్రధాని హామీ
నిర్మాణాన్ని నిలిపివేయాలన్న డిమాండ్‌పై స్పందించని మోదీ

12/18/2015 - 05:31

లోక్‌సభలో మంత్రి గోయల్ ప్రకటన

12/17/2015 - 17:15

చిత్తూరు : చిత్తూరు జిల్లా సదుం మండలం ఎర్రాజివారిపాలెం గ్రామంలో విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలతో సహా దంపతులు సీకల చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు ఐరాల మండలం దిగువనాగులవారిపల్లెకు చెందిన వారిగా గుర్తించారు. దంపతుల ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

12/17/2015 - 17:13

న్యూఢిల్లీ : చండీగఢ్ విమానాశ్రయానికి భగత్‌సింగ్ పేరుపెట్టాలని డిమాండ్ చేస్తూ ఆప్, సీపీఎం, జేడీయూ సభ్యులు పార్లమెంట్ ఆవరణలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేశారు. చండీగఢ్ ఎయిర్‌పోర్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం భగత్‌సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించింది. ఇపుడు ఎన్డీయో ఆ పేరును మార్చి ఆర్‌ఎస్‌ఎస్ నేత మంగల్‌సేన్ పేరుపెట్టాలని భావించటాన్ని సభ్యులు తప్పుపట్టారు.

12/17/2015 - 17:12

ఛత్తీస్ గఢ్: ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో కాంఖేర్ జిల్లాలోని అంబబేడ పీఎస్ పరిధి బడేపీజోడి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోలకు మధ్య ఎదురు కాల్పలు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురుమావోలు మృతి చెందినట్లు సమాచారం.

12/17/2015 - 17:10

న్యూఢిల్లీ :డీడీసీఏ స్కామ్‌కు సంబంధించి కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ తన పదవికి రాజీనామా చేయాలని ఆప్ డిమాండ్ చేసింది. గురువారంనాడు ఆప్ నేతలు విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీ, జిల్లా క్రికెట్ సంఘం చైర్మన్‌గా జైట్లీ ఉన్నపుడు అవినీతికి పాల్పడ్డారని, ఈ అవినీతికి సంబంధించిన దస్త్రాలను మాయం చేసేందుకే రాజేంద్రకుమార్ కార్యాలయంలో సీబీఐ సోదాలు చేసిందని ఆప్ నేత కుమార్ విశ్వాస్ ఆరోపించారు.

12/17/2015 - 17:10

న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీపై ఆప్, కాంగ్రెస్ చేసిన అవినీతి ఆరోపణలను బీజెపీ ఖండించింది. జైట్లీకి మద్దతు పలికింది. జైట్లీ అవినీతి ఆరోపణలపై రుజువులుంటే ఇన్నాళ్లు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించింది.

12/17/2015 - 17:09

న్యూఢిల్లీ : రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు గురువారంనాడు కూడా ఆందోళన కొనసాగించారు. అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహారిస్తున్నారని సభ్యులు పోడియాన్ని చుట్టుముట్టి ఆందోళన చేశారు. సభ ప్రారంభమైనప్పటి నుంచి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. డిప్యూటీ చైర్మన్ కురియన్ సర్దిచెప్పటానికి ప్రయత్నించినప్పటికీ సభ్యులు వినకపోవటంతో సభను వాయిదా వేశారు.

Pages