S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/02/2017 - 03:00

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: డబ్బులకు కక్కుర్తిపడి పేషెంట్ చనిపోయినా వైద్యం అందిస్తున్నట్టు నటించే ఆసుపత్రి యాజమాన్యాల గురించి నిత్యం పేపర్లలో చదువుతూ ఉంటాం. జబ్బుపడ్డ అవయవం బదులు మరోదానికి శస్తచ్రికిత్స చేసిన ఘనులనూ చూశాం. అయితే దేశ రాజధాని ఢిల్లీలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రి వీటన్నింటినీ తిరగరాసింది. ఆసుపత్రిలో పుట్టిన కవలలు చనిపోయారని ప్రకటించేశారు.

12/02/2017 - 01:48

న్యూఢిల్లీ, డిసెంబర్ 1:అత్యంత కఠినమైన నిబంధనలతో ట్రిపుల్ తలాక్ చట్ట ముసాయిదా బిల్లుకు కేంద్రం రూపకల్పన చేస్తోంది. ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హ నేరంగా పరిగణించడంతో పాటు అందుకు పాల్పడ్డ వారికి మూడేళ్ల కారాగార శిక్షనూ విధించే రీతిలో ముసాయిదాకు మెరుగులు దిద్దుతోంది.

12/02/2017 - 04:03

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: హిందుస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు వచ్చిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకున్నారు. జనవరి 1న అమెరికా అధ్యక్షుడిగా వైదొలగిన తర్వాత ఒబామా భారత ప్రధాని నరేంద్ర మోదీని కలుసుకోవడం ఇదే మొదటిసారి.

12/02/2017 - 03:22

న్యూఢిల్లీ, డిసెంబర్ 1: ప్రజలను కొట్టి ప్రయివేట్ వర్గాలకు దోచి పెడుతున్నారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే వైఫల్యాలను ఎత్తిచూపిస్తూ రోజుకో ప్రశ్నతో మోదీపై దాడి చేస్తున్న రాహుల్, శుక్రవారం విద్యుత్ కొనుగోలు అంశాన్ని తీవ్రంగా ప్రస్తావించారు.

12/02/2017 - 03:23

లక్నో, డిసెంబర్ 1: ఉత్తరప్రదేశ్ స్థానిక ఎన్నికల్లో అధికార బిజెపి దూసుకుపోతోంది. మేయర్ ఎన్నికల్లో పది స్థానాలను సొంతం చేసుకున్న బిజెపి మరో ఆరుచోట్ల కూడా ఆధిక్యతతో దూసుకుపోతోంది. అమేథీ సహా అన్ని స్థానాల్లోనూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ పేలవమైన ఫలితానే్న కనబరచింది. మాయావతి సారథ్యంలోని బిఎస్‌పి అభ్యర్థి అలీగఢ్ మేయర్ సీటును దక్కించుకుని అధినేత్రికి కొంత ఊరటనందించారు.

12/01/2017 - 03:28

న్యూఢిల్లీ, నవంబర్ 30: రోజుకో కొత్త ఆరోపణతో ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శల దాడి చేస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తన దూకుడును మరింతగా పెంచారు. గుజరాత్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఆయన మోదీని విమర్శించడమే కాదు, తన ప్రశ్నలకు సమాధానాలివ్వాలంటూ స్వరం పెంచుతున్నారు. రాహుల్ శుక్రవారం ఎన్నికల ప్రచారంలో గుజరాతీలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించారు.

12/01/2017 - 03:25

న్యూఢిల్లీ, నవంబర్ 30: చారిత్రక కథాంశం ఇతివృత్తంగా నిర్మితమైన ‘పద్మావతి’ చిత్రానికి సంబంధించి పార్లమెంటరీ ప్యానెల్ ఆ చిత్ర దర్శకుడు సంజయ్‌లీలా బన్సాలీని ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో ఈ ప్యానెల్ ముందు హాజరైన బన్సాలీ ‘పద్మావతి - పూర్తి కల్పిత చిత్రం. ఇందులో చరిత్రను వక్రీకరించిన అంశాలేవీ లేవు’ అని స్పష్టం చేశారు.

12/01/2017 - 03:24

న్యూఢిల్లీ, నవంబర్ 30: ముంబయి దాడి సూత్రధారి హఫీజ్ సరుూద్ విషయంలో పాకిస్తాన్ మరింత దూకుడునే అవలంబిస్తోంది. అనేకమంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న 26/11 కుట్రదారును చట్టప్రకారం శిక్షించాలంటూ భారత్ చేస్తున్న విజ్ఞప్తులను తిరస్కరిస్తూ వచ్చిన పాక్, ఇప్పుడు మరింతగా రెచ్చిపోయింది.

12/01/2017 - 03:23

న్యూఢిల్లీ, నవంబర్ 30: దేశవ్యాప్తంగా జరుగుతున్న నేరాల్లో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. 2016 సంవత్సరంలో జరిగిన నేరాల చిట్టాను నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) గురువారం విడుదల చేసింది. దీని ప్రకారం హత్యలు, మహిళలపై జరిగిన దాడుల్లో ఉత్తరప్రదేశ్ మొదటిస్థానంలో నిలిచింది. 4,889 హత్య కేసులు నమోదు కాగా 2,581 కేసులతో బిహార్ చివరిస్థానంలో నిలిచింది.

12/01/2017 - 03:23

న్యూఢిల్లీ, నవంబర్ 30: ప్రపంచం మారిపోతోంది. వారాలు, నెలలు, సంవత్సరాలుపట్టే పనులు చిటికెలో, అదీ క్షణాల్లో తేలిపోయే సాంకేతిక విజ్ఞానం అందుబాటులోకి వస్తోంది. ఇటీవలికాలంలో కృత్రిమ మేథస్సు అన్నది అన్నిరంగాల్లో విస్తృతస్థాయి మార్పులకు వేదికవుతోంది. తాజాగా ఏఐగా పేర్కొనే ఈ కృత్రిమ మేథస్సును వినియోగించుకునే ఒక సాధనాన్ని రూపొందించారు. దీనివల్ల కలిగే ఉపయోగం అంతా ఇంతా కాదు.

Pages