S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/29/2017 - 04:27

న్యూఢిల్లీ, నవంబర్ 28: హిందీ చలనచిత్రం ‘పద్మావతి’ విడుదల కాకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలైన ఓ పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. ఈ సినిమాకు ఇంకా సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వని ప్రస్తుత పరిస్థితుల్లో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

11/29/2017 - 03:52

న్యూఢిల్లీ, నవంబర్ 28: ప్రముఖ విమానయాన సంస్థ ‘ఎయిర్ ఇండియా’ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఢిల్లీ విమానాశ్రయంలో ఇద్దరు మహిళలు పరస్పరం కొట్టుకున్న సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. వీరిలో ఒకరు మహిళా ప్రయాణికురాలు కాగా, మరొకరు ఎయిర్ ఇండియా డిప్యూటీ మేనేజర్ కావడం గమనార్హం.

11/29/2017 - 03:52

న్యూఢిల్లీ, నవంబర్ 28: కేరళ లవ్ జిహాదీ కేసులో సుప్రీం కోర్టు నిర్ణయాన్ని బాధిత మహిళ తండ్రి కెఎం అశోకన్ హర్షించారు. సుప్రీం కోర్టు తీర్పు తమకు ఎంతో ఊరట నిచ్చిందని మంగళవారం అతడు వ్యాఖ్యానించాడు. తన కుమార్తె హదియా మెడిసిన్ విద్యను అభ్యసించడానికి ధర్మాసనం అనుమతి ఇవ్వడంపై అశోకన్ ఆనందం వ్యక్తం చేశాడు. హదియాను గృహనిర్బంధం చేసినట్టు వచ్చిన ఆరోపణలను అతడు తీవ్రంగా ఖండించాడు.

11/29/2017 - 03:51

న్యూఢిల్లీ, నవంబర్ 28: గుజరాత్ శాసనసభకు జరగుతున్న ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్టు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనంద భాస్కర్ మంగళవారం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు గుజరాత్‌లోని సూరత్, నవ్సరీ ప్రాంతాల్లో చేనేత కార్మికులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజలు నివసించే ప్రాంతాల్లో ప్రచారం చేయనున్నట్టు తెలిపారు.

11/29/2017 - 03:49

రష్యాలో పర్యటిస్తున్న హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం ఆ దేశ రక్షణ శాఖ మంత్రి వ్లాదిమిర్ పుఖోవ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.

11/29/2017 - 03:54

పాట్నా, నవంబర్ 28: సంజయ్ లీలా భన్సాలీ చిత్రం పద్మావతిపై నిషేధం విధించిన రాష్ట్రాల సరసన బిహార్ చేరింది. వివాదాస్పద చిత్రం పద్మావతిపై ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నిషేధం విధించారు. చిత్రంలో అభ్యంతరకరమైన సన్నివేశాల్లో మార్పులు చేసే వరకూ రాష్ట్రంలో విడుదల చేయడం కుదరదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

11/29/2017 - 03:43

న్యూఢిల్లీ, నవంబర్ 28: ‘ఒక దేశానికి ప్రధానినన్న విషయం నరేంద్ర మోదీ మరచినట్టున్నారు. ఎన్నికల ప్రచారాల్లో స్వోత్కర్షలు తప్ప, అసలు విషయం మాట్లాడటం లేదు’ అని ఆర్థిక శాఖ మాజీ మంత్రి చిదంబరం విరుచుకుపడ్డారు. గత ఎన్నికల ప్రచారాల్లో మోదీ హామీ ఇచ్చిన ‘అచ్చే దిన్’ కోసం 42 నెలలుగా దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారని, అలాంటి మంచి రోజు మాత్రం కనుచూపుమేర కనిపించటం లేదని ఎద్దేవా చేశారు.

11/29/2017 - 03:41

అమరావతి, నవంబర్ 28: సుప్రసిద్ధ విశ్వవిద్యాలయాల రాకతో భవిష్యత్‌లో అమరావతి ఒక విద్యా, విజ్ఞాన కేంద్రంగా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందటం ఖాయమని ఉప రాష్టప్రతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. దేవుడు కనిపించి వరం కోరుకోమంటే బాల్యం తిరిగి ఇవ్వాలని కోరుకుంటానని చెప్పారు.

11/29/2017 - 03:38

పాట్నా, నవంబర్ 28: ఆసుపత్రిలో పురుడుపోసుకున్న తల్లి.. బిల్లు కడితేనే గానీ డిశ్చార్జి చేయని వైద్యులు.. ఆ డబ్బుల కోసం బిచ్చమెత్తుతున్న ఆమె కొడుకు - ఇలాంటి సన్నివేశాలు సాధారణంగా సినిమాల్లో చూస్తుంటాం. ఇలాంటి ఘటనే పాట్నాలో నిజ జీవితంలో జరిగింది. బిచ్చమెత్తుకుంటున్న బాలుడు స్థానిక మీడియా కంటబడటంతో ఈ ఘటన వెలుగుచూసింది. అనంతరం ఓ ఎంపీ జోక్యం చేసుకోవడంతో ఆ బాలింతకు ఆసుపత్రి నుంచి విముక్తి లభించింది.

11/29/2017 - 03:30

హైదరాబాద్, నవంబర్ 28: మలయాళ సినీ నటి, బుల్లితెర నటి వాసంతి (65) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆమె క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె మంగళవారం ఉదయం ఏర్నాకులంలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. నాటకరంగంలో నటన, కెరీర్‌ను ప్రారంభించిన టి. వాసంతి తర్వాత సినిమాలు, టీవీ సీరియల్స్‌లో నటించారు. యవనిక, పుచ్చకోరు ముక్కుతి, నిరాకూటు, గాడ్‌ఫాదర్ ఆమె చేసిన చిత్రాల్లో ప్రముఖమైనవి.

Pages