S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/29/2017 - 02:08

హైదరాబాద్, నవంబర్ 28: అమెరికాతో భారత్ సంబంధాలు మరో మెట్టుపైకి వెళ్లేందుకు వీలుగా భారత ప్రధాని నరేంద్రమోదీ, శే్వతసౌధం సీనియర్ సలహాదారు ఇవాంక ట్రంప్‌ల చర్చలు ఫలప్రదం అయ్యాయి. హైదరాబాద్‌లో మంగళవారం నాడు ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఇవాంక ట్రంప్‌తో ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు.

11/29/2017 - 01:49

హైదరాబాద్, నవంబర్ 28: భారత్- అమెరికాల మధ్య వ్యాపార సంబంధాలు పెంపొందించడమే జీఈఎస్ లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. హైదరాబాద్ టెక్నాలజీకే కాదని, భారత్- అమెరికా ధృడమైన సంబంధాలకు ప్రతీకగా అభివర్ణించారు. హెచ్‌ఐసిసి వేదికగా మంగళవారం సాయంత్రం అమెరికా శే్వతసౌధం సలహాదారు ఇవాంక ట్రంప్‌తో కలిసి ప్రపంచ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సును మోదీ ప్రారంభించారు.

11/29/2017 - 01:41

ఔత్సాహిక భారతం ఉత్తుంగ తరంగమైంది.
అనితర సాధ్యమన్న రీతిలో దాదాపు 30 కిలోమీటర్ల హైదరాబాద్ మహానగర కంఠాభరణంగా మెట్రో
ఆవిష్కృతమైంది. పధ్నాలుగేళ్ల మెట్రో రైలు కలను సాకారం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ స్వీయ ప్రయాణంతో నగర ప్రజల ‘గగనతల యానా’నికి శ్రీకారం చుట్టారు. మెట్రో వెలుగు జిలుగుల మధ్య ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఆశలు, ఆకాంక్షలకు ఉద్దీపనగా గ్లోబల్ శిఖరాగ్ర సదస్సు విజయగాధల వేదికగా

11/28/2017 - 03:32

పాట్నా/న్యూఢిల్లీ, నవంబర్ 27: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఇప్పటివరకు కల్పించిన జెడ్‌ప్లస్ కేటగిరి భద్రతను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించింది. జెడ్‌ప్లస్ కేటగిరి భద్రత కింద ఆయనకు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్‌ఎస్‌జీ) కమాండోలు రక్షణ కల్పిస్తున్నారు. కేంద్రం ఈ భద్రతను ఉపసంహరించడం వల్ల ఇకనుంచి లాలు ప్రసాద్‌కు జెడ్ కేటగిరి భద్రత మాత్రమే ఉంటుంది.

11/28/2017 - 03:28

అహమ్మదాబాద్, నవంబర్ 27: గుజరాత్ బిడ్డనైన తనను అవమానపరిస్తే తన రాష్ట్ర ప్రజలు ఎంతమాత్రం సహించరని ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా వివిధ ప్రాంతాల్ల జరిగిన బీజేపీ ర్యాలీలలో ఆయన మాట్లాడుతూ, తన పేదరికాన్ని ఎగతాళి చేయవద్దని కాంగ్రెస్ పార్టీ నేతలను కోరారు.

11/28/2017 - 03:26

న్యూఢిల్లీ, నవంబర్ 27: దేశంలో స్ర్తి, పురుషుల నిష్పత్తి ప్రధాన సమస్యగా ఉందని రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేపట్టిన ‘బేటీ బచావో, బేటీ పడావో’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు వైద్యాధికారులు కూడా తమ వంతు పాత్ర పోషించాలని ఆయన సూచించారు. పేదల పట్ల, సాయం అవసరమైన వారి పట్ల వైద్యులు సానుకూలంగా వ్యవహరించాలని అన్నారు.

11/28/2017 - 03:24

డెహ్రాడూన్, నవంబర్ 27: ఓ వైపు అత్యల్ప ఉష్ణోగ్రతలు ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మరోవైపు సుమారు 200 మంది కూలీలు కేదార్‌పురి పునర్నిర్మాణ పనుల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రముఖ హిందూ ఆథ్యాత్మిక క్షేత్రమైన కేదారినాథ్‌లో 2013లో ఆకస్మిక వరదలు సంభవించి కొండచరియలు విరిగిపడడంతో అనేక భవనాలు, వంతెనలు, ఇతర నిర్మాణాలు నేలమట్టమైన సంగతి తెలిసిందే. ఆనాటి ప్రకృతి బీభత్సం ఫలితంగా కేదారినాథ్ ప్రాంతం కళావిహీనమైంది.

11/28/2017 - 03:22

న్యూఢిల్లీ, నవంబర్ 27: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి వివాదంలో గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలపై మరోసారి స్పష్టత ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం, ఏపీ ఉన్నత విద్యామండలి దాఖలు చేసిన పిటిషన్లను అత్యున్నత ధర్మాసనం తోసిపుచ్చింది.

11/28/2017 - 03:21

న్యూఢిల్లీ, నవంబర్ 27: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెనంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఓ యువతి పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం కొట్టివేసింది. ఎంబి లోకుర్, దీపక్ గుప్తాతో కూడిన ధర్మాసనం పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించింది. ‘తాను జయలలిత కుమార్తెను. కావాలంటే డిఎన్‌ఏ పరీక్ష చేయంచండి’ అంటూ 37ఏళ్ల అమృత అలియాస్ మంజుల సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

11/28/2017 - 03:21

న్యూఢిల్లీ, నవంబర్ 27: ఢిల్లీలో పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఆ శాఖ కార్యదర్శి సీకే మిశ్రా స్పష్టం చేశారు. ఇటీవల పొగ మంచు లాంటివి మళ్లీ పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఒక్క ప్రభుత్వంపైనే నెట్టివేయలేమన్నారు. డబ్ల్యూడబ్ల్యూ ఇండియా ఆధ్వర్యంలో సోమవారం ఇక్కడ జరిగిన ‘క్లీన్ ఎనర్జీ ఇన్నోవేషన్ ఎకోసిస్టం ఇన్ ఇండియా’ కార్యక్రమంలో మిశ్రా మాట్లాడారు.

Pages