S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/28/2017 - 03:19

భోపాల్‌లో మూడు రోజులపాటు జరిగిన అంతర్జాతీయ ముస్లిం సమ్మేళనం సోమవారం ముగిసింది. అనంతరం తిరిగి వెళ్లేందుకు ఇలా ఒక ట్రక్కుపై కిక్కిరిసి వెళుతున్న ముస్లింలు

11/28/2017 - 03:18

సోమవారం పార్లమెంటు భవనంలో రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రిజిష్టర్‌లో సంతకం చేస్తున్న కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి అల్ఫోన్స్ కన్నన్‌తనమ్

11/28/2017 - 02:56

న్యూఢిల్లీ, నవంబర్ 27: అవయవ దానంలో తెలంగాణ రాష్ట్రానికి ఉత్తమ అవార్డు లభించింది. 8వ జాతీయ అవయవ దానం దినోత్సవం సందర్భంగా నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ (ఎన్‌వోటీటీవో) ఢిల్లీలో సోమవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అనుప్రియా పటేల్ చేతుల మీదుగా ఈ అవార్డును రాష్ట్రం తరపున జీవన్‌దాన్ పథకం కో-ఆర్డినేటర్ డాక్టర్ స్వర్ణలత స్వీకరించారు.

11/28/2017 - 02:48

న్యూఢిల్లీ, నవంబర్ 27: తెలంగాణ పోలీసు శాఖలో నియామకాల ప్రక్రియ కొనసాగించాలని ఉమ్మడి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసు విచారణను త్వరగా ముగించాలని ఉమ్మడి హైకోర్టుకు సూచిస్తామని సుప్రీం పేర్కొంది. తెలంగాణ పోలీసు శాఖలో ఏఆర్, సివిల్, వివిధ బెటాలియన్లలో 11,650 పోస్టుల నియామకాల ప్రక్రియను పోలీసు శాఖ చేపట్టింది.

11/28/2017 - 02:35

న్యూఢిల్లీ, నవంబర్ 27: పోలీస్ కస్టడీలో వేధింపులు, అమానవీయ ఘటనలను నిరోధించేందుకు ఓ పటిష్టమైన చట్టాన్ని రూపొందించాలని తాము కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించజాలమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

11/27/2017 - 03:16

న్యూఢిల్లీ, నవంబర్ 26: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను మరింత పటిష్ఠంగా పనిచేయాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారంనాడు రాజీవ్ కుమార్ విలేఖరులతో మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ, దివాల స్మృతి చట్టం బిల్లు, బినామి చట్ట బిల్లులతోపాటు కీలక సంస్కరణలను తీసుకొచ్చిందని పేర్కొన్నారు.

11/27/2017 - 03:16

న్యూఢిల్లీ, నవంబర్ 26: సంచలనాత్మక వ్యాపం నియామక వ్యవహారాల కేసు మళ్లీ తెరపైకి వస్తోంది. దాదాపు 200మంది వైద్యవిద్యార్థుల భవితవ్యం సందిగ్ధంలో పడే అవకాశం కనిపిస్తోంది. మొత్తం నాలుగు ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఈ అక్రమాల ద్వారానే 200మందికి పైగా విద్యార్థులు ప్రవేశాన్ని పొందినట్లుగా సీబీఐ తన తాజా నివేదికలో స్పష్టం చేసింది.

11/27/2017 - 03:15

న్యూఢిల్లీ, నవంబర్ 26: భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలక స్తంభాలైన ప్రభుత్వం, న్యాయవ్యవస్థ, బ్యూరోక్రసీ పరస్పరం కలిసి పనిచేస్తూ నవభారత ఆవిష్కరణకు తోడ్పడాల్సిన అవసరం ఎంతో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ మూడు వ్యవస్థలు పరస్పరం బలోపేతమవుతూనే దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలను ఈడేర్చే నవ వ్యవస్థకు ప్రేరణ కావాలన్నారు.

11/27/2017 - 03:13

ముంబయి, నవంబర్ 26: ‘ఎంతో ప్రేమాభిమానాలు కురిపించిన అందరికీ కృతజ్ఞతలు’ అని మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్న మానుషి చిల్లార్ అన్నారు. ఇటీవల చైనాలో జరిగిన పోటీల్లో మానుషి మిస్ వరల్డ్ 2017 కిరీటాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ పోటీల అనంతరం తొలిసారిగా భారత్‌లోకి అడుగుపెట్టిన ఆమెకు శనివారం ముంబయిలో ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా అభిమానులు, ప్రజలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు.

11/27/2017 - 03:11

న్యూఢిల్లీ, నవంబర్ 26: ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన ‘మేకిన్ ఇండియా’ పథకం జీవచ్ఛవంలా మారిపోయింది.. గుజరాత్‌లో టాటా కంపెనీ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ‘నానో’ కార్ల ప్రాజెక్టుకోసం మోదీ ప్రభుత్వం ఇచ్చిన 33వేల కోట్ల రూపాయల రాయితీ కాస్తా బూడిదలో పోసిన పన్నీరు చందంలా వృథా అయిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో ధ్వజమెత్తారు.

Pages