S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/26/2017 - 03:34

దహెగామ్ (గుజరాత్), నవంబర్ 25: రాఫెల్ ఒప్పందం, జే షా అక్రమ సంపాదన వ్యవహారంలో నిజాలను తెలుసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఎంతమాత్రం సుముఖంగా లేరని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. గుజరాత్ శాసనసభ ఎన్నికల ప్రచారం సందర్భంగా శనివారం ఆయన గాంధీనగర్ జిల్లాలో పలు చోట్ల బహిరంగ సభల్లో ప్రసంగించారు.

11/26/2017 - 03:32

న్యూఢిల్లీ, నవంబర్ 25: పోషకాహార లోపాన్ని నివారించేందుకు 2022 సంవత్సరంలోగా స్పష్టమైన ఫలితాలను సాధించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. అందరికీ పోషకాహారం అందించేందుకు అమలు చేస్తున్న పథకాలను ఆయన శనివారం సమీక్షించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయ్యేనాటికి (2022) పోషకాహారంపై ఫలితాలు ఆశాజనకంగా ఉండాలన్నారు.

11/26/2017 - 03:31

శ్రీనగర్, నవంబర్ 25: దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సెలవుపై ఉన్న ఓ టెరిటోరియల్ ఆర్మీ జవాన్‌ను మిలిటెంట్లు కిడ్నాప్ చేసి, ఆపై హత్య చేశారు. కీగమ్ ఏరియాలోని వాత్‌ముల్లాలోని పండ్లతోటలో బుల్లెట్ గాయాలతో పడి ఉన్న జవాన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. మృతిచెందిన జవాన్‌ను ఇర్ఫాన్ అహ్మద్ డర్‌గా గుర్తించారు.

11/26/2017 - 03:26

జీఎస్‌టీకి వ్యతిరేకంగా అమృత్‌సర్‌లో కాంగ్రెస్ నిర్వహించిన భారీ ర్యాలీలో ప్లకార్డుతో పాల్గొని నినాదాలు చేస్తున్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దూ. ఈ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

11/26/2017 - 03:21

న్యూఢిల్లీ, నవంబర్ 25: ప్రజాస్వామ్యంలో బౌతిక దాడులకు, హింసకు తావులేదని ఉప రాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు. సినిమాలు, కళలు దేశంలో చట్ట నియమాలను తక్కువచేసి చూపకూడదని అన్నారు. పద్మావతి చిత్రం వివాదం గురించి ప్రస్తావించకుండా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. రాజధాని ఢిల్లీలో ఓ సాహితీ సమ్మేళనంలో ఉపరాష్టప్రతి మాట్లాడుతూ ‘సినిమాలకు సంబంధించి కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి.

11/26/2017 - 03:20

కన్యాకుమారి, నవంబర్ 25: మోటర్ సైకిల్‌పై వేగంగా వెళ్తున్న ఓ యువకుడిని అడ్డుకోబోయి అతడిని గాయాలపాలు చేసిన కానిస్టేబుల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. కల్లూపురం ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. రాకేష్ అనే పాతికేళ్ల యువకుడు స్నేహితుడితో కలిసి బైక్‌పై వేగంగా వెళ్తున్నాడు. బైక్ నడుపుతున్న అతడికి హెల్మెట్ కూడా లేదు.దీంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ బైక్‌ను ఆపడానికి ప్రయత్నించాడు.

11/26/2017 - 03:20

చిత్రదుర్గ (కర్నాటక), నవంబర్ 25: నాలుగో నెంబర్ జాతీయ రహదారిపై రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు ఉన్నారని పోలీసులు తెలిపారు. చిత్రదుర్గ జిల్లా హిరియూర్ తాలూకా మెటికుర్కె వద్ద శనివారం ఈ దారుణం చోటు చేసుకుంది. చిత్రదుర్గకు చెందిన అన్వర్ శిను అనే వ్యక్తి కూడా ప్రమాదంలో మరణించాడు.

11/26/2017 - 03:19

మైసూరు, నవంబర్ 25: మైసూరులోని మహారాజా కళాశాల గ్రౌండ్స్‌లో జరుగుతున్న 83వ అఖిల భారత కన్నడ సాహిత్య సమ్మేళనాని బాంబు బెదిరింపు లేఖ రావడంతో నగర పోలీసులు అక్కడ భద్రతను కట్టుదిట్టం చేశారు.

11/26/2017 - 03:19

చెన్నై, నవంబర్ 25: తమిళనాడులోని డాక్టర్ రాధాకృష్ణన్ నగర్ (ఆర్‌కే నగర్) అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చేనెల 21వ తేదీన జరుగనున్న ఉప ఎన్నికలో డీఎంకే అభ్యర్థిగా మళ్లీ ఎన్.మురుదు గణేశ్ బరిలోకి దిగనున్నారు. డీఎంకే శనివారం ఈ విషయాన్ని ప్రకటించింది.

11/26/2017 - 03:18

ఉడిపి (కర్నాటక), నవంబర్ 25: దేశంలో ‘ఉమ్మడి పౌరస్మృతి’ అమలు చేసే వరకూ ప్రతి హిందువూ కనీసం నలుగురు పిల్లలను కనాలని, జనాభా అసమతుల్యతను నివారించేందుకు ఈ విధానాన్ని పాటించాలని హరిద్వార్‌కు చెందిన స్వామి గోవిందదేవ్ గిరీజీ మహరాజ్ పిలుపునిచ్చారు. ఇద్దరు పిల్లల్ని మాత్రమే కనాలన్న నిబంధనను హిందువులకు మాత్రమే వర్తింపచేయరాదన్నారు.

Pages