S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/26/2017 - 03:13

కొట్టాయం, నవంబర్ 25: దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన లవ్ జిహాదీ కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. తాను భర్తతోనే ఉంటానని కేరళ యువతి హదియా వెల్లడించింది. ఈనెల 27న సుప్రీం కోర్టులో లవ్ జిహాదీ కేసుకు సంబంధించి సాక్ష్యం చెప్పడానికి ఆమె ఢిల్లీ బయలుదేరింది. తల్లిదండ్రులు, భద్రతా సిబ్బందితో నెడుంబస్సెరీ విమానాశ్రయానికి చేరుకున్న హదియా వాళ్లను వదిలేసి దూరంగా వచ్చి మీడియాతో మాట్లాడింది.

11/26/2017 - 02:48

న్యూఢిల్లీ, నవంబర్ 25: పార్లమెంట్ శీతాకాల సమావేశాలను నిర్వహించడంలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ శనివారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. కీలకమైన అనేక అంశాలపై పార్లమెంట్‌లో పరీక్షకు నిలవకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం గుజరాత్ శాసనసభ ఎన్నికలకు ముందు ముఖం చాటేస్తోందని కాంగ్రెస్ విమర్శించింది.

11/26/2017 - 01:35

న్యూఢిల్లీ, నవంబరు 25: కృష్ణా- గోదావరి బేసిన్ ఆఫ్ షోర్ చమురు, గ్యాస్ వెలికితీత కార్యకలాపాలపై రాష్ట్రానికి రాయల్టీ ఇవ్వాలన్న ఆంధ్ర విజ్ఞప్తిని కేంద్రం తోసిపుచ్చింది. తీర ప్రాంతాలన్నీ కేంద్రం పరిధిలోకే వస్తాయని అంటూ, రాయల్టీలు ఇవ్వడం సాధ్యంకాదని తెగేసి చెప్పింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అంతర్రాష్ట్ర మండలి 12వ స్థారుూ సంఘ సమావేశం శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగింది.

11/25/2017 - 02:45

న్యూఢిల్లీ, నవంబర్ 24: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ పదిహేనో తేదీనుంచి జనవరి ఐదోతేదీ వరకు నిర్వహించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. శుక్రవారం నాడు కేంద్ర హోంశాఖ రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో పార్లమెంట్ వ్యవహారాల క్యాబినెట్ కమిటి (సిసిపీఎ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంట్ శీతాకాల సమావేశాల తేదీలను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

11/25/2017 - 02:44

న్యూఢిల్లీ, నవంబర్ 24: పొద్దున లేచిన దగ్గర్నుంచి సభలు, సమావేశాల వేదికలపై జాతిపిత మహాత్మాగాంధీ నామస్మరణ చేసే పాలకులు ఆ మహనీయును సమాధి రాజ్‌ఘాట్ పట్ల ఎంత నిర్లక్ష్యం చూపుతున్నారో తెలియజేసే ఘటన ఇది. గాంధీ సమాధి వద్ద కనీస సదుపాయాలు కల్పించని ప్రభుత్వ విభాగాలపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

11/25/2017 - 02:42

తొమ్మిదేళ్ల క్రితం ఇదే ప్రాంతం ఓ కాళరాత్రిని తలపించింది. పాకిస్తాన్ ఉగ్ర మూకల ఉన్మత్త వికటాట్టహాసానికి ముంబయ తాజ్ చలించిపోయంది. మహానగర వాసులు దాదాపు 54 గంటలు హడలెత్తిపోయారు. యావత్ ప్రపంచం నివ్వెరపోయేలా సాగిన పాక్ మూకల రక్తదాహానికి 100 మందికిపైగా బలయ్యారు. ఆనాటి దాడికి ప్రతీకగా నిలిచిన ప్రాంతం శాంతి కపోతాలతో శాంతి నినాదం చేస్తోంది.

11/25/2017 - 02:40

ఉడిపి (కర్నాటక), నవంబర్ 24: అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిరాన్ని నిర్మించాలే తప్ప మరో ‘కట్టడం’ అనే ప్రస్తావన ఉండరాదని రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్ (ఆరెస్సెస్) అధినేత మోహన్ భగవత్ స్పష్టం చేశారు. ఇక్కడ శుక్రవారం ప్రారంభమైన ‘్ధర్మ సంసద్’లో ఆయన మాట్లాడుతూ, అయోధ్యలో మందిరానికి తప్ప మరో కట్టడానికి అవకాశం లేదన్నారు.

11/25/2017 - 02:36

పోర్‌బందర్, నవంబర్ 24: గుజరాత్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మత్స్యకారులపై వరాల జల్లు కురిపించారు. కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే మత్స్యకారుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేస్తామని శుక్రవారం ఆయన హామీ ఇచ్చారు. గుజరాత్‌లో అధికార బిజెపి మత్స్యకారులను పట్టించుకోలేదని రాహుల్ ఆరోపించారు.

11/25/2017 - 02:34

న్యూఢిల్లీ, నవంబర్ 24: అక్రమ నగదు చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)లో బెయిల్ నిబంధనలు అత్యంత కఠినంగా, ఏకపక్షంగా ఉన్నాయని, రాజ్యాంగ విరుద్ధమైన ఆ నిబంధనలను కొట్టివేస్తున్నట్టు సర్వోన్నత న్యాయస్థానం సంచలనాత్మక తీర్పును వెలువరించింది. నిందితులకు ఉండే ప్రాథమిక హక్కులను హరించేలా ఈ నిబంధనలున్నాయని న్యాయమూర్తులు గురువారం ఇచ్చిన తీర్పులో పేర్కొన్నారు.

11/25/2017 - 02:33

ముంబయి, నవంబర్ 24: ట్రిపుల్ తలాఖ్‌ను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకు వస్తే, దానివల్ల ముస్లిం మహిళలకు శాశ్వతంగా స్వేచ్ఛ లభిస్తుందని శివసేన పేర్కొంది. ట్రిపుల్ తలాఖ్‌ను నిషేధిస్తూ ప్రభుత్వం ఈ శీతాకాల సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టడానికి కసరత్తు చేస్తున్న నేపథ్యంలో శివసేన ఈ విధంగా వ్యాఖ్యానించింది.

Pages