S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/21/2017 - 03:22

న్యూఢిల్లీ, నవంబర్ 20: చారిత్రక ఇతివృత్తం ఆధారంగా నిర్మించిన పద్మావతి చిత్రానికి సంబంధించి చెలరేగుతున్న వివాదాలపై కేంద్రం దృష్టిపెట్టిందని సీనియర్ అధికారులు సోమవారం ఇక్కడ స్పష్టం చేశారు. ఈ వివాదాల కారణంగా సినిమా విడుదలను నిర్మాతలు వాయిదా వేసుకున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది.

11/21/2017 - 02:42

జైపూర్, నవంబర్ 20: అయోధ్యలోని రామాలయ వివాదాన్ని కేవలం కోర్టులు మాత్రమే పరిష్కరించగలుగుతాయని బిజెపి సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్యం స్వామి సోమవారం ఇక్కడ స్పష్టం చేశారు. వచ్చే ఏడాదిలోనే అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు మొదలుకాగలవన్న ధీమాను కూడా ఆయన వ్యక్తం చేశారు.

11/21/2017 - 02:40

న్యూఢిల్లీ, నవంబర్ 20: తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా డ్రగ్స్, ఇతర మాదక ద్రవ్యాల వ్యాప్తి నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో వివరాలను వెల్లడించాలని సుప్రీం కోర్టు కేంద్ర హోంశాఖను ఆదేశించింది.

11/21/2017 - 02:39

న్యూఢిల్లీ, నవంబర్ 20: బ్లూవేల్ లాంటి ప్రమాదకర గేమ్‌లపై విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని అన్ని రాష్ట్రాలకు సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల ప్రవర్తలో విపరీత ప్రవర్తనకు దారితీసుకున్న గేమ్‌లపై అప్రమత్తత అవసరమని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఖాన్వికర్, జస్టిస్ డివై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

11/21/2017 - 02:39

న్యూఢిల్లీ, నవంబర్ 20: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై దాఖలైన పిటిషన్ల్‌పై విచారణ జరిపే పరిధి తమకు ఉందా లేదా అన్న దానిపై వచ్చే నెల 6వ తేదీన నిర్ణయిస్తామని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యవరణ అనుమతులపై ఎన్జీటీలో హయాతుద్దీన్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ విచారించింది.

11/21/2017 - 02:39

లక్నో, నవంబర్ 20: దశాబ్దాలుగా సాగుతున్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాద పరిష్కారం విషయంలో ఉత్తరప్రదేశ్‌లోని షియా వక్ఫ్ బోర్డు కీలక ప్రతిపాదన చేసింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలంపై తమ హక్కులను వదలుకుంటామని, దానికి బదులుగా లక్నోలో ఓ మసీదును నిర్మించి ఇవ్వాలని ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనను ఇతర ముస్లిం నేతలు తిరస్కరించారు.

11/21/2017 - 01:53

న్యూఢిల్లీ, నవంబర్ 20: ప్రజాస్వామ్య దేవాలయానికి తాళాలు వేస్తారా అంటూ ప్రధాని నరేంద్ర మోదీపైనా, ఆయన సారధ్యంలోని ఎన్డీయే సర్కార్‌పైనా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నిప్పులు చెరిగారు.

11/21/2017 - 01:52

న్యూఢిల్లీ, నవంబర్ 20: పార్లమెంటు శీతాకాల సమావేశాలపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఆరోపణలను మంత్రి అరుణ్ జైట్లీ తిరస్కరించారు. శీతాకాల సమావేశాలను కచ్చితంగా నిర్వహిస్తామంటూనే, త్వరలోనే తేదీలు ఖరారవుతాయన్నారు. ప్రధాని మోదీ, ఇతర మంత్రులు గుజరాత్ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైనందునే సమావేశాలను ఇప్పటివరకు ఏర్పాటుచేయలేదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదన్నారు.

11/21/2017 - 01:51

న్యూఢిల్లీ, నవంబర్ 20: వారసత్వ రాజకీయాల్లో భాగంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ (47)ని పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన సోమవారం ఉదయం జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో రాహుల్ ఎన్నికకు సంబంధించిన షెడ్యూలును ఖరారు చేశారు.

11/20/2017 - 04:35

హైదరాబాద్/ ఖైరతాబాద్, నవంబర్ 19: ‘ భావాన్ని వ్యక్తీకరించేందుకు, మానసిక వికాసానికి భాష ఉపయోగపడుతుంది..’ అని ఉప రాష్టప్రతి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. దేశంలో ప్రతి ఒక్కరూ హిందీ నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివారం దక్షిణ భారత హిందీ ప్రచార సభ విశారద 16వ స్నాతకోత్సవంలో ఉప రాష్టప్రతి పాల్గొన్నారు.

Pages