S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/18/2017 - 22:13

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ తన రాజకీయ అనుభవాన్నంతా రంగరించి నాటి, నేటి నేతల తీరుతెన్నులను కూలంకషంగా విశే్లషిస్తున్నారు. తాజాగా ఆయన రాసిన ‘సంకీర్ణ శకం’ అనే పుస్తకంలో ఫైర్‌బ్రాండ్ అధినేత్రి మమతా బెనర్జీ గురించి ప్రస్తావించారు. మమతను జన్మతః రెబెల్‌గా పేర్కొన్న ఆయన తనకు సంబంధించిన ఒక ఉదంతాన్ని ఉటంకించారు.

10/18/2017 - 22:12

లక్నో, అక్టోబర్ 18: తాజ్‌మహల్ నిర్మాణంపై బిజెపి నేతలు రోజుకో ప్రకటన చేస్తూ వివాదాన్ని రాజేస్తున్నారు. రెండ్రోజుల క్రితం బిజెపి ఎంపీ సంగీత్ సోమ్ మొఘల్ రాజులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మరిచిపోకముందే అదే పార్టీ సీనియర్ ఎంపీ వినయ్‌కతియార్ బుధవారం అలాంటి ప్రకటనే చేశారు. ఆగ్రాలో శివాలయాన్ని కూల్చేసి మొఘల్ చక్రవర్తిషాజహాన్ తాజ్‌మహల్ నిర్మించాడని కతియార్ విమర్శించారు.

10/18/2017 - 03:21

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: ‘చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌ని ఎవరు కట్టారు? ఎందుకు కట్టారు? అన్నది ముఖ్యం కాదు. చారిత్రక శే్వత కట్టడం వెనుక భారతీయ కూలీల స్వేదం, రుధిరం కలగలిసి ఉన్నాయి’ అని ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. బిజెపి ఎమ్మెల్యే సంగీత్ సోమ్ సంచలన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడవకముందే సిఎం యోగి ఈ విధమైన అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

10/18/2017 - 03:20

న్యూఢిల్లీ / బెంగళూరు, అక్టోబర్ 17: కాంగ్రెస్-బిజెపిల మధ్య రాబర్డ్ వాద్రా వ్యవహారం చిచ్చు రేపుతోంది. పరారీలో ఉన్న ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీతో వాద్రాకు సంబంధాలు ఉన్నాయంటూ వచ్చిన వార్తలపై ఎందుకు మాట్లాడటం లేదంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై బిజెపి విరుచుకుపడింది.

10/18/2017 - 03:13

జైపూర్, అక్టోబర్ 17: కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జోధ్‌పూర్ పర్యటన సందర్భంగా విధులకు గైర్హాజరైన 250 మంది పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నారు. హోమ్‌మంత్రి గార్డ్ ఆఫ్ ఆనర్‌లో పాల్గొనాల్సిన కానిస్టేబుళ్లు మూకుమ్మడి సెలవుపెట్టి గైర్హాజరవ్వడాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. జీతంలో కోత పెట్టారన్న వార్తల నేపథ్యంలో విధులకు డుమ్మాకొట్టారని అంటున్నారు.

10/18/2017 - 03:11

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: భారత్‌తో నేపాల్ సంబంధాలు అత్యంత ప్రత్యేకమైనవని, అయితే రానున్న ఎన్నికల సందర్భంగా కొన్ని పార్టీలు రాజకీయ ప్రయోజనాలకోసం భారత్ వ్యతిరేక మనోభావాలను రెచ్చగొట్టే అవకాశం ఉందని ఆ దేశ రాయబారి దీప్‌కుమార్ ఉపాధ్యాయ మంగళవారం నాడిక్కడ స్పష్టం చేశారు.

10/18/2017 - 03:07

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: కేరళలో హింసకు ఆర్‌ఎస్‌ఎస్, బిజెపియే కారణమని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి ధ్వజమెత్తారు. బిజెపి చేపట్టిన ర్యాలీని ఎద్దేవా చేసిన ఏచూరి ‘బిజెపి తీరు ఇలాగే ఉంటే కేరళలో ఒక్క స్థానంలోనూ విజయం సాధించదు’ అని తేల్చిచెప్పారు. జన రక్షణ పేరుతో బిజెపి చేపట్టి దీక్ష మంగళవారంతో ముగిసింది. ‘కేరళలో అశాంతిని సృష్టించి, హింసను ప్రోత్సహిస్తే సహించేదిలేదు.

10/18/2017 - 03:06

లక్నో, అక్టోబర్ 17: అయోధ్యలో శ్రీరాముని విగ్రహ నిర్మాణం అన్నది మొత్తం హిందువులందరికీ గర్వకారణమని పేర్కొన్న ఉత్తర ప్రదేశ్ షియా సెంట్రల్ బోర్డు ఈ విగ్రహానికి పది వెండి బాణాలను బహుమతిగా ఇస్తామని ప్రకటించింది.

10/18/2017 - 03:06

చిత్రం..అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వ్యవస్థాపకుడు సర్ సయాద్ అహ్మద్ ఖాన్ 200వ జయంతి సందర్భంగా మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వస్తున్న మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ

10/18/2017 - 03:04

న్యూఢిల్లీ, అక్టోబర్ 17: పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయిన ‘ఎమరాల్డ్ స్టార్’ రవాణా ఓడనుంచి గల్లంతైన పదిమంది భారతీయ నావికుల ఆచూకీకోసం హెలికాప్టర్లతో వెతుకుతున్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఫిలిప్పీన్స్ నుంచి భారత్‌కు బయలుదేరిన ‘ఎమరాల్డ్ స్టార్’ రవాణా ఓడ ఒకటి గత శుక్రవారం పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోవడం తెలిసిందే.

Pages