S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/17/2017 - 02:36

శ్రీనగర్, అక్టోబర్ 16: జమ్మూకాశ్మీర్‌లో ముగ్గురు మిలిటెంట్లను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. అందులో ఇద్దరు లష్కరే తొయిబా, ఒకడు హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందినవాడని పోలీసు ఇన్స్‌పెక్టర్ జనరల్ మునీర్ ఖాన్ వెల్లడించారు. దక్షిణ కాశ్మీర్‌లో వారిని అదుపులోకి తీసుకున్నట్టు ఆయన చెప్పారు. ‘ఈ నెల 14న సాయుధులైన ఇద్దరు మిలిటెంట్లు ఖాజీగుండ్ ప్రాంతంలోని కుంద్‌లో కాల్పులకు దిగారు.

10/17/2017 - 02:35

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీతో కలిసి పోటీ చేయాలన్న దానిపై ప్రస్తుతం ఆలోచించడం లేదని, పొత్తులపై వచ్చే ఎన్నికల నాటికి నిర్ణయం తీసుకుంటామని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. ఇతర పార్టీలతో కలిసి ప్రజా ఉద్యమాలను బలపరచడానికి సిపిఎం పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. సోమవారం సిపిఎం ప్రధాన కార్యాలయంలో ఏచూరి విలేఖరులతో మాట్లాడారు.

10/17/2017 - 02:33

బెంగళూరు, అక్టోబర్ 16: బెంగళూరు ఎజిపురాలో సోమవారం ఉదయం రెండంతస్తుల భవనంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ పేలి ఏడుగురు సజీవ దహనమయ్యారు. గౌండప్ప గౌడ రోడ్డులోని ఓ భవంతిలో ప్రమాదం చోటుచేసుకోవడంతో, భవనం కుప్పకూలింది. శిథిలాల కింద చిక్కుకున్న బాధితులను రక్షించే ప్రయత్నంలో ముగ్గురు అగ్నిమాపకదళ అధికారులు తీవ్రంగా గాయపడ్డారు.

10/17/2017 - 02:43

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా భారత రాష్టప్రతిగా కేంద్రంలో ఎన్నో కీలక పదవులను నిర్వహించిన అనుభవజ్ఞుడిగా ప్రణబ్ ముఖర్జీ మరిన్ని ఆసక్తికర విషయాలను, సంకీర్ణ శకానికి సంబంధించిన కీలక అంశాలను తన తాజా పుస్తకంలో వెల్లడించారు.

10/17/2017 - 02:27

న్యూఢిల్లీ, అక్టోబర్ 16: ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలను ఏకాకులుగా చేసేందుకు అన్ని దేశాల ప్రజలు అంతర్జాతీయ స్థాయిలో పెద్దఎత్తున కృషి చేయాలని ఉపరాష్టప్రతి ఎం.వెంకయ్య నాయుడు పిలుపిచ్చారు. ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు పటిష్ఠమైన చట్టాన్ని రూపొందించాలని ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేశారు.

10/17/2017 - 02:06

గాంధీనగర్, అక్టోబర్ 16: గుజరాత్ అన్నా, గుజరాతీయులన్నా కాంగ్రెస్ పార్టీకి, నెహ్రూ- గాంధీ కుటుంబానికి కంటగింపు అంటూ ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నాడిక్కడ జరిగిన భారీ ర్యాలీలో తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి చెందిన జాతీయ నేతలైన సర్దార్ వల్లభాయ్ పటేల్, మొరార్జీ దేశాయ్ వంటి నేతల్ని కాంగ్రెస్, దాని కుటుంబం విస్మరించిందన్నారు.

10/16/2017 - 03:05

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: వ్యాపం కుంభకోణం మరణాల విషయంలో ఎలాంటి కుట్ర లేదని, అయితే ఈ కేసుతో సంబంధం లేకుండా ఎప్పుడో మరణించిన వారిని సైతం నిందితులుగా పేర్కొంటూ మధ్యప్రదేశ్ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేశారని సిబిఐ తన దర్యాప్తు నివేదికలో వెల్లడించింది.

10/16/2017 - 02:53

న్యూఢిల్లీ, అక్టోబర్ 15: సంపన్న దేశాలకు పోటీగా రోదసి పరిశోధనల్లో తన సత్తాను చాటుకుంటూ 2011లో చైనా నిర్మించిన రోదసి ప్రయోగశాల తియాంగ్ గాంగ్ -1 అదుపుతప్పింది. ప్రయోగించి ఆరేళ్లు కాకుండానే ఇది కుప్పకూలి భూమీద పడే పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాదిలోనైనా లేదా వచ్చే ఏడాది మొదట్లోనైనా చైనా అంతరిక్ష పరిశోధనా కేంద్రం భూమీద పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

10/16/2017 - 02:51

గుర్‌దాస్‌పూర్, అక్టోబర్ 15: పంజాబ్‌లోని బిజెపి ప్రాబల్యం గల గుర్‌దాస్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేసింది. భారతీయ జనతా పార్టీ నుంచి ఈ సీటును భారీ ఆధిక్యతతో కైవసం చేసుకుంది. ఆదివారం వెలువడిన ఈ లోక్‌సభ ఉప ఎన్నిక ఫలితంలో కాంగ్రెస్ అభ్యర్థి సునిల్ జాఖర్ 1,93,219 ఓట్ల ఆధిక్యతతో విజయ దుందుభి మోగించారు.

10/16/2017 - 02:49

ధర్మశాల, అక్టోబర్ 15: వచ్చే నెలలో జరగనున్న హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఉనికిని బలంగా చాటుకోవడానికి సిపిఎం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. 68 అసెంబ్లీ స్థానాల్లో 30 స్థానాలకు పోటీచేస్తామని, ఇందులో భాగంగా బిజెపి, కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయ కూటమిని ఏర్పాటుచేస్తామని వెల్లడించింది.

Pages