S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/12/2017 - 01:42

సూళ్లూరుపేట, అక్టోబర్ 11: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం (షార్)కు బుధవారం నాడు వ్యాచిన్ చాంబర్ పరికరాల వాహనాన్ని అత్యంత భారీ భద్రత నడుమ చేరింది. ఈ వాహనం తమిళనాడులోని తిరువుత్తూరు నుంచి 15రోజుల క్రితం బయలుదేరి బుధవారం సాయంత్రానికి రోడ్డుమార్గాన సిఐఎస్‌ఎఫ్ బలగాలు, పోలీస్ భారీ భద్రత నడుమ చేర్చారు.

10/12/2017 - 20:48

న్యూఢిల్లీ, అక్టోబర్ 11:కేంద్ర,రాష్ట్ర, యూజీసీ పరిధిలోకి వచ్చే ఉన్నత విద్యా సంస్థల ప్రొఫెసర్లకు ఏడో వేతన సంఘం సిఫార్సులను వర్తింప చేయడానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దీని వల్ల దాదాపు ఎనిమిది లక్షల మందికి పది వేల నుంచి 50వేల వరకూ జీతాలు పెరుగుతాయి.

10/12/2017 - 20:48

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: పట్టణ ప్రాంతాల్లోని సౌకర్యాలన్నీ పల్లెల్లోనూ కల్పించేందుకు అంద రం కలిసికట్టుగా కృషి చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపిచ్చారు. బుధవారం ఢిల్లీ లో నిర్వహించిన నానాజీ దేశ్‌ముఖ్ జయంత్యుత్సవాల్లో పాల్గొని మాట్లాడుతూ, లక్ష్య సాధనకు సమగ్ర కృషి జరగాలని, ఫలితాలు వచ్చే లా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఉపకరించే పోర్టల్, యాప్‌లను ప్రారంభించారు.

10/12/2017 - 00:21

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: బాలికల వివాహిత యోగ్యత వయస్సు 18 ఏళ్లయినప్పుడు ఆ లోపువయసుగల మైనర్ భార్యతో లైంగిక సంపర్కం అత్యాచారం కాదంటూ ఏ విధంగా మినహాయింపుఇస్తారని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. భారత శిక్షాస్మృతిలో 15 ఏళ్ల లోపువయసుగల భార్యతో లైంగిక సంపర్కం అత్యాచారం కాదంటూ మినహాయింపును ఇవ్వడాన్ని నిలదీసింది.

10/11/2017 - 22:50

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాం (ఎన్‌సిఆర్)లో బాణసంచా అమ్మకాల్ని నిషేధిస్తూ జారీచేసిన ఆదేశాలను సడలించాలని కోరుతూ బాణసంచా వ్యాపారులు బుధవారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. నవంబర్ 1వ తేదీ వరకు బాణసంచా అమ్మకాలపై నిషేధం విధిస్తూ సుప్రీం కోర్టు ఈ నెల 9న ఆదేశించిన విషయం విదితమే.

10/11/2017 - 22:49

శ్రీనగర్, అక్టోబర్ 11: కాశ్మీర్‌లోని బండిపొర జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత వైమానిక దళానికి చెందిన ఇద్దరు గరుడ్ కమాండోలు మృతిచెందారు. ఈ ఎదురుకాల్పుల్లో లష్కరే తోయబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

10/11/2017 - 22:46

జహర్‌గ్రామ్, అక్టోబర్ 11: కేంద్ర ప్రభుత్వం వల్లే డార్జిలింగ్‌లో అనిశ్చితి నెలకొందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. డార్జిలింగ్‌లో అశాంతికి కేంద్రానిదే బాధ్యత అంటూ బుధవారం ఇక్కడ విరుచుకుపడ్డారు. శాంతిని భగ్నంచేసే వదంతులను నమ్మొద్దని, అలాంటి వారిపట్ల తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఉన్నతస్థాయి సమావేశంలో ఆమె హెచ్చరించారు.

10/11/2017 - 22:45

ముంబయి, అక్టోబర్ 11: మహారాష్టల్రో ఎడ్లబండ్ల పోటీలపై విధించిన స్టేను ఎత్తివేయడానికి బాంబే హైకోర్టు తిరస్కరించింది. ఎడ్ల బండ్ల పోటీలపై నిషేధం ఎత్తివేస్తూ స్టే ఇవ్వాలన్న అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. జంతువులతో క్రీడలు నిర్వహించడం క్రూరత్వం కిందకే వస్తుందని బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ మంజుల చెల్లూర్, జస్టిస్ ఎన్‌ఎం జందర్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

10/11/2017 - 22:43

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: నల్లధనంపై దర్యాప్తునకు సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) పరిధిలోకే వస్తుందని కేంద్ర సమాచార కమిషన్ స్పష్టం చేసింది. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా ప్రజా క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంటుందన్న విషయాన్ని మరువరాదని సమాచార హక్కు చట్టం కమిషనర్ బిమల్ జుల్కా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

10/11/2017 - 22:43

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: తృణమూల్ కాంగ్రెస్ నుంచి సస్పెండైన ముకుల్ రాయ్ రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీకి బుధవారం రాజీనామా చేశారు. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితంగా పనిచేసిన ఆయన ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్‌లో అనువంశిక పాలన సాగుతోందంటూ తీవ్ర స్వరంతో ధ్వజమెత్తారు.

Pages