S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/11/2017 - 01:34

ప్రపంచ అందగత్తెలైనా పాలరాతి సొగసుకు ఫిదా కావాల్సిందే. విశ్వసుందరి ఐరిస్ మిట్టెనెయర్ మంగళవారం భారత పర్యటనకు వచ్చినపుడు ఆగ్రా ఐకాన్ తాజ్‌మహల్ ముందు ఇలా పోజిచ్చింది. అద్భుత పాలరాతి కట్టడాన్ని చూసి
మురిసిపోయంది.

10/11/2017 - 01:23

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: దేశంలోని 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు, ముంబాయి, ఢిల్లీ, కోల్‌కతా, హైదరాబాద్, చెన్నై తదితర పెద్ద నగరాలకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, కార్యవర్గాన్ని నియమించే భారం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై పడింది.

10/11/2017 - 01:17

న్యూఢిల్లీ, అక్టోబర్ 10: దేశంలో జైళ్ల నిర్వహణ తీరు పట్ల సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శిక్షకాలం పూర్తయినా, బెయిల్ మంజూరైనా కూడా ఖైదీలను వదలక పోవడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఇలాంటి వారిని విడుదల చేయాలంటూ జాతీయ న్యాయ సర్వీసుల అథారిటీ (నల్సా) స్పష్టం చేసినా ఇదేమీ చోద్యమంటూ ప్రభుత్వాన్ని

10/10/2017 - 02:07

కామ్లా (గుజరాత్), అక్టోబర్ 9: కేంద్రంలో ఎన్‌డిఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు అజయ్ యజమానిగా ఉన్న కంపెనీకి అధిక లాభాలు సంక్రమించినట్టు వచ్చిన కథనాలు సంచలనం రేపుతున్నాయి. కేంద్రంలో బిజెపి ప్రభుత్వంపై విపక్షాలు ముప్పేట దాడి ప్రారంభించాయి.

10/10/2017 - 02:06

శ్రీనగర్, అక్టోబర్ 9: తుపాకీ చప్పుళ్లు, బలగాల బూట్ల చప్పుళ్లతో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో కాశ్మీర్‌లో జీవనం సాగిస్తున్న బాలలకు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కైలాశ్ సత్యార్థి అండగా నిలిచారు. బాలకార్మికులుగా జీవనం సాగిస్తున్న వారి బతుకులను పాఠశాలవైపు నడిపిస్తానని భరోసా ఇచ్చారు. ‘హింసకు దూరంగా ఉండండి. మీరు అభివృద్ధి పథంవైపు పయనించేలా చూసే బాధ్యత నాది.

10/10/2017 - 02:04

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: బిజెపి అధ్యక్షుడు అమిత్ షా కుమారుడు అజయ్‌పై వచ్చిన అవినీతి ఆరోపణలు పార్టీతోపాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి గుదిబండగా మారుతోంది. అజయ్ షాపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలంటూ కాంగ్రెస్, వామపక్షలతోపాటు అన్ని ప్రతిపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. దీంతో తన ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం వాటిల్లే ప్రమాదం ఉన్నదని నరేంద్ర మోదీ భావిస్తున్నట్లు తెలిసింది.

10/10/2017 - 02:02

చండీగఢ్, అక్టోబర్ 9: ఇద్దరు సాధ్వీలపై రేప్ కేసులో ఇరవై ఏళ్లు జైలుశిక్ష పడ్డ డేరాబాబా గుర్మీత్‌సింగ్ ప్రత్యేక కోర్టు తనకు విధించిన 30 లక్షల జరిమానా చెల్లించలేనని చెప్పారు. సిబిఐ ప్రత్యేక కోర్టు రెండు నెలల్లో 30 లక్షల జరిమానా విధించాలని రామ్హ్రీంను ఆదేశించింది. ప్రత్యేక కోర్టు తీర్పును డేరాబాబా పంజాబ్, హర్యానా హైకోర్టులో సవాల్ చేశారు.

10/10/2017 - 02:02

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: కేరళలో సిపిఎం అరాచకాలు తారస్థాయికి చేరుకున్నాయని, ఆ పార్టీ జాతి వ్యతిరేక శక్తులను ప్రోత్సహిస్తోందని కేంద్రమంత్రి కిరెన్ రిజిజూ తీవ్ర ఆరోపణ చేశారు. భారతీయ జనతాపార్టీ ‘జనరక్ష యాత్ర’ రెండోరోజు సోమవారం వామపక్షాలపై మంత్రి విరుచుకుపడ్డారు. వామపక్షాలు హింసను ప్రోత్సహిస్తున్నాయన్న మంత్రి‘ అలాంటి చర్యలను ఎంతమాత్రం ఉపేక్షించబోం’ అని హెచ్చరించారు.

10/10/2017 - 02:01

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: దౌత్యవేత్తలు, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పిజి) అధికారులు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వద్ద భద్రతా ఏర్పాట్లు చూసే అధికారులు, మాజీ ప్రధానులు, వారి కుటుంబ సభ్యుల వద్ద భద్రతా అధికారుల డ్రెస్ అలవెన్స్ పెంచారు. ఏడో కేంద్ర వేతన సంఘం కమిషన్ సిఫార్సు మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

10/10/2017 - 02:00

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: అమర జవాన్ల కుటుంబ సహాయ నిధికి కోటి రూపాయలను కేంద్ర ప్రభుత్వానికి అందజేయనున్నట్లు అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు తెలిపారు. సోమవారం చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడుని కలిశారు. ఈ సందర్భంగా చిరంజీవి యువత తలపెట్టిన అమర్ జవాన్ల కుటుంబ సహాయ నిధి కార్యక్రమాల బ్రోచర్‌ను వెంకయ్య ఆవిష్కరించారు.

Pages