S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

10/10/2017 - 01:59

అరక్కోణం, అక్టోబర్ 9: ‘వేగవంతమైన భారత ఆర్థిక ప్రగతిని చూసి వ్యతిరేక శక్తులు ఓర్వలేకపోతున్నాయి. మన బలాన్ని, బలిమిని దెబ్బతీసి దేశాన్ని బలహీనపర్చే కుట్రలకు పదును పెడుతున్నాయి’ అని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఆర్థికంగా వేగంగా ఎదుగుతున్న దేశాల్లో భారత్ టాప్ టెన్‌లో ఉందని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ స్పష్టం చేశారు.

10/10/2017 - 01:57

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: నాయకత్వం విషయంలో మాకు ఎవ్వరి అయాచిత సలహాలు అవసరం లేదంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ‘కాంగ్రెస్ పూర్వవైభవాన్ని సంతరించుకోవాలంటే సమర్థత, ప్రతిభ ఆధారంగా నాయకత్వాన్ని ఎన్నుకోవాలి’ అంటూ బర్క్‌లీ ఇండియా కాన్ఫరెన్స్‌లో అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది.

10/10/2017 - 01:12

న్యూఢిల్లీ, అక్టోబర్ 9: దేశ వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోనూ విద్యార్థుల రక్షణ, భద్రతకు సంబంధించిన మార్గదర్శకాలను వాస్తవిక స్ఫూర్తితో అమలు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు సోమవారం ఆదేశించింది. ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్లకు సమాధానం ఇవ్వాలని అన్ని ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులను సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశించింది.

10/10/2017 - 01:00

శ్రీనగర్, అక్టోబర్ 9: పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ముగ్గురు కీలక మిలిటెంట్లను భద్రతా దళాలు మంగళవారం కాల్చిచంపాయి. షోకియాలో జరిగిన ఓ భారీ ఎన్‌కౌంటర్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ ప్రధాన రిక్రూటర్ జాహిద్ కూడా హతుడయ్యాడు. బారాముల్లా జిల్లాలో జైహే మహమ్మద్ కమాండర్ ఖాలిద్ కూడా ఈ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు.

10/10/2017 - 00:58

తిరువనంతపురం, అక్టోబర్ 9: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమలలో బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు జిల్లా యంత్రాంగం ఇప్పటినుంచే చర్యలు చేపట్టింది. అయ్యప్ప దీక్షలు చేపట్టిన భక్తులు వచ్చే నెల 15నుంచి శబరిమలకు రానున్న నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ బాలకార్మికులను ప్రోత్సహించే చర్యలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించింది.

10/09/2017 - 02:27

హిండన్ (ఉత్తరప్రదేశ్), అక్టోబర్ 8: తక్కువ గడువు ఇచ్చినా సరే మెరుపు వేగంతో యుద్ధం చేయడానికి భారత వాయుసేన (ఐఎఎఫ్) సిద్ధంగా ఉందని వైమానిక దళ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ బిఎస్ ధనోవా స్పష్టం చేశారు. దేశానికి భద్రతాపరంగా ఎలాంటి సవాలు ఎదురయినా తిప్పికొట్టడానికి, శత్రువుకు తగిన రీతిలో బుద్ధి చెప్పడానికి వాయుసేన పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు.

10/09/2017 - 02:24

న్యూఢిల్లీ, అక్టోబర్ 8: ప్రభుత్వానికి చెల్లించవలసిన ఇంటి అద్దె, విద్యుత్ బిల్లుల వంటివాటిని సకాలంలో చెల్లించడంలో విఫలమైన అభ్యర్థులు చట్ట సభలకు పోటీ చేయకుండా నిషేధం విధించాలన్న ఎన్నికల సంఘం ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది.

10/09/2017 - 02:23

గుజరాత్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారంనాడు తన సొంత గ్రామమైన వాద్‌నగర్‌ను సందర్శించారు. ఓ వైద్య కళాశాలకు శంకుస్థాపన చేయడంతోపాటు
పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు అభివాదం చేస్తున్న నరేంద్ర మోదీ. జిఎంఇఆర్‌ఎస్ మెడికల్ కాలేజీని సందర్శించిన ప్రధాని.

10/09/2017 - 02:20

బెంగళూరు, అక్టోబర్ 8: జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్‌సిబిసి) బిల్లును రాజ్యసభలో అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీయేనని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఈ బిల్లుకు రాజ్యాంగబద్ధత కల్పించేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలూ చేపడుతుందని మంగళవారం నాడిక్కడ జరిగిన ఓ ర్యాలీలో రాజ్‌నాథ్ స్పష్టం చేశారు.

10/09/2017 - 02:17

న్యూఢిల్లీ, అక్టోబర్ 8: ‘రాజకీయ హింసాకాండ కమ్యూనిస్టుల నైజం’ అని బిజెపి అధినేత అమిత్ షా తీవ్రంగా విమర్శించారు. కేరళలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలపై జరుగుతున్న హత్యాకాండకు నిరసనగా ఈ నెల 3న చేపట్టిన ‘జన రక్షా యాత్ర’లో భాగంగా ఆదివారం ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కన్నాట్ ప్లేస్ నుంచి సిపిఎం హెడ్‌క్వార్టర్స్ ఉన్న గోలె మార్కెట్ వరకు దాదాపు 1.5 కి.మీ మేర సాగింది.

Pages