S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/25/2017 - 01:03

న్యూఢిల్లీ, ఆగస్టు 24: ప్రజల సంక్షేమం, సంతృప్తి సాధించేందుకు అభివృద్ధి, సుపరిపాలన ఎంతో ముఖ్యమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అధికారులు మంచి ఉద్దేశ్యంతో తీసుకునే నిజాయితీ నిర్ణయాలను ప్రభుత్వం సమర్థిస్తుందని ప్రధాన మంత్రి హామీ ఇచ్చారు.

08/25/2017 - 00:57

న్యూఢిల్లీ, ఆగస్టు 24: వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనంటూ సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన చారిత్రక తీర్పును కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. అయితే ఇందుకు సంబంధించి సహేతుకమైన పరిమితులు ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.

08/25/2017 - 00:55

ముంబయి, ఆగస్టు 24: వినాయక చవితి (శుక్రవారం)నుంచి కొత్తగా 200 రూపాయల నోటును మార్కెట్లో ప్రవేశపెడుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ గురువారం ప్రకటించింది. కొత్త 200 రూపాయల నోటు జారీకి ప్రభుత్వం ఆర్‌బిఐకి అనుమతి ఇచ్చినట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన ఒక రోజ తర్వాత ఈ నోటు మార్కెట్లోకి వస్తూ ఉండడం గమనార్హం. ఆర్‌బిఐ 200 రూపాయల నోటును విడుదల చేయడం ఇదే మొదటిసారి.

08/25/2017 - 00:53

న్యూఢిల్లీ, ఆగస్టు 24:వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనని సుప్రీం కోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. ఈ అంశంపై సుదీర్ఘ విచారణ జరిపిన తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ‘్భరత రాజ్యాంగంలోని 21వ అధికరణ పరిధిలోని జీవన హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛా హక్కులో వ్యక్తిగత గోప్యతా హక్కు అంతర్భాగం’అని నిగ్గుదేల్చింది.

08/24/2017 - 03:39

పాట్నా: రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేసిన నేపథ్యంలో రాజధాని పాట్నాలో ఈ నెల 27న తలపెట్టిన ర్యాలీని వాయిదా వేసుకోవాలన్న బిజెపి విజ్ఞప్తిని ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తోసిపుచ్చారు. తమ ర్యాలీ వల్ల వరద బాధితులకు వచ్చే నష్టమేమిటని ఆయన ఎదురు ప్రశ్నించారు.

08/24/2017 - 03:37

చెన్నై: అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఎఐఎడిఎంకె నాయకురాలు శశికళకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తనను దోషిగా నిర్ధారిస్తూ ఇచ్చిన తీర్పును పునః సమీక్షించాలని కోరుతూ గత మే నెలలో రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు ‘ఇందులో తమ తీర్పును పునః సమీక్షించాల్సిన యోగ్యతలేవీ లేవు’ అని పేర్కొంది.

08/24/2017 - 03:37

చెన్నై/పుదుచ్చేరి: తమిళనాడులో అధికార అన్నాడిఎంకెలో చీలిక వర్గాలు విలీనం అయినా సమస్య మాత్రం తీరలేదు. శశికళ వర్గానికి చెందిన టిటివి దినకరన్ పార్టీపై పట్టుసాధించేందుకు నలుగురు మంత్రులపై వేటు వేశారు. ఈ నలుగురినీ పార్టీ పదవుల నుంచి తొలగిస్తున్నామని ప్రకటించిన ఆయన తనకు మద్దతుగా ఉన్న 18 మంది ఎమ్మెల్యేలను పుదుచ్ఛేరిలోని ఓ రిసార్టులోనే కొనసాగిస్తున్నారు.

08/24/2017 - 03:36

న్యూఢిల్లీ: భారత్‌లో నాలుగు రోజుల పర్యటనకోసం బుధవారం న్యూడిల్లీ చేరుకొన్న నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబాకు ప్రధాని నరేంద్ర మోదీ తన నివాసం వద్ద ఘనంగా స్వాగతం పలికారు. గత జూన్‌లో నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేవుబా విదేశాల్లో పర్యటించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. కాగా, గురువారం ఇరువురు నేతలు విస్తృత స్థాయి చర్చలు జరుపుతారని అధికార వర్గాలు తెలిపాయి.

08/24/2017 - 03:35

లక్నో/న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ దుర్ఘటన మరువక ముందే మరో రైలు ప్రమాదం చోటుచేసుకొంది. బుధవారం తెల్లవారుజామున 2.50 గంటల సమయంలో పటా, అచల్డా రైల్వే స్టేషన్ల మధ్య అజమ్‌గఢ్‌నుంచి ఢిల్లీ వెళ్తున్న కైఫియత్ ఎక్స్‌ప్రెస్ ఒక డంపర్‌ను ఢీకొనడంతో తొమ్మిది బోగీలు పట్టాలు తప్పడంతో 50 మందికి పైగా గాయపడినట్లు ఉత్తర మధ్య రైల్వే ప్రతినిధి ఒకరు చెప్పారు.

08/24/2017 - 03:11

న్యూఢిల్లీ: రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేయటంలేదని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. బుధవారం విలేఖరులతో మాట్లాడిన ఆయన రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. రెండు వందల రూపాయల నోట్ల జారీకి ప్రభుత్వం అనుమతిచ్చిందని వెల్లడించారు.

Pages