S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/23/2017 - 02:44

న్యూఢిల్లీ, ఆగస్టు 22: ముస్లింలలో ఉన్న ట్రిపుల్ తలాఖ్ దురాచారాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పు ఈ దేశం ఎంతగా పురోగమించిందో చెప్తోందని అదనపు సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ అన్నారు. ట్రిపుల్ తలాఖ్‌ను అన్ని వర్గాలు ఖండించిన దృష్ట్యా ఈ తీర్పు దేశానికి ఎన్నో ప్రయోజనాలను తీసుకువస్తుందని అన్నారు.

08/23/2017 - 02:43

న్యూఢిల్లీ, ఆగస్టు 22: ట్రిపుల్ తలాఖ్ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ సుప్రీంకోర్టు మంగళవారం ఇచ్చిన తీర్పును ప్రధాన రాజకీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ పార్టీలతో పాటుగా పలువురు నేతలు స్వాగతించారు. స్ర్తి-పురుష సమానత్వం, సమాన న్యాయం దిశగా ఈ తీర్పు ఓ ముందడుగని పేర్కొన్నారు.

08/23/2017 - 02:15

న్యూఢిల్లీ, ఆగస్టు 22: ముస్లిం మహిళల తలాక్ కడగండ్లు తీరాయి. తక్షణ విడాకులకు అడ్డుకట్ట పడింది. కోటానుకోట్ల మంది మహిళలకు కొండంత ఊరట లభించింది. పధ్నాలుగు వందల సంవత్సరాలుగా అమలవుతున్న ట్రిపుల్ తలాక్‌ను కొట్టివేస్తూ సుప్రీం కోర్టు మంగళవారం చారిత్రక, సంచలన తీర్పు వెలువరించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఎంతమాత్రం చెల్లదని తన మెజార్టీ తీర్పులో తేల్చిచెప్పింది.

08/23/2017 - 02:12

న్యూఢిల్లీ, ఆగస్టు 22: ట్రిపుల్ తలాఖ్‌పై కొత్త చట్టాన్ని తేవలసిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం దాదాపుగా తేల్చి చెప్పింది. శతాబ్దాల ఈ తలాఖ్ వ్యవస్థను కొట్టివేసిన నేపత్యంలో మంగళవారం ఈ మేరకు సంకేతాలందించింది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పే చట్టమని వేరుగా మరో చట్టాన్ని తీసుకురావలసిన అవసరమే లేదన్నట్టుగా కేంద్రం తన వాదనకు పదును పెడుతోంది.

08/23/2017 - 01:51

న్యూఢిల్లీ, ఆగస్టు 22: తెలుగు రాష్ట్రాలలోని న్యాయాధికారుల నియామకాలుకు సంబంధించి ముసాయిదా మార్గదర్శకాలను కేంద్రం సుప్రీంకోర్టుకు సమర్పించింది.ఆంధ్ర,తెలంగాణలోని న్యాయాధికారుల నియామకాలకు ఉద్దేశించి సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు మేరకు కేంద్రప్రభుత్వం మొత్తం పది ముసాయిదా మార్గదర్శకాలను రూపొందించింది.

08/23/2017 - 03:20

న్యూఢిల్లీ, ఆగస్టు 22: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభ ఎన్నికలను 2019కి బదులు 2018లో జరిపేందుకు సుముఖత చూపిస్తున్నారా? లోక్‌సభ, శాసన సభల ఎన్నికలను ఒకేసారి నిర్వహించటం ద్వారా ఐదు సంవత్సరాలకు ఒకసారి అన్ని ఎన్నికలు అనే విధానాన్ని అమలు చేయాలని నరేంద్ర మోదీ ఆలోచిస్తున్న విషయం తెలిసిందే.

08/22/2017 - 03:43

న్యూఢిల్లీ , ఆగస్టు 21: నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్టు (నీట్) నిర్వహణలో జరిగిన అవకతవకలపై కోర్టు పర్యవేక్షణలో సిబిఐ దర్యాప్తు జరిపించాలని దాఖలైన పిటీషన్‌పై ఢిల్లీ హైకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. పిజి కోర్సుల్లో ప్రవేశాలకు 2016లో నిర్వహించిన నీట్‌లో అనేక అవకతవకలు జరిగాయని పిటీషనర్ పేర్కొన్నారు.

08/22/2017 - 03:25

న్యూఢిల్లీ, ఆగస్టు 21: తొమ్మిదేళ్లనాటి మాలెగావ్ వరుస పేలుళ్ల కేసులో కీలక నిందితుడు లెఫ్టినెంట్ కల్నల్ శ్రీకాంత్ ప్రసాద్ పురోహిత్‌కు సోమవారం సుప్రీం కోర్టు బెయల్ మంజూరు చేసింది. ఇంతకు ముందు బెయిల్‌కోసం పురోహిత్ చేసుకున్న అభ్యర్థనను ముంబయ హైకోర్టు తిరస్కరించింది.

08/22/2017 - 03:25

అన్నాడిఎంకె గ్రూపుల విలీనంపై ప్రముఖ నటుడు కమల్‌హసన్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఈ విలీనం ద్వారా అన్నాడిఎంకె పార్టీ తమిళ ప్రజల నెత్తిపై విదూషకుడి టోపీని పెడుతోందని, ఈ టోపీని తొలగించుకోవాలని ఆయన అన్నారు. ఆరు నెలల విభేదాల తరువాత అన్నాడిఎంకె వర్గాలు సోమవారం కలిసిన సంగతి తెలిసిందే.

08/22/2017 - 03:17

చైనె్న, ఆగస్టు 21: తమళనాట అనేక హైడ్రామాల నడుమ అధికార పార్టీలోని రెండు గ్రూపులు విలీనమయ్యాయి. గత డిసెంబర్‌లో అన్నాడిఎంకె అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత మరణం తరువాత పార్టీలో అనేక పరిణామాలు సంభవించాయి. ముఖ్యమంత్రి పదవికోసం మొదలైన కుమ్ములాటలు తిరుగుబాటుకు దారితీశాయి. అదికాస్తా అన్నాడిఎంకెలో చీలికకు దారితీసింది. అనేక అనూహ్యమైన పరిణామాలు పార్టీలో చోటుచేసుకున్నాయి.

Pages