S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/21/2017 - 02:19

న్యూఢిల్లీ, ఆగస్టు 20: భారత సైన్యం తన యుద్ధ తంత్రానికి సామర్థ్యానికి మరింతగా పదును పెట్టుకుంటోంది. ఇందులో భాగంగా టి-90 యుద్ధ ట్యాంకులకు అత్యాధునికమైన మూడోతరం క్షిపణి వ్యవస్థను అమర్చే ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించింది. టి-90 యుద్ధ ట్యాంకులు మైన సైనిక వ్యవస్థలో అత్యంత కీలకమైనవన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీటికి లేజర్ ఆధారంగా పనిచేసే ఇన్‌వార్ క్షిపణి వ్యవస్థను అమర్చారు.

08/21/2017 - 00:46

ముజఫర్‌నగర్/న్యూఢిల్లీ, ఆగస్టు 20: ఉత్కళ్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి సంబంధించి రైల్వే మంత్రిత్వ శాఖ ఆదివారం రాత్రి బాధ్యులపై చర్యలు చేపట్టింది. కార్యదర్శి స్థాయి రైల్వే బోర్డు అధికారి సహా ముగ్గురు ఉన్నతాధికారులను సెలవుపై పంపించింది. నలుగురిని సస్పెండ్ చేసింది. మరొకరిని బదిలీ చేసింది.

08/20/2017 - 23:34

విజయవాడ (రైల్వేస్టేషన్), ఆగస్టు 20: నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే జోన్ పరిధిలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అటు వైపు నుంచి రాకపోకలు సాగించే కొన్ని రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ అధికారి ఆదివారం ఇక్కడ ఒక ప్రకటనలో తెలిపారు.

08/20/2017 - 03:08

గౌహతి, ఆగస్టు 19: భారీ వరదల కారణంగా ఈశాన్య రాష్ట్రాలకు నిలిచిపోయిన రైలు సర్వీసులు ఈ నెల 28కన్నా ముందు పునరుద్ధరించే అవకాశాలు లేకపోవడంతో నార్త్‌ఈస్ట్ ప్రాంటియర్ రైల్వే ఈ రాష్ట్రాలకు ప్రయాణికుల రాకపోకలకు, సరకుల తరలింపునకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకొంటోంది.

08/20/2017 - 03:07

చెన్నై/తిరువారూర్, ఆగస్టు 19: అన్నాడిఎంకె వర్గాల విలీనంపై చర్చలు సాఫీగా సాగుతున్నాయని, ఒకటి, రెండు రోజుల్లోనే అందరూ ఎదురుచూస్తున్న విధంగా సానుకూల నిర్ణయమే వెలువడుతుందని ఈ రెండు వర్గాలకు నాయకత్వం వహిస్తున్న తమిళనాడు ముఖ్యమంత్రి కె పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం శనివారం చెప్పారు.

08/20/2017 - 03:06

కోల్‌కతా, ఆగస్టు 19: దేశంలోని ఐఐటిలు, బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైనె్సస్ (ఐఐఎస్‌సి)లో పిహెచ్‌డిలు చేస్తున్న పరిశోధకులకు కేంద్రం నెలవారీ ఫెలోషిప్‌గా రూ 70 వేల రూపాయలు అందజేస్తుందని కేంద్ర ఉన్నత విద్యా కార్యదర్శి కేవల్ కుమార్ శర్మ చెప్పారు. ప్రస్తుతం ఈ స్కాలర్‌షిప్ మొత్తం నెలకు రూ.25 వేలుగా ఉంది.

08/20/2017 - 03:05

గౌహతి/కోల్‌కతా, ఆగస్టు 19: కొన్ని రోజులుగా అసోం, బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న వరద పరిస్థితి శనివారం కాస్త నెమ్మదించినప్పటికీ ఇప్పటికీ అసోంలోని 16 జిల్లాల్లో లక్షలాది ప్రజలు నానాఅవస్థలు పడుతూనే ఉన్నారు. నార్త్ బెంగాల్‌లోని ఆరు జిల్లాల్లో 52 లక్షలకు పైగా జనంపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది.

08/20/2017 - 03:03

న్యూఢిల్లీ, ఆగస్టు 19: ఎన్‌డిఏలో చేరిన జెడి(యు)కు కేంద్ర మంత్రివర్గంలో రెండు కేబినెట్ మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉన్నదని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. ఎన్‌డిఏలో జెడి(యు) చేరే ప్రక్రియ పూర్తికావటంతో ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే కేంద్ర మంత్రివర్గం విస్తరణ కార్యక్రమం చేపడతారని అంచనా వేస్తున్నారు. ఈ విస్తరణలో జె.డి(యు)కు చెందిన ఇద్దరికి క్యాబినెట్ మంత్రి పదవులు లభించటం ఖాయమని చెబుతున్నారు.

08/20/2017 - 03:00

గోరఖ్‌పూర్, ఆగస్టు 19: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకొని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విమర్శలు చేశారు. శనివారం రాహుల్ గాంధీ గోరఖ్‌పూర్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కూర్చుని ఉండే యువరాజు గోరఖ్‌పూర్‌ను పిక్నిక్ స్పాట్‌గా చేసుకోవడానికి అనుమతించేది లేదని ముఖ్యమంత్రి అన్నారు.

08/20/2017 - 03:13

న్యూఢిల్లీ, ఆగస్టు 19: వచ్చే లోకసభ ఎన్నికల్లో 350 సీట్లు గెలుచుకునేందుకు అనుసరించవలసిన వ్యూహం గురించి చర్చించేందుకు బిజెపి అధ్యక్షుడు అమిత్ షా సోమవారం బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం అవుతున్నారు. అమిత్ షా ఏర్పాటు చేసిన సమావేశానికి పదమూడు మంది బిజెపి ముఖ్యమంత్రులు, ఐదుగురు ఉపముఖ్యమంత్రులు హాజరవుతురన్నారు.

Pages