S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/17/2017 - 02:06

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సియు) పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్యకు అనేక కారణాలున్నట్టు జస్టిస్ రూపన్‌వాలా కమిటీ పేర్కొంది. రోహిత్ ఆత్మహత్యకు గల కారణాలను కనుకొనేందుకు ఏర్పాటు చేసిన మాజీ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రూపన్‌వాలా ఏకసభ్య కమిషన్ నివేదికను కేంద్ర మానవ వనరుల శాఖకు సమర్పించారు.

08/17/2017 - 02:29

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజు పైనుంచి చేసిన ప్రసంగం ఇప్పటివరకు ప్రధానమంత్రులందరూ చేసిన ప్రసంగాలకన్నా తక్కువ వ్యవధి గల ప్రసంగమని, చెప్పుకోవడానికి ఏమీ లేనందునే ఆయన తన ప్రసంగాన్ని కుదించారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు.

08/17/2017 - 01:32

న్యూఢిల్లీ: ఉపరాష్టప్రతి ఎం వెంకయ్యనాయుడు కార్యదర్శిగా మాజీ ఐఏఎస్ అధికారి ఐవి సుబ్బారావు నియమితులయ్యారు. కేంద్రమంత్రివర్గానికి చెందిన నియామకాల కమిటీ బుధవారం సుబ్బారావును రెండేళ్ల కాలానికి కాంట్రాక్ట్ పద్ధతిపై వెంకయ్యకు కార్యదర్శిగా నియమించడానికి ఆమోదం తెలిపినట్లు సిబ్బంది, వ్యవహారాలు, శిక్షణ మంత్రిత్వ వాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

08/17/2017 - 01:31

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వసూలు చేస్తున్న విద్యా సెస్‌ను ఒక ప్రత్యేక నిధిగా ఏర్పాటు చేసి, వార్షిక కేటాయింపులు ద్వారా ఎన్నడూ మురిగిపోని విధంగా దానిని కార్పస్ ఫండ్‌గా రూపొందించాలని కేంద్రం నిర్ణయించింది. బుధవారం నాడు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

08/17/2017 - 01:31

న్యూఢిల్లీ: ‘వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడానికి వీల్లేదు. కొన్ని కేసుల విషయంలో ప్రభుత్వ దృష్టిలో ఇది న్యాయమే కావచ్చు కానీ వ్యక్తిగత స్వేచ్ఛపై రాజీకి ఆస్కారమే ఉండదు’అని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. అవినీతి కేసును ఎదుర్కొంటున్న అస్సాం పబ్లిక్ సర్వీసు కమిషన్ మాజీ చైర్మన్ రాకేశ్‌కుమార్‌కు బెయిల్ మంజూరు చేసిన సందర్భంగా త్రిసభ్య సుప్రీం బెంచి మెజార్టీ తీర్పులో ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

08/16/2017 - 02:23

న్యూఢిల్లీ, ఆగస్టు 15: సముద్రాల్లోనైనా, సరిహద్దుల్లోనైనా ఎక్కడ ఏ రకమైన భద్రతాపరమైన సవాలు ఎదురైనా దాన్ని దీటుగా ఎదుర్కొని తిప్పికొట్టగలిగే సామర్థ్యం భారత్‌కు ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. చైనాతో డోక్లామ్‌పై కొనసాగుతున్న సంఘర్షణ నేపథ్యంలో దేశ 71వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మోదీ చేసిన ఈ ప్రకటన మరింత ప్రాధాన్యత చేకూరింది.

08/16/2017 - 02:21

న్యూఢిల్లీ, ఆగస్టు 15: భిన్నత్వంలో ఏకత్వ భావన, దేశ భక్తి దేశవ్యాప్తంగా వెల్లివిరిసింది. భారత దేశ 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఓ పండువగా దేశ ప్రజలందరూ మంగళవారం జరుపుకొన్నారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ ఉత్సవ, ఉత్సాహా వాతావరణం నెలకొంది.

08/16/2017 - 02:16

పలక్కడ్, ఆగస్టు 15: కేరళలో అధికార సిపిఎం సారథ్యంలోని ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించి ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ మంగళవారం ఇక్కడ ఓ పాఠశాలలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన దేశ స్వాతంత్య్రం కోసం సర్వాన్ని త్యాగం చేసిన వారి ఆశయాలను, ఆదర్శాలను అనుసరించాల్సిన అవసరం ఎంతో ఉందని తెలిపారు.

08/16/2017 - 02:16

పశ్చిమ బెంగాల్‌లోని ఓ పాఠశాలలో దేశభక్తిని ఇలా చాటుకున్నారు

08/16/2017 - 02:14

న్యూఢిల్లీ, ఆగస్టు 15: దేశ స్వాతంత్య్ర సముపార్జనకు కృషిచేసిన నాటి మహనీయుల ఆశయ సాధనకు యువతరం పునరంకితం కావాలని ఆంధ్రా భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాష్ ఉద్ఘాటించారు. 71వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మంగళవారం ఆంధ్రాభవన్ ప్రాంగణంలో ప్రవీణ్ ప్రకాష్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

Pages