S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/12/2017 - 01:02

న్యూఢిల్లీ, ఆగస్టు 11: దేశ ఆర్థిక చిత్రం అనిశ్చితంగా ఉందని, ఒకదాని తర్వాత ఒకటిగా సవాళ్లు ఎదురవుతున్నాయని ఆర్థిక సర్వే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటును 6.75 - 7.5 శాతానికి తీసుకువెళ్లడమన్నది అంత తేలిక కాదని వెల్లడించింది. గతంలో ఈ మేరకు అంచనా వేసినప్పటికీ ఎగువ స్థాయి లక్ష్యానికి చేరుకోవడమన్నది కష్టతరమేనని స్పష్టం చేసింది.

08/12/2017 - 01:00

న్యూఢిల్లీ, ఆగస్టు 11: డిసెంబర్ 5వ తేదీనుంచి రామజన్మభూమి - బాబ్రీ మసీదు కేసుపై తుది విచారణ ప్రారంభించాలని సుప్రీంకోర్టు శుక్రవారం నిర్ణయించింది. అనంతరం ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదాలు పడే అవకాశం ఉండదని తెలిపింది. దాదాపు గంటన్నరపాటు జరిగిన వాదోపవాదాల అనంతరం ఈ కేసు తుది విచారణను డిసెంబర్ 5నుంచి మొదలుపెట్టాలని నిర్ణయించింది.

08/12/2017 - 03:08

న్యూఢిల్లీ, ఆగస్టు 11: పార్లమెంట్ పట్ల ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోంది. విశ్వాసం పెంచేందుకు సభ్యులంతా సహకరించాలి. నిష్పాక్షికంగా వ్యవహరిస్తూ అందరికీ అవకాశం కల్పిస్తా. ఇప్పుడు నేను అన్ని పార్టీల వాడిని’ అని రాజ్యసభ నూతన అధ్యక్షుడు వెంకయ్యనాయుడు అన్నారు. శుక్రవారం రాజ్యసభలో అధ్యక్ష పదవి చేపట్టిన అనంతరం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

08/11/2017 - 03:49

న్యూఢిల్లీ, ఆగస్టు 10: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమ లు చేయకుండా, ప్రజలను మభ్యపెట్టేందుకే ముఖ్యమంత్రి కెసిఆర్ పునరుజ్జీవ సభలు నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొన్నల లక్ష్మయ్య ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్‌లో లక్ష్మయ్య విలేకరులతో మాట్లాడుతూ, ఈ ప్రపంచంలో ఇచ్చిన మాట తప్పిన మొట్టమొదటి ప్రజానాయకుడు ఎవరైనా ఉంటే అది ముఖ్యమంత్రి కెసిఆర్ అని దుయ్యబట్టారు.

08/11/2017 - 03:09

న్యూఢిల్లీ, ఆగస్టు 10: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పసుల రాంమూర్తి నేతృత్వంలోని తెలంగాణ మాల మహానాడు గురువారం నాడు ఢిల్లీలోని జంతర్ మంతర్‌లో నిరసన కార్యక్రమం చేపట్టింది. మాల మహానాడు అధ్యక్షుడు పసుల రాంమూర్తి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని చూస్తోందని ఆరోపించారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దళితులపై దేశవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు.

08/11/2017 - 03:08

చెన్నై, ఆగస్టు 10: చిన్నమ్మ వికె శశికళ మేనల్లుడు టిటికె దినకరన్‌ను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవినుంచి తప్పిస్తూ ముఖ్యమంత్రి కె పళనిస్వామి నేతృత్వంలోని మెజారిటీ వర్గం నిర్ణయం తీసుకోవడంతో అన్నాడిఎంకెలోని రెండు వర్గాలు విలీనమయ్యే అవకాశాలు మెరుగయ్యాయి.

08/11/2017 - 03:05

న్యూఢిల్లీ, ఆగస్టు 10: ప్రపంచ అద్భుతాల్లో ఒకటైన తాజ్ మహల్ షాజహాన్ నిర్మించిన మసీదా లేక ఒక రాజ్‌పుత్ రాజు ఆ మొగల్ చక్రవర్తికి బహూకరించిన శివాలయమా అనే విషయంలో స్పష్టత ఇవ్వాలని కేంద్ర సమాచార కమిషన్ (సిఐసి) కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆదేశించింది. తాజ్‌మహల్ తన భార్య ముంతాజ్ స్మారకార్థం షాజహాన్ నిర్మించిన మసీదు అని మాత్రమే మనలో చాలామందికి తెలుసు.

08/11/2017 - 02:52

చెన్నై, ఆగస్టు 10: తమిళ స్టార్లు కమల్‌హాసన్, రజినీకాంత్ రాజకీయ రంగ ప్రవేశానికి సంబంధించి మళ్లీ ఊహాగానాలు మొదలయ్యాయి. గురువారం నాడిక్కడ జరిగిన ప్రతిపక్ష డిఎంకె పార్టీ కార్యక్రమానికి వీరిద్దరూ హాజరుకావడం, కమల్‌హాసన్ వేదికపైన రజినీకాంత్ ప్రేక్షకుల్లోనూ కూర్చోవడం అందరి దృష్టినీ ఆకర్షించింది.

08/11/2017 - 02:46

న్యూఢిల్లీ, ఆగస్టు 10: దేశంలోని పలు న్యాయస్థానాల్లో 6400 అవినీతి కేసులు విచారణలో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. ఈ కేసుల్లో 115 మంది రాజకీయ నాయకులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారని పేర్కొంది.

08/11/2017 - 02:45

న్యూఢిల్లీ, ఆగస్టు 10: దేశంలోని ముస్లిం మైనారిటీలు అభద్రతాభావంతో ఉన్నారంటూ పదవీ విరమణ చేస్తున్న రాజ్యసభ అధ్యక్షుడు, ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అన్సారీ వ్యాఖ్యలను బిజెపి నాయకులు తీవ్రంగా విమర్శించారు.

Pages