S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/11/2017 - 02:43

న్యూఢిల్లీ, ఆగస్టు 10: ప్రభుత్వ విధానాలపై స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా విమర్శలను ఆహ్వానించకపోతే ప్రజాస్వామ్యంలో నిరంకుశత్వం ప్రబలుతుందని ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీ అన్నారు. భిన్నత్వంలో ఏకత్వమన్న రాజ్యాంగ స్ఫూర్తిపై నిర్మాణమైన రాజ్యసభలో స్వేచ్ఛగా చర్చలు జరగాల్సిన అవసరాన్ని ఆయన సభ్యులకు గుర్తు చేశారు.

08/11/2017 - 02:40

చిత్రం.. గురువారం ఢిల్లీలో జరిగిన బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో రాజ్యసభ సభ్యునిగా గెలుపొందిన అమిత్ షాను అభినందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ

08/11/2017 - 02:14

న్యూఢిల్లీ, ఆగస్టు 10: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణ, గోదావరి నదులపై అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని తెలంగాణణా రాష్ట్ర సమితి సభ్యుడు జితేందర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

08/11/2017 - 01:00

న్యూఢిల్లీ, ఆగస్టు 10: దేశంలోని కోట్లాది మంది వెనుకబడిన కులాల వారికి దశలవారీగా రాజకీయాధికారం కల్పిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. జాతీయ బిసి సంఘం అధ్యక్షుడు, తెలుగుదేశం శాసన సభ్యుడు ఆర్.కృష్ణయ్య నాయకత్వంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బిసి సంఘాల నాయకులు గురువారం పార్లమెంటు ఆవరణలో నరేంద్ర మోదీని కలిసి బిసి రిజర్వేషన్లపై ఒక వినతిపత్రాన్ని అందజేశారు.

08/11/2017 - 00:58

న్యూఢిల్లీ,ఆగస్టు 10: ఆంధ్రప్రదేశ్‌కు ఉపాధి హామీ పథకంలో భాగంగా పెండింగ్ నిధులు రూ.600 కోట్లు తక్షణమే విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించినట్టు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. గురువారం నాడు ఢిల్లీలో లోకేశ్ ఉపరాష్టప్రతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమావేశమయ్యారు.

08/11/2017 - 00:55

న్యూఢిల్లీ, ఆగస్టు 10: దేశంలో మైనార్టీలకు రక్షణ లేదన్నది రాజకీయ లబ్ధి కోసం చేసే ప్రచారమే తప్ప, అందులో వాస్తవం లేదని భారత నూతన ఉపరాష్టప్రతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఉపరాష్టప్రతి హోదాలో చివరి ప్రసంగం చేసిన హమీద్ అన్సారీ గురువారం రాజ్యసభలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వెంకయ్యనాయుడు ప్రతిస్పందించారు. ‘‘కొందరు ప్రజలు మన దేశంలో మైనార్టీలకు రక్షణ లేదని వాదిస్తున్నారు. ఇదంతా రాజకీయ ప్రచారమే.

08/10/2017 - 02:51

న్యూఢిల్లీ, ఆగస్టు 9: భారత సైన్యం ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు 24గంటలూ సంసిద్ధంగా ఉందని, దేశ రక్షణ విషయంలో ఎటువంటి ముప్పునైనా సమర్థంగా తిప్పికొట్టగల సామర్థ్యం మన సైన్యానికి ఉందని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. చైనాతో మూడు నెలలుగా కొనసాగుతున్న ప్రతిష్ఠంభన నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

08/10/2017 - 02:53

న్యూఢిల్లీ, ఆగస్టు 9: దేశానికి స్వాతంత్య్రం సంపాదించడానికి క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో చేసినట్లుగా ఇప్పుడు కూడా ప్రజలనందరినీ ఒక్కటి చేయడానికి ఒక ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. అప్పుడు స్వాతంత్య్ర సమర యోధులు భారత్ చోడో (క్విట్ ఇండియా) అని అన్నారు.

08/10/2017 - 02:50

న్యూఢిల్లీ, ఆగస్టు 9: ప్రజాస్వామ్య వ్యవస్థను దెబ్బతీసే క్షుద్రశక్తులు మళ్లీ తలెత్తుతున్నాయని, లౌకికవాదం, ప్రజాస్వామ్యం, ఉదారవాదం ప్రమాదంలో పడుతున్నాయని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. సోనియాగాంధీ బుధవారం లోక్‌సభలో క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా జరిగిన చర్చలో పాల్గొంటూ స్వేచ్చ ఉండవలసిన స్థానంలో భయాందోళనలు చోటు చేసుకోవటం లేదా?

08/10/2017 - 02:50

న్యూఢిల్లీ, ఆగస్టు 9: క్విట్ ఇండియా ఉద్యమం 75వ వార్షికోత్సవం సందర్భంగా లోక్‌సభ బుధవారం ప్రజాస్వామ్య విలువలను పరిరక్షిస్తామని, మత సామరస్యాన్ని పెంపొందిస్తామని, దేశాన్ని అవినీతి రహితం చేస్తామని ప్రతిన బూనింది. అలాగే మహాత్మాగాంధీ, ఇతర స్వాతంత్య్ర సమరయోధులు కలలుగన్న భారతాన్ని నిర్మించడానికి నిర్విరామంగా కృషి చేస్తామని ప్రతిన బూనుతూ లోక్‌సభ ఏకగ్రీవంగా ఒక తీర్మానాన్ని ఆమోదించింది.

Pages