S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/10/2017 - 02:49

ముంబయి, ఆగస్టు 9: క్విట్ ఇండియా ఉద్యమం 75వ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు. ‘ఆగస్టు క్రాంతి దినోత్సవం సందర్భంగా భారత మాతకోసం ప్రాణాలర్పించిన అమరవీరులందరికీ సెల్యూట్ చేస్తున్నాను’ అని ఫడ్నవిస్ ఒక ట్వీట్‌లో అన్నారు.

08/10/2017 - 02:49

ముంబయి, ఆగస్టు 9: మహారాష్టల్రో అత్యంత శక్తివంతమైన మరాఠా ప్రజలు తమ డిమాండ్ల సాధనకోసం బుధవారం లక్షలాదిగా వీధుల్లోకి వచ్చారు. దాదాపు ఐదునుంచి 8 లక్షల మంది బైకుల్లా నుంచి ముంబయిలోని ఆజాద్ మైదానం వరకూ వౌన ప్రదర్శన జరిపారు. ప్రదర్శన కారణంగా ముంబయి మహానగరం బుధవారం అతలాకుతలమైంది. ఈ ఉద్యమ తీవ్రతకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం మరాఠా వర్గానికి అనేక తాయిలాలు ప్రకటించింది.

08/10/2017 - 02:49

న్యూఢిల్లీ, ఆగస్టు 9: రానున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వివిపిఏటి) యంత్రాలు వినియోగించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఇవిఎం)లకు పేపర్ ఆడిట్ మిషన్లు అమర్చితే ఎలాంటి అనుమానాలకు తావుండదని ఇసికి అనేక సూచనలు వచ్చాయి.

08/10/2017 - 02:48

న్యూఢిల్లీ, ఆగస్టు 9: భారత్, చైనా సైన్యాల మధ్య రెండు నెలలుగా కొనసాగుతున్న డోక్లామ్ ప్రతిష్టంభన పెద్ద సమస్య ఏమీ కాదని టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు. 1950నాటి ‘హిందీ-చీనీ భాయి భాయి’ సందేశాన్ని మరోసారి గుర్తుచేశారు. పక్కపక్కనే ఉంటున్న బలమైన దేశాలయిన భారత్, చైనాలు రెండూ సహజీవనం సాగించాల్సిన అవసరం ఉందన్నారు.

08/10/2017 - 02:22

న్యూఢిల్లీ, ఆగస్టు 9: ‘చేస్తాం.. చేసిచూపిస్తాం’ అన్నదే యావద్భారత నినాదం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇదే స్ఫూర్తితో రానున్న ఐదేళ్ల కాలంలో ముందుకుసాగాలని, పెనుసవాళ్లుగా మారిన అవినీతి,పేదరికం, నిరక్షరాస్యతలను తరిమికొట్టాలన్నారు.

08/09/2017 - 04:00

న్యూఢిల్లీ, ఆగస్టు 8: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లే సమయంలో ఎస్‌పిజిని వెంట తీసుకుపోవటం లేదని, దీని వెనక ఉన్న రహస్యం ఏమిటని, ఆయన ఏ విషయాన్ని దాస్తున్నారని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశ్నించారు. గుజరాత్ పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీపై రాళ్లు పడిన సంఘటనపై లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యులు చేసిన ఆరోపణలకు బదులిస్తూ ఈ ప్రశ్న వేశారు.

08/09/2017 - 03:07

న్యూఢిల్లీ, ఆగస్టు 8: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. నవంబర్‌లో హైదరాబాద్‌లో జరిగే గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యుర్‌షిప్ సమ్మిట్ (జిఇసి)లో ఇవాంకా (35) పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ఆమెను భారత్‌లో పర్యటించాల్సిందిగా ఆహ్వానించారు. ఇవాంకా సారథ్యంలోనే అమెరికా బృందం జిఇసిలో పాల్గొంటారు.

08/09/2017 - 03:06

పాట్నా, ఆగస్టు 8: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బిజెపితో చేతులు కలపడం ద్వారా రాజకీయ ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ దుయ్యబట్టారు. నితీశ్‌ను యుద్ధ్భూమినుంచి పారిపోయిన వ్యక్తిగా లాలూ అభివర్ణిస్తూ, ‘ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా నితీశ్‌ను విశ్వసించదు. ఆయన రాజకీయంగా ఫినిష్ అయినట్లే’ అని అన్నారు.

08/09/2017 - 03:04

న్యూఢిల్లీ, ఆగస్టు 8: జాతీయ బిసి కమిషన్‌కు రాజ్యంగ బద్ధత కల్పించే విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. మంగళవారం నాడు జంతర్‌మంతర్ దగ్గర తెలంగాణ రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం అధ్యర్యంలో పలు డిమాండ్లపై ఒబిసి ఆఖిలపక్ష మహసభను నిర్వహించారు.

08/09/2017 - 03:04

న్యూఢిల్లీ, ఆగస్టు 8: అరుదైన శైలి, ఎవరూ ఊహించని రీతిలో రాజకీయ పాచికలు వేసి ప్రత్యర్థులను కంగుతినిపించగల ఆసాధారణ నైపుణ్యం.. ఇది బిజెపి అధ్యక్షుడు అమిత్ షా నైజం. ఆయన పార్టీ పగ్గాలు చేపట్టి బుధవారానికి మూడు సంవత్సరాలు. ఈ మూడేళ్లలో అనూహ్య రీతిలో అనేక రాష్ట్రాల్లో బిజెపిని అధికారంలోకి తెచ్చిన ఘనత పార్టీ అధినేతగా అమిత్ షాదే.

Pages