S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/09/2017 - 03:01

కోల్‌కతా, ఆగస్టు 8: హింసాకాండను విడనాడి డార్జిలింగ్ ఉద్యమ పార్టీలన్నీ చర్చలకు రావాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం ఇక్కడ పిలుపునిచ్చారు. ఇప్పటివరకూ ఉద్యమం కారణంగా 550 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించిందని శాసభసభలో తెలిపారు. వరుస బంద్‌ల కారణంగా, స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలు, టూరిజం దెబ్బతిందని అన్నారు.

08/09/2017 - 02:59

న్యూఢిల్లీ, ఆగస్టు 8: రామజన్మభూమి వివాదంలో మంగళవారం మరో కీలక పరిణామం చోటుచేసుకొంది. అయోధ్యలో వివాదాస్పద స్థలానికి కొద్దిదూరంలో ముస్లింలు ఎక్కువ సంఖ్యలో నివసించే ప్రాంతంలో మసీదును నిర్మించుకోవచ్చని పేర్కొంటూ షియా సెంట్రల్ వక్ఫ్‌బోర్డు సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్‌ను సమర్పించింది.

08/09/2017 - 02:57

న్యూఢిల్లీ, ఆగస్టు 8: కొత్త రూ.500 నోటు నమునా, కొలతల్లో తేడా ఉండటాన్ని రాజ్యసభలో విపక్ష సభ్యులు ప్రస్తావించారు. పెద్దనోట్ల రద్దు అనంతరం ఆర్‌బిఐ ముద్రించిన రూ.500 నోట్లలో రెండు రకాల వ్యత్యాసాలపై కాంగ్రెస్‌తోపాటు, ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. మంగళవారం సభ ప్రారంభం కాగానే డిప్యూటీ చైర్మన్ అధికార పత్రాలు, నివేదికలను సభలో సమర్పింపజేశారు.

08/09/2017 - 02:55

న్యూఢిల్లీ, ఆగస్టు 8: గుజరాత్ వరద ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీపై బిజెపి రాళ్లు వేయించిందంటూ కాంగ్రెస్ సభ్యులు మంగళవారం లోక్‌సభను స్తంభింపజేశారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రాణాలు తీస్తారా? అంటూ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే బిజెపిపై విరుచుకుపడ్డారు.

08/09/2017 - 02:29

న్యూఢిల్లీ, ఆగస్టు 8: గుజరాత్ రాజ్యసభ ఎన్నికలో ఇద్దరు కాంగ్రెస్ శాసన సభ్యుల ఓట్లపై కాంగ్రెస్, బిజెపి నాయకులు మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘానికి వివాదాస్పద ఫిర్యాదులు చేశారు.

08/09/2017 - 01:40

న్యూఢిల్లీ, ఆగస్టు 8: కొత్త అయిదు వందలు, 2 వేల రూపాయల నోట్లు ఒకే పరిమాణంలో ఉంటాయని ప్రభుత్వం మంగళవారం స్పష్టం చేసింది. కొత్త నోట్లు ఒక్కోటి ఒక్కో పరిమాణంలో ఉంటున్నాయని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు రాజ్యసభలో సభా కార్యక్రమాలను స్తంభింపజేసిన తరుణంలో ప్రభుత్వం ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. ‘ఒక్కో విలువ కలిగిన బ్యాంక్ నోటు ఒక్కో పరిమాణంలో ఉంటుంది.

08/09/2017 - 01:34

న్యూఢిల్లీ, ఆగస్టు 8: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ దీపక్ మిశ్రా నియమితులయ్యారు. న్యాయశాఖ మంగళవారం సాయంత్రం ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ప్రధాన న్యామూర్తి జస్టిస్ జెఎస్ ఖేహర్ పదవీ కాలం ఈ నెల 27తో ముగియనున్న నేపథ్యంలో 63 ఏళ్ల దీపక్ మిశ్రాను ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ఖేహర్ తర్వాత సుప్రీంకోర్టులో అందరికన్నా సీనియర్ న్యాయమూర్తి దీపక్ మిశ్రా.

08/09/2017 - 02:42

గాంధీనగర్/న్యూఢిల్లీ, ఆగస్టు 8: ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన గుజరాత్‌లోని మూడు రాజ్యసభ స్థానాల ఎన్నిక క్షణక్షణం నాటకీయ మలుపులు తిరుగుతూ అంతిమంగా కాంగ్రెస్ పార్టీకి నైతిక విజయాన్ని అందించింది.

08/09/2017 - 01:07

న్యూఢిల్లీ, ఆగస్టు 8: క్విట్ ఇండియా ఉద్యమం 75 వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం (ఆగస్టు 9న) పార్లమెంటు ఉభయ సభలు ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. ఈ ప్రత్యేక సమావేశాల్లో లోక్‌సభలో అధికార పక్షానికి విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, రాజ్యసభలో అధికార పక్షానికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నాయకత్వం వహిస్తారు.

08/08/2017 - 03:11

న్యూఢిల్లీ, ఆగస్టు 7: దేశంలోని అత్యంత రద్దీగా ఉండే రైల్వే రూట్లలో ఢిల్లీ-ముంబయి రూటు ఒకటి. దాదాపు 1400 కి.మీ దూరాన్ని రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ప్రస్తుతం 16 గంటల్లో చేరుకుంటోంది. అయితే ఇక మీదట 13 గంటల్లో చేర్చేందుకు రైల్వే శాఖ ముమ్మర ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఇటీవల లింకే హోఫ్‌మాన్ బుష్ (ఎల్‌హెచ్‌బి) కోచ్‌లతో హైస్పీడ్ రైలును ప్రయోగాత్మకంగా పరిశీలించారు.

Pages