S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/08/2017 - 01:58

అగర్తలా, ఆగస్టు 7: త్రిపురలో పార్టీనుంచి బహిష్కరణకు గురైన ఆరుగురు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సోమవారం బిజెపిలో చేరారు. జూలై 17న ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు ఎన్డీయే రాష్టప్రతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌కు పార్టీ ఆదేశాన్ని ధిక్కరించి ఓటేసిన విషయం తెలిసిందే. ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను ఆగస్టు అయిదున ఢిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు.

08/08/2017 - 01:57

ముంబయి, ఆగస్టు 7: జన్మాష్టమి సందర్భంగా ఉట్టుకొట్టే కార్యక్రమం (దహీహందీ)లో 14ఏళ్ల లోపు పిల్లలు పాల్గొనబోరని బాంబే హైకోర్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వివరణతో సంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు దానిపై తాము ఎలాంటి ఆంక్షలు విధించలేమని తెలిపింది.

08/08/2017 - 01:57

న్యూఢిల్లీ, ఆగస్టు 7: అయోధ్య వివాదంపై అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను విచారించటానికి సుప్రీం కోర్టు ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, అశోక్ భూషణ్, అబ్దుల్ నజీర్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం అయోధ్య కేసును ఆగస్టు 11నుంచి విచారణ చేపడుతుంది.

08/08/2017 - 01:56

న్యూఢిల్లీ, ఆగస్టు 7: అస్సాంను అత్యంత కల్లోల ప్రాంతంగా మరో నెల రోజులపాటు ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం కింద ఈ నిర్ణయం వర్తిస్తుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఆగస్టు మూడు నుంచి ఆగస్టు 31వరకూ కల్లోల ప్రాంతంగా అస్సాం ఉంటుంది.

08/08/2017 - 01:56

చెన్నై, ఆగస్టు 7: అన్నాడిఎంకెలోని రెండు వర్గాలు త్వరలోనే విలీనం అవుతాయని తమిళనాడు ముఖ్యమంత్రి కె పళనిస్వామి సోమవారం ఇక్కడ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఏవో చిన్న చిన్న సమస్యల వల్ల విలీనంలో జాప్యం జరుగుతోంది. త్వరలోనే వాటికి తెరపడుతుంది’ అని అన్నాడిఎంకె (అమ్మ) వర్గం నేత వెల్లడించారు. చెన్నైలో మీడియాతో మాట్లాడిన పళనిస్వామి విలీనం ఎప్పుడు అన్నదానిపై కచ్చితంగా ప్రకటించలేదు.

08/08/2017 - 01:55

శ్రీనగర్, ఆగస్టు 7: దక్షిణ కాశ్మీర్ హిమాలయాల్లో వేంచేసిన అమర్‌నాథ్ మంచు శివలింగాన్ని ఈ ఏడాది 2.60 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. నలభై రోజులపాటు సాగిన అమర్‌నాథ్ యాత్ర సోమవారంతో ముగిసింది. యాత్రికులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఎనిమిది మంది యాత్రికులు మృతిచెందారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే అమర్‌నాథ్ యాత్ర ఏటా రక్షాబంధన్ రోజున ముగుస్తుంది.

08/08/2017 - 01:53

న్యూఢిల్లీ, ఆగస్టు 7: ఉత్తరప్రదేశ్‌లో బహుజన సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతికి ఇక గడ్డురోజులే. పార్టీలో మాయావతిపై ఉన్న అంసతృప్తి సెగలు మొత్తం ఆమె నాయకత్వానికే ఎసరుపెట్టాయని తాజా రాజకీయ పరిణామలు సూచిస్తున్నాయి. ఆమెకు చెక్‌పెట్టడానికి బిఎస్పీ మాజీ నేతలు రంగంలోకి దిగారు.

08/08/2017 - 01:51

న్యూఢిల్లీ, ఆగస్టు 7: దేశంలో ప్రభుత్వరంగ బ్యాంకులు దాదాపు రూ.83,683 కోట్ల మొండిబకాయిలను మాఫీ చేశాయంటూ మీడియాలో వచ్చి వార్తలపై వివరణ ఇవ్వాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సోమవారం డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేయాలని ఆయన కోరారు. ‘కేరళలో సెలవులు పూర్తయితే జైట్లీ వెనక్కి వచ్చి ఈ అంశంపై మాట్లాడాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.

08/08/2017 - 01:49

న్యూఢిల్లీ, ఆగస్టు 7: కేరళ రాష్ట్రంలో రాజకీయ హింస సృష్టించి ప్రభుత్వాన్ని పడగొట్టాలని బిజెపి ప్రయత్నిస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. ఆదివారం ఆంధ్రాభవన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ, బిజెపి తమ రాజకీయ ప్రత్యర్థులపై సిబిఐ, ఈడిలను ఉపయోగించి దాడులు చేయిస్తోందని విమర్శించారు.

08/08/2017 - 01:47

అహ్మదాబాద్, ఆగస్టు 7: గుజరాత్‌లో మంగళవారం జరగనున్న రాజ్యసభ ఎన్నికలు మునుపెన్నడూ లేనంత ఉత్కంఠగా సాగుతున్నాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ విజయం ఆ పార్టీకి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది.

Pages