S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/19/2017 - 02:25

న్యూఢిల్లీ, జూలై 18: ప్రైవసీ (వ్యక్తిగత గోప్యత) భారత రాజ్యాంగం నిర్థేశించిన ప్రాధమిక హక్కుల పరిధిలోకి వస్తుందా? అన్న అంశాన్ని నిర్ణయించడానికి తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు మంగళవారం నిర్ణయించింది.

07/19/2017 - 02:23

న్యూఢిల్లీ, జూలై 18: ఉప రాష్టప్రతి పదవికి ఎన్టీయే తరఫున పోటీ చేస్తున్న మాజీ మంత్రి వెంకయ్యనాయుడు, ప్రతిపక్షాల అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. వెంకయ్యనాయుడు ఉదయం 11.30కు రాజ్యసభ సెక్రటరీ జనరల్ కార్యాలయానికి వచ్చి నామినేషన్ పత్రాలను సెక్రటరీ జనరల్ శంషేర్ కె షరీఫ్‌కు అందజేశారు.

07/19/2017 - 02:08

న్యూఢిల్లీ, జూలై 18: బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ సిఎం, బీఎస్పీ అధినేత్రి మాయావతి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభలో తనను మాట్లాడనివ్వలేదంటూ మాయావతి మంగళవారం తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా మంగళవారం రాజ్యసభ ప్రారంభకాగానే గందరగోళం నెలకొంది.

07/18/2017 - 03:18

న్యూఢిల్లీ, జూలై 17: ముప్పవరపు వెంకయ్యనాయుడు సాధారణ వ్యవసాయ కుటుంబంలో రంగయ్యనాయుడు, రమణమ్మ దంపతులకు 1949 జూలై 1న ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నెల్లూరు జిల్లాలోని చవటపాలెం గ్రామంలో జన్మించారు. బాల్యం విద్యాభ్యాసం అంతా నెల్లూరులోనే జరిగింది. వి.ఆర్ కళాశాల నుంచి డిగ్రీలో బిఏ పూర్తి చేసిన వెంకయ్య ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు.

07/18/2017 - 02:47

విశాఖపట్నం, జూలై 17: ఒడిశాలో కురుస్తున్న వర్షాలతో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాయగడ-టిట్లాఘర్ మధ్య రైల్వే బ్రిడ్జి వరద నీటికి కొట్టుకుపోయింది. దీంతో ఈ మార్గంలో నడిచే రైళ్ళన్నీ సోమవారం రద్దయ్యాయి. మరికొన్ని మళ్ళింపు మార్గంలో నడుస్తున్నాయి.
రద్దయిన ఎక్స్‌ప్రెస్‌లు

07/18/2017 - 02:35

న్యూఢిల్లీ, జూలై 17: సిక్కింలోని డోక్లామ్ ట్రైజంక్షన్ వద్ద నెలకొన్న సంక్షోభంపై వాస్తవ పరిస్థితిని విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్.జయశంకర్ సోమవారం పార్లమెంటరీ స్థారుూ సంఘానికి వివరించారు.

07/18/2017 - 02:21

న్యూఢిల్లీ, జూలై 17: పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజనంలోకి కందిపప్పును వినియోగించాలని రాష్ట్రాలకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆదేశించింది. ప్రభుత్వ గోదాముల్లో నిలువ ఉన్న కందిపప్పును మధ్యాహ్న భోజనానికి ఉపయోగించాలని కేంద్ర ఆహారశాఖ చేసిన విజ్ఞప్తి మేరకు వివిధ విభాగాల కార్యదర్శుల కమిటీ మానవ వనరుల అభివృద్ధి శాఖకు సిఫారసు చేసిందని ఆ శాఖ సహాయ మంత్రి ఉపేంద్ర కుషావహ లోక్‌సభలో వివరించారు.

07/18/2017 - 02:09

భారత్-పాక్ సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందాన్ని తరచుగా ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో సోమవారంనాడు బిఎస్‌ఎఫ్, పాక్ రేంజర్ల వింగ్ కమాండర్ స్థాయ అధికారులు ఫ్లాగ్ మీటింగ్ నిర్వహించారు. సాంబ సెక్టార్‌లో సోమవారం ఈ సమావేశం జరిగింది.

07/18/2017 - 02:07

న్యూఢిల్లీ, జూలై 17: సోమవారం ప్రారంభమైన వర్షాకాల పార్లమెంటు ఉభయ సభల సమావేశాలు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టకుండానే మంగళవారం నాటికి వాయిదా పడ్డాయి.

07/18/2017 - 02:06

న్యూఢిల్లీ, జూలై 17: ఉపరాష్టప్రతి పదవికి జరుగుతున్న ఎన్నికల్లో బిజెపి మిత్రపక్షాల అభ్యర్థిగా రంగంలోకి దిగిన ఎం.వెంకయ్య నాయుడు భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఉపరాష్టప్రతిగా ఎన్నికయ్యేవారు రాజ్యసభ అధ్యక్ష పదవీ బాధ్యతలు కూడా నిర్వహిస్తారు.

Pages