S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/07/2017 - 03:11

న్యూఢిల్లీ, ఆగస్టు 6: బోఫోర్స్ కేసు విచారణను వీలైనంత త్వరగా విచారించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. 1986నాటి 1437 కోట్ల బోఫోర్స్ గన్‌ల కొనుగోలు వ్యవహారంలో రూ.64కోట్ల మేర క్విడ్ ప్రోకో జరిగిందన్న ఆరోపణలు దేశ రాజకీయాల్లో పెద్ద ఎత్తున దుమారం రేపిన సంగతి తెలిసిందే.

08/07/2017 - 03:10

న్యూఢిల్లీ, ఆగస్టు 6: చట్టసభల్లో బిసిలకు రిజర్వేషన్లు కల్పించేవరకు పోరాటం కొనసాగిస్తామని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య స్పష్టం చేశారు. ఈ మేరకు పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ బిసి సంక్షేమ సంఘం జంతర్ మంతర్‌లో భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది.

08/07/2017 - 03:10

న్యూఢిల్లీ, ఆగస్టు 6: తెలుగు రాష్ట్రాల్లోని రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని వైకాపా పార్లమెంట్ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం కేంద్ర హోమ్ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఎంపీ వైవి సుబ్బారెడ్డి సమావేశమై తెలుగు రజకుల సమస్యలను, వారి స్థితిగతులను వివరిస్తూ వినతిపత్రాన్ని అందించారు.

08/07/2017 - 03:09

పనాజి, ఆగస్టు 6: గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కారుపై దాడికి నిరసనగా ప్రధాని నరేంద్ర మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్‌షాలకు గాజులు పంపుతామని గోవా కాంగ్రెస్ మహిళా విభాగం తెలిపింది. వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఓదార్చడం కోసం వెళ్లిన వ్యక్తి కారుపై రాళ్లు రువ్వడం పిరికిపంద చర్య అని గోవా ప్రదేశ్ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు ప్రతిమా కౌటిన్హో అన్నారు.

08/07/2017 - 03:08

లక్నో, ఆగస్టు 6: బంగ్లాదేశ్‌కు చెందిన కరడుగట్టిన ఉగ్రవాది అబ్దుల్లాను ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ (ఎటిఎస్) పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. అన్సారుల్లా బంగ్లా టీమ్ (ఎబిటి)కి చెందిన ఈ ఉగ్రవాదిని ముజఫరాబాద్ జిల్లాలోని కుటేసారా ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

08/07/2017 - 03:07

స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఆదివారం బుద్ధగయలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మాస్కులు ధరించి ఫ్రెండ్‌షిప్ బ్యాండ్‌లు కట్టుకుంటున్న బిజెపి, జెడి(యు) పార్టీల కార్యకర్తలు

08/07/2017 - 03:02

పాట్నా, ఆగస్టు 6: బిహార్‌కు ఉదారంగా నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ముఖ్యంగా న్యాయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు వీలుగా నిధుల అవసరాన్ని తీర్చాలని ఆయన కోరారు. రాష్ట్రంలో బిజెపి, జెడి(యు) చేతులు కలిపాయని, ఆ స్నేహహస్తం నిధుల కేటాయింపులోనూ కనిపించాలని నితీశ్ కుమార్ కోరారు.

08/07/2017 - 02:56

శ్రీనగర్, ఆగస్టు 6: గత నెల 10న అమరనాథ్ యాత్రికుల బస్సుపై దాడి చేసిన లష్కరే తోయిబా మిలిటెంట్లకు సహాయ పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జమ్మూ, కాశ్మీర్ పోలీసులు ఆదివారం చెప్పారు. ఈ కేసును తాము ఛేదించామని కూడా వారు చెప్పారు. ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ ముగ్గురిని అరెస్టు చేసినట్లు కాశ్మీర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ మునీర్ ఖాన్ ధ్రువీకరించారు.

08/07/2017 - 02:08

చిత్రం.. ఆదివారం బెంగళూరు వచ్చిన వెంకయ్య నాయుడును సన్మానిస్తున్న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత కుమార్, కర్నాటక బిజెపి అధ్యక్షుడు బిఎస్ యెడ్యూరప్ప తదితరులు

08/06/2017 - 02:19

శ్రీనగర్, ఆగస్టు 5: జమ్మూకాశ్మీర్‌లో మిలిటెంట్లకోసం భద్రతా దళాల గాలింపు సాగుతోంది. తాజాగా బారాముల్లా జిల్లాలో ముగ్గురు లష్కరె తొయిబా మిలిటెంట్లను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. సోపోర్ ప్రాంతంలో శనివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మిలిటెంట్లు హతమయ్యారు. సోపోర్ ప్రాంతంలోని అమర్‌గ్రాలో మిలిటెంట్లు ఉన్నట్టు భద్రతా దళాలకు సమాచారం అందింది.

Pages