S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/08/2017 - 01:25

హైదరాబాద్, ఫిబ్రవరి 7: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం బుధవారం హైదరాబాద్‌లో జరుగనుంది.

02/08/2017 - 01:23

తిరగబడిన పన్నీర్ సెల్వంపై అన్నాడిఎంకె నాయకత్వం వేటు వేసింది. పార్టీ ట్రెజరర్ పదవి నుంచి ఆయనను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. ఇంతకుముందు శశికళ సారథ్యంలో పొయస్ గార్డెన్‌లో పార్టీ సీనియర్ నేతలు సమావేశమయ్యారు. అకస్మాత్తుగా మారిన రాజకీయ పరిణామాలపై చర్చించి, మంగళవారం అర్థరాత్రి సమయంలో పన్నీర్‌పై వేటు వేయాలని నిర్ణయించారు.

02/08/2017 - 01:20

చెన్నై, ఫిబ్రవరి 7: తమిళనాడు రాజకీయాలు నాటకీయ మలుపు తిరిగాయి. ఏక్షణంలోనైనా శశికళ సిఎం పగ్గాలు చేపడతారన్న తరుణంలో ఒక్కసారిగా మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తిరగబడ్డారు. ఉన్నఫళంగా మంగళవారం రాత్రి పొద్దుపోయిన తరువాత జయ సమాధి వద్దకెళ్లి ముప్పావుగంట పాటు ధ్యానం చేశారు. అనంతరం ‘అమ్మ ఆత్మ వాస్తవాలు చెప్పమంది’ అంటూ మీడియా ముందు తన ఆగ్రహాన్ని, అక్కసును, వేదనను వెళ్లగక్కారు.

02/07/2017 - 03:22

చెన్నై, ఫిబ్రవరి 6: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అనేక అనుమానాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఆమెకు చికిత్స చేసిన లండన్ బ్రిడ్జ్ ఆస్పత్రికి చెందిన వైద్యుడు రిచర్డ్ బీలే, అపోలో ఆస్పత్రి డాక్టర్లు సోమవారం అపోలో ఆస్పత్రి ఆవరణలోనే విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి జయలలితకు అందించిన చికిత్సను వివరించారు.

02/07/2017 - 03:18

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ఐయుఎంఎల్ నాయకుడు, ఎంపీ ఇ అహ్మద్ మరణంపై ఎన్‌డిఏ ప్రభుత్వం సరైన రీతిలో వ్యవహరించలేదంటూ కేరళకు చెందిన కాంగ్రెస్, వామపక్ష సభ్యులు సోమవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని స్తంభింపజేశారు. లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమం సోమవారం కేవలం 5 నిమిషాలు మాత్రమే జరిగింది. అలాగే జీరో అవర్ చేపట్టలేదంటూ విపక్షం లోక్‌సభ నుంచి వాకౌట్ చేసింది.

02/07/2017 - 03:17

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: జమ్మూనుంచి బిహార్‌లోని గయకు వెళ్తున్న సిఆర్‌పిఎఫ్‌కు చెందిన 59 మంది కోబ్రా కమాండోలు ఒక్కసారిగా అదృశ్యమవడం సంచలనం సృష్టించింది. అయితే వీరంతా ఎలాంటి అనుమతీ లేకుండా తమ ఇళ్లకు వెళ్లినట్లు తెలిసిందని సిఆర్‌పిఎఫ్ వర్గాలు సోమవారం తెలిపాయి. ‘ఇది డ్యూటీనుంచి అనధికారికంగా గైరుహాజరవడమే. ఈ సంఘటనపై కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీ చేపట్టాం. ఈ కమాండోలు లేదా వారి కుటుంబాలతో టచ్‌లోకి రాగలిగాం.

02/07/2017 - 03:16

లక్నో, ఫిబ్రవరి 6: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్‌పి-కాంగ్రెస్ కూటమి తరపున ఎన్నికల ప్రచారం చేస్తానని సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అఖిలేశ్ యాదవ్ మళ్లీ యూపీ పగ్గాలు చేపడతారని జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ కూటమి ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

02/07/2017 - 03:14

సీతాపూర్ (యూపీ), ఫిబ్రవరి 6: సమాజ్‌వాదీలకు ఎంతటి ఎదురు గాలిలోనైనా సైకిల్‌పై దూసుకెళ్లటం ఎలాగో తెలుసని యూపి ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఆదివారం ప్రధాని మోదీ ఓ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ‘గాలి బలంగా వీస్తున్నప్పుడు ఎంతటి యువనేత అయినా తట్టుకోలేడని, ఎవరి సాయాన్నైనా కోరుతారని, కానీ ఈసారి బిజెపి తుపానులో తాను కొట్టుకుపోతానేమోనని ముఖ్యమంత్రి భయపడుతున్నారని’ చేసిన వ్యాఖ్యల్ని ఆయన ఖండించారు.

02/07/2017 - 03:11

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ప్రధాని నరేంద్ర మోదీకి పెరుగుతున్న ప్రజాదరణను ఓర్వలేకే విపక్షాలు ఆయనపై ఉద్దేశపూర్వకంగా విరుచుకుపడుతున్నాయని సినీనటి, బిజెపి ఎంపీ హేమమాలిని సోమవారం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలన్నీ కలిసి నరేంద్ర మోదీనే లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం వెనకున్న ఉద్దేశం అదేనని విశే్లషించారు.

02/07/2017 - 03:10

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను ఎన్‌డిఏ ప్రభుత్వం అమలు చేయకపోవటం సిగ్గు చేటని టిఆర్‌ఎస్ సభ్యుడు డి శ్రీనివాస్ విమర్శించారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఎన్‌డిఏ భాగస్వామి కాకున్నా పెద్దనోట్ల రద్దును సమర్థించారని, అయినా కేంద్రం తెలంగాణపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని డిఎస్ ఆరోపించారు.

Pages