S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/05/2017 - 03:05

న్యూఢిల్లీ, ఆగస్టు 4: ఉప రాష్టప్రతి ఎన్నికకు రంగం సిద్ధమైంది. బిజెపి ఉప రాష్టప్రతి అభ్యర్థి ఎం వెంకయ్యనాయుడు అత్యంత సులభంగా ఉప రాష్టప్రతి పదవికి ఎన్నిక కానున్నారు. లోక్‌సభ, రాజ్యసభ మొత్తం సభ్యుల సంఖ్య 790 కాగా, వెంకయ్య కు దాదాపు 500 ఓట్లు లభించే అవకాశాలు ఉన్నాయి. ఆయన దాదాపు 200 ఓట్ల మెజారిటీతో భారీ విజయం సాధించే అవకాశా లు ఉన్నాయని బిజెపి వర్గాలు చెబుతున్నాయి.

08/05/2017 - 03:04

న్యూఢిల్లీ, ఆగస్టు 4: ఎల్‌పిజి సిలెండర్ ధర పెంపుపై శుక్రవారం లోక్‌సభ దద్దరిల్లిపోయింది. వంటగ్యాస్ సిలెండర్‌పై పెంచిన 4 రూపాయలను తక్షణం ఉపసంహరించుకోవాలని సభ్యుడు డిమాండ్ చేశారు. సిలెండర్‌పై ప్రతినెలా నాలుగు రూపాయల చొప్పున ధర పెంచాలన్న కేంద్రం నిర్ణయంపై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

08/04/2017 - 03:29

న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూసేకరణ చేసిన అనంతరం చిత్తూరు నుండి శ్రీకాకుళం వరకు తీరప్రాంత రోడ్డు నిర్మాణం చేపట్టే విషయం పరిశీలిస్తామని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.

08/04/2017 - 02:43

చిత్రం.. భారత రాష్టప్రతి రాంనాథ్ కోవింద్ బొమ్మతో కూడిన భారీ రాఖీని ప్రదర్శిస్తున్న మీర్జాపూర్ విద్యార్థులు

08/04/2017 - 02:39

న్యూఢిల్లీ, ఆగస్టు 3: నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానికి నిలకడైన విదేవాంగ విదానం లేదని గురువారం ప్రతిపక్షాలు దుయ్యబట్టాయి. సరహద్దుల్లో ఉద్రిక్తత నేపథ్యంలో చైనాతో ఎలా వ్యవహరించాలని అనుకుంటోందో చెప్పాలని కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.

08/04/2017 - 02:38

న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఎలాంటి సమస్యలు సృష్టించకుండా భారత అభివృద్ధి అవసరాలు తీర్చే రీతిలో ముందుకు సాగాలని ఫారెస్ట్ సర్వీస్ అధికారులకు రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ స్పష్టం చేశారు. అటవీ ప్రాంతాల్లోనూ వాటి చుట్టుపక్కల నివసిస్తున్న గిరిజనులు సహా లక్షలాది మంది పేదల వౌలిక ఆహార, ఇంధన అవసరాలను తీర్చే విషయంలో సునిశితంగా వ్యవహరించాలని తెలిపారు.

08/04/2017 - 02:36

రొహ్‌తక్, ఆగస్టు 3: అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఉగ్రస్వరూపాన్ని ఎండగట్టి దాన్ని ఏకాకిని చేయగలిగామని ఇందుకు కారణం గత మూడేళ్లుగా నరేంద్ర మోదీ సారధ్యంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం చేపట్టిన చర్యలేనని బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా గురువారం నాడిక్కడ అన్నారు. ఈ మూడు సంవత్సరాల్లో ప్రధాని మోదీ చేసిన కృషి వల్లే పాకిస్తాన్ అసలు స్వరూపం బయటపడిందని ప్రపంచ దేశాలు అన్ని కూడా ఉగ్రవాదంపై దానిని ఏకాకిని చేశాయని తెలిపారు.

08/04/2017 - 02:31

న్యూఢిల్లీ, ఆగస్టు 3: గుజరాత్ రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ‘పైవారెవరూ కాదు’(నోటా) ఆప్షన్‌ను అనుమతిస్తూ ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్‌ను నిలిపివేయడానికి సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో ‘నోటా’ ఉంటుందని స్పష్టం చేసింది.

08/04/2017 - 02:22

సంప్రదాయ నాగా దుస్తుల్లో ప్రధాని నరేంద్ర మోదీ.. గురువారం నాగాలాండ్ ప్రతినిధుల బృందం తనను కలుసుకోవడానికి వచ్చిన సందర్భంగా ప్రధాని అరుదైన రీతిలో ఈ దుస్తుల్లో కనిపించి నాగా సంప్రదాయ
విలక్షణతకు అద్దం పట్టారు.

08/04/2017 - 02:20

అంతోలా, ఆగస్టు 3: ‘మీరేం భయపడకండి. మీకు సరైన నష్టపరిహారం అందేలా చూస్తాను. అది మీ హక్కు’అంటూ అస్సాం వరద పీడిత ప్రాంత ప్రజలకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అభయమిచ్చారు. ఇటీవల వర్షాలు, వరదలు కారణంగా ఘోరంగా దెబ్బతిన్న లఖింపుర జిల్లాలో గురువారం పర్యటించిన రాహుల్ గాంధీ ఓ చిన్న బోట్‌లో రంగా నదిని దాటి మరీ వెళ్లి అంతోలా చేరుకుని అక్కడ బాధితులను పరామర్శించారు.

Pages