S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

12/23/2016 - 03:44

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: తెలుగు రాష్ట్రాలకు చెందిన అంగన్‌వాడి కార్యకర్తలకు కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ అవార్డులను అందచేసింది. దేశవ్యాప్తంగా మాతా శిశు సంక్షేమంకోసం కృషి చేసిన కార్యకర్తలకు బుధవారం కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేశారు.

12/23/2016 - 02:11

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: బహిరంగ మలవిసర్జన రహిత నగరాలగా విశాఖ, గుంటూరు, నెల్లూరులు స్వచ్ఛత సర్ట్ఫికెట్లను అందుకొన్నాయి. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఆ శాఖ మంత్రి వెంకయ్యనాయుడు గురువారం నాడు భారత ప్రభుత్వ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో విశాఖ,గుంటూరు, నెల్లూరు నగరాల కమీషనర్లు ఈ స్వచ్ఛత సర్ట్ఫికెట్లను అందుకొన్నారు.

12/23/2016 - 01:57

హైదరాబాద్, డిసెంబర్ 22: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు కొత్త నిర్ణయం తీసుకుంది. ఉద్యోగాల ఖాళీల భర్తీకి సంబంధించి అభ్యర్థులు దరఖాస్తుల్లో 12 అంకెలు గల ఆధార్ కార్డు నంబర్‌ను పొందుపరచాలని కోరింది.

12/23/2016 - 01:24

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ గురువారం రాజీనామా చేశారు. పదవీ విరమణకు 18 నెలల ముందే ఆయన రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి అందజేసిన రాజీనామా లేఖలో ఆయన ఎలాంటి కారణాలు చూపలేదని ఎల్‌జి ఆఫీసు వర్గాలు వెల్లడించాయి. 65 ఏళ్ల జంగ్ మాజీ ఐఎఎస్ అధికారి. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా 2013 జూలైలో జంగ్ నియమితులయ్యారు.

12/23/2016 - 01:17

వారణాసి, డిసెంబర్ 22: తాను మాట్లాడితే భూకంపం వస్తుందన్న కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఎద్దేవా చేశారు. ‘వాళ్లకు( కాంగ్రెస్ పార్టీకి) ఒక యువ నాయకుడున్నారు. ఆయన ఇప్పుడిప్పుడే మాట్లాడడం నేర్చుకున్నారు. ఆయన మాట్లడడం నేర్చుకున్నప్పటినుంచీ నా సంతోషానికి ఎల్లలు లేవు. నేను మాట్లాడితే భూకంపం వస్తుందని ఆయన ఊరూరా తిరిగి చెప్పుకొంటున్నారు.

12/23/2016 - 01:15

న్యూఢిల్లీ, డిసెంబర్ 22:వాహన రిజిస్ట్రేషన్లకు పార్కింగ్ స్థలాన్ని ముడిపెడుతూ కేంద్రం మరో నిర్ణయాన్ని తెరపైకి తీసుకురాబోతోంది.

12/23/2016 - 01:08

చెన్నై, డిసెంబర్ 22: తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పి.రామమోహన రావుకు తమిళనాడు ప్రభుత్వం గురువారం ఉద్వాసన పలికింది. ప్రధాన కార్యదర్శి పదవి నుంచే కాకుండా ఇతర బాధ్యతల నుంచి కూడా ఆయన్ని తప్పించింది. కొత్త సిఎస్‌గా సీనియర్ ఐఎఎస్ అధికారి గిరిజా వైద్యనాథన్‌ను నియమించింది.

12/22/2016 - 07:45

మెహసానా, డిసెంబర్ 21: ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీవ్ర అవినీతి ఆరోపణలు చేశారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా కోట్లాది రూపాయల ముడుపులు తీసుకున్నారని రాహుల్ ధ్వజమెత్తారు. గుజరాత్‌లో బుధవారం ఓ బహిరంగ సభలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ సహారా గ్రూపునుంచి మోదీ తొమ్మిదిసార్లు ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు.

12/22/2016 - 07:05

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: ఆధునిక తెలుగు కవిత్వంలో తనదైన ముద్రవేసిన పాపినేని శివశంకర్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఈ మేరకు బుధవారం కేంద్ర సాహిత్య అకాడమీ శివశంకర్ రచించిన రజనీగంధ (కవితా సంపుటి)ని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు వెల్లడించింది. దేశ వ్యాప్తంగా ఉన్న 24 భాషలలో కేంద్ర సాహిత్య అకాడమీ 2016 అవార్డులను బుధవారం ప్రకటించింది.

12/22/2016 - 06:59

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: దక్షిణాది రాష్ట్రాల వార్షిక విడిది కోసం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ గురువారం తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని రాష్టప్రతి నిలయానికి వస్తున్నారు. ప్రణబ్ ముఖర్జీ ఈనెల 22 నుండి 31వ తేదీ వరకు దక్షిణాది రాష్ట్రాలలో వార్షిక పర్యటన జరుపుతారు.

Pages