S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

08/02/2017 - 02:36

న్యూఢిల్లీ, ఆగస్టు 1: రాజ్యాంగ హోదాతో కూడిన వెనుకబడిన కులాల జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేసేందుకు సంబంధించిన సవరణ బిల్లు సోమవారం రాజ్యసభలో చర్చకు వచ్చినప్పుడు గైర్హాజరైన పార్టీ ఎంపీలు, కేంద్ర మంత్రులపై బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

08/02/2017 - 04:39

పాట్నా, ఆగస్టు 1: మాజీ మిత్రుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై ఆర్‌జెడి అధినేత లాలూప్రసాద్ యాదవ్ నిప్పులు చెరిగారు. అధికార దాహంతో పార్టీలు మార్చే వ్యక్తి నితీశ్ అని దుయ్యబట్టారు. ‘నితీశ్ ఓ ఫాల్తూరామ్. అధికారం కోసం వేగంగా రంగులు మార్చే ఊసరవెల్లి లాంటివాడు. ఈ విషయంలో ఆయనకు నైతిక విలువలే లేవు’ అని మంగళవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ లాలూ అన్నారు.

08/02/2017 - 02:28

న్యూఢిల్లీ, ఆగస్టు 1: యమునా నది గట్లపై పేరుకుపోయిన చెత్తాచెదారాలను మూడు వారాల్లోగా తొలగించాలని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జిటి) ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రభుత్వాలను ఆదేశించింది.

08/02/2017 - 02:25

అహ్మదాబాద్, ఆగస్టు 1: గుజరాత్ రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత నోటా (నన్ ఆఫ్ ది అబవ్)ను ఎలా ప్రకటిస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు. జూన్‌లో జరగాల్సిన ఎన్నికలను ఎందుకు ఆలస్యంగా నిర్వహించాల్సి వచ్చిందంటూ అయన ప్రశ్నించారు. గుజరాత్, గోవా, పశ్చిమ బెంగాల్‌లలో పది రాజ్యసభ సీట్లకు ఈ నెల 8న ఎన్నికలు జరుగనున్నాయి.

08/02/2017 - 02:24

న్యూఢిల్లీ, ఆగస్టు 1: వెనుకబడిన కులాల జాతీయ కమిషన్ ఏర్పాటు కావటం కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదని, అందుకే ఆ బిల్లును రాజ్యసభలో ఆ పార్టీ అడ్డుకుందని కేంద్ర సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి రాందాస్ అథవాలె మంగళవారం తీవ్రంగా ఆరోపించారు. 27 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓబిసి కమిషన్‌కు సాధికారత కల్పించటానికి ఏమీ చేయలేదని ఆయన విమర్శించారు.

08/02/2017 - 02:23

న్యూఢిల్లీ, ఆగస్టు 1: కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్‌పై ఇస్తున్న రాయితీని 2018 మార్చి నాటికి తొలగించాలంటూ తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. బుధవారం పార్లమెంటు ఉభయ సభల్లో ఈ అంశాన్ని లేవనెత్తాయి.

08/02/2017 - 02:21

గౌహతి, ఆగస్టు 1: వరదల బారినపడ్డ ఈశాన్య రాష్ట్రాలకు రూ.2,350 కోట్ల ప్యాకేజీని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. వరదలవల్ల కలిగిన నష్టాలనుంచి బయటపడేందుకు, స్వల్ప, దీర్ఘకాలిక పనులు చేపట్టేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. అసోం, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేబినెట్ మంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఇక్కడ సమావేశమయ్యారు.

08/02/2017 - 02:18

న్యూఢిల్లీ, ఆగస్టు 1: ఎన్‌సిఇఆర్‌టి పాఠ్య పుస్తకాల ధరలు పెంచే యోచన లేదని సంస్థ మంగళవారం ఇక్కడ ప్రకటించింది. ధరలు పెరుగుతాయంటూ వచ్చిన వార్తలను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చి అండ్ ట్రైనింగ్ (ఎన్‌సిఇఆర్‌టి) ఖండించింది. పుస్తకాల ధరలు పెరుగుతున్నాయంటూ కృత్రిమ కొరత సృష్టించి లాభపడడానికి కొన్ని శక్తులు పనిచేస్తుయని సంస్థ ఆరోపించింది.

08/02/2017 - 01:56

శ్రీనగర్, ఆగస్టు 1: కాశ్మీర్‌లో జరిగిన అనేక ఉగ్రదాడులతో సంబంధం ఉన్న లష్కర్ ఏ తోయిబా కమాండర్ అబు దుజానా మంగళవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. అతడితో పాటు అతని అనుచరుణ్ని కూడా భద్రతాదళాలు పుల్వామా జిల్లాలోని హక్రిపోరాలో కాల్చి చంపాయి. సోమవారం రాత్రి నుంచి దుజానా కదలికలపై సమాచారం అందటంతో ఆ ప్రాంతాన్ని భద్రతాదళాలు దిగ్బంధించాయి.

08/02/2017 - 01:42

న్యూఢిల్లీ, ఆగస్టు 1: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్‌సింగ్‌కు అధిష్ఠానం ఉద్వాసన పలికింది. ఆయన్ను తక్షణం బాధ్యతల నుంచి తప్పించి పార్టీ సీనియర్ నేత ఆర్‌సి కుంతియాను నియమించారు. ఆయన ప్రస్తుతం తెలంగాణ పార్టీ వ్యవహారాల కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

Pages