S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

11/11/2016 - 07:05

న్యూఢిల్లీ, నవంబర్ 10: రెండు పెద్ద కరెన్సీ నోట్ల చలామణిని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ఈ చర్య దీర్ఘకాలంలో ‘ఆర్థిక ఉగ్రవాదాని’కి వ్యతిరేకంగా పోరాడటంలో, నల్లధనాన్ని ‘విద్రోహ కార్యకలాపాల’కు వినియోగించడాన్ని నియంత్రించడంలో దోహదపడుతుందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి (పశ్చిమ) సుజాతా మెహతా అన్నారు.

11/11/2016 - 07:04

ఇస్లామాబాద్, నవంబర్ 10: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలవడంతోనే ఆయన భారత్‌కు అనుకూలంగా తన విదేశాంగ విధానాన్ని అమలు చేయడం ప్రారంభిస్తారేమోనని పాకిస్తాన్ భయపడుతోందని విశే్లషకులు అంటున్నారు. దక్షిణాసియా ప్రాంతంలో చారిత్రక మిత్రపక్షాలైన పాకిస్తాన్, అమెరికా మధ్య ఇటీవలి కాలంలో సంబంధాలు దెబ్బతినడం తెలిసిందే.

11/11/2016 - 05:56

హైదరాబాద్, నవంబర్ 10: నల్లధనాన్ని వెలికి తీయడానికి పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్ర నిర్ణయం రాష్ట్ర ఖజానాపై తీవ్ర ప్రభావం చూపనుందన్నది ఆర్థిక శాఖ అధికారులు అంచనా. పాత నోట్ల రద్దుతో రాష్ట్ర ఆదాయమే కాకుండా కేంద్ర వసూలు చేసే పన్నులలో రాష్ట్రానికి రావాల్సిన వాటా కూడా తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

11/11/2016 - 05:49

హైదరాబాద్, నవంబర్ 10: పెద్ద నోట్లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి నెలకు రూ. 1000-2000 కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందంటూ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రియల్ ఏస్టేట్ రంగం కుదేలు అవుతుందని, దీనిపై వచ్చే ఆదాయం 90 శాతం వరకు తగ్గే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రి లెక్కలతో సహా గవర్నర్ నరసింహన్‌కు వివరించారు.

11/11/2016 - 05:47

న్యూఢిల్లీ, నవంబర్ 10:జిఎస్‌టి విధానం వల్ల చలన చిత్ర పరిశ్రమకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ఐటి పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని కోరారు. కెటిఆర్ గురువారం సినీ నిర్మాతలు డి సురేష్‌బాబు, సి కల్యాణ్‌లతో కలసి జైట్లీతో భేటీ అయ్యారు.

11/11/2016 - 07:42

మార్కెట్లోకి 2000 నోటు నేటి నుంచి ఏటిఎంలలో రూ. 50 నోట్లు
బ్యాంకుల ముందు జనం బారులు డబ్బు తగలబెట్టుకుంటున్న నల్ల కుబేరులు

11/11/2016 - 05:26

న్యూఢిల్లీ, నవంబర్ 10: ఆంధ్రప్రదేశ్‌లో 525 కోట్ల పెట్టుబడితో అపోలో టైర్ల కర్మాగారం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, అపోలో అధ్యక్షుడు ఓంకార్ కన్వర్ సమక్షంలో రాష్ట్ర పరిశ్రమల డైరక్టర్ కార్తికేయ మిశ్రా, అపోలో టైర్స్ డైరక్టర్ సునమ్ సర్కార్ ఒప్పందంపై సంతకాలు చేశారు. అపోలో టైర్స్ రాష్ట్రంలో అత్యాధునిక టైర్ల ఉత్పత్తి పరిశ్రమను ఏర్పాటు చేస్తుంది.

11/11/2016 - 05:26

న్యూఢిల్లీ, నవంబర్ 10: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోందని, 2029 నాటికి ఏపిని దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

11/10/2016 - 07:18

న్యూఢిల్లీ, నవంబర్ 9: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయం చేయవద్దని కేంద్ర సమాచార, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు ప్రతిపక్షాలకు హితవు చెప్పారు. బుధవారం నాడిక్కడ విలేఖరులతో మాట్లాడుతూ నల్లధనాన్ని అదుపుచేస్తూ, ఉగ్రవాదుల కార్యక్రమాలకు అడ్డుకట్టవేసే పెద్ద నోట్ల రద్దును స్వాగతించాలని విజ్ఞప్తి చేశారు.

11/10/2016 - 05:23

న్యూఢిల్లీ, నవంబర్ 9: రాష్ట్ర రాజధానిలో రెండు స్కైవేల ఏర్పాటుకు స్థలం కేటాయించటంతోపాటు కంటోనె్మంట్ ప్రాంతంలోని రోడ్ల మూసివేత సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ఐ.టి, పట్టణాభివృద్ది శాఖ మంత్రి కె. తారక రామారావు కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్‌కు విజప్తి చేశారు.

Pages