S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/09/2017 - 03:15

రాష్టప్రతి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ శనివారం భోపాల్‌లో పర్యటించారు.
ఈ సందర్భంగా పాకిస్తాన్ నుంచి మన దేశానికి తిరిగి వచ్చిన మూగబాలికను పరామర్శించారు. చిత్రంలో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తదితరులు

07/09/2017 - 03:08

కోల్‌కతా, జూలై 8: ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బదూరియా, బాసిర్‌హత్ ప్రాంతాల్లో జరిగిన మత ఘర్షణలపై న్యావిచారణకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆదేశించారు. మోదీ ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు, మతవిద్వేషాలు రెచ్చగొట్టేందుకు కుయుక్తులు పన్నుతోందని ఆమె ఆరోపించారు.

07/09/2017 - 01:55

శ్రీనగర్, జూలై 8: లష్కరే తోయిబా మిలిటెంట్ బుర్హాన్ వనీ తొలి వర్ధంతి నేపథ్యంలో శనివారం లోయలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. వనీ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించాలన్న వేర్పాటువాదుల ఆలోచనను భగ్నం చేయడానికి అధికారులు ముందుజాగ్రత్త చర్యగా శనివారం మూడు పట్టణాల్లో కర్ఫ్యూ విధించారు. కాశ్మీర్ లోయ అంతటా పోలీసు, పారా మిలటరీ బలగాలను పెద్ద సంఖ్యలో మోహరించారు.

07/09/2017 - 01:53

న్యూఢిల్లీ, జూలై 8: బీహార్ మాజీ సిఎం, ఆర్జేడీ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తనయ ఎంపి మీసా భారతికి చెందిన ఢిల్లీలోని మూడు ఫార్మ్‌హౌస్‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. ఘితోర్ని, బిజ్వాసన్, సైనిక్ ఫామ్‌హౌస్‌లలో శనివారం ఉదయం ఈ సోదాలు జరిగాయి.

07/09/2017 - 01:51

న్యూఢిల్లీ, జూలై 8: విదేశాల్లో ఉంటున్న తల్లిదండ్రుల విడాకుల కేసుల్లో వారి పిల్లలు తీవ్రవత్తిళ్లకు గురవుతున్నారని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జెఎస్ ఖేహర్ పేర్కొన్నారు. భార్యాభర్తల్లో ఒకరు వేరే దేశంలో నివాసముంటే వారి మధ్య తలెత్తిన వివాదాలు విడాకుల వరకు వెళ్తే వారి పిల్లల సంరక్షణ ఎవరి బాధ్యతో నిర్ణయించడం చాలా క్లిష్టంగా ఉంటుందని ఆయన చెప్పారు.

07/09/2017 - 01:49

న్యూఢిల్లీ, జూలై 8: జమ్మూ-కాశ్మీరులోని భారత్-పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో శనివారం ఒక మోస్తరు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.2 పాయింట్లుగా నమోదైంది. మధ్యాహ్నం 3 గంటల 42 నిమిషాలకు భూమి లోపల 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపన సంభవించిందని భారత వాతావరణ విభాగంలోని జాతీయ భూకంప అధ్యయన కేంద్రం వెల్లడించింది.

07/09/2017 - 01:15

న్యూఢిల్లీ, జూలై 8: భారత్‌కు చెందిన ఆర్థిక నేరగాళ్లను అప్పగించే విషయంలో సహకారాన్ని అందించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరారు. జి-20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా శనివారం ఆయన ఈ విషయమై బ్రిటన్ ప్రధాని థెరిసా మేతో చర్చలు జరిపారు.

07/09/2017 - 01:33

జమ్మూ, జూలై 8: పాక్ సైన్యం మరోసారి సరిహద్దుల్లో కాల్పుల ఒప్పందం ఉల్లంఘనకు పాల్పడింది. జమ్మూ, కాశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో అధీన రేఖ వెంబడి ఉండే సైనిక శిబిరాలు, నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని పాక్ సైన్యం శనివారం జరిపిన కాల్పుల్లో ఒక ఆర్మీ జవాను, అతని భార్య మృతి చెందగా, వారి ముగ్గురు కుమార్తెలు గాయపడ్డారు.

07/08/2017 - 02:14

న్యూఢిల్లీ/పాట్నా, జూలై 7: తనపై దాఖలైన అవినీతి ఆరోపణలను అర్‌జెడి అధినేత లాలూప్రసాద్ యాదవ్ కొట్టిపారేశారు. బిజెపి పన్నిన కుట్రలో భాగంగానే సిబిఐ తనపై ఆరోపణలు దాఖలు చేసిందని అన్నారు. ఈ రకమైన కుట్రలకు తాను, తన పార్టీ భయపడేది లేదని స్పష్టం చేశారు. తాను రైల్వేమంత్రిగా ఉన్నప్పుడు టెండర్ ప్రక్రియలో ఎలాంటి తప్పులు జరగలేదని స్పష్టం చేశారు. ఇదంతా బిజెపి కుట్రతో జరిగిన దాడేనని పేర్కొన్నారు.

07/08/2017 - 02:07

హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ మృతిచెంది ఏడాది పూర్తయన సందర్భంగా శుక్రవారం శ్రీనగర్‌లోని పలు ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు. ముఖ్య కూడళ్లలో పహరా కాస్తున్న సైనిక బలగాలు.

Pages