S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

02/01/2017 - 01:13

న్యూఢిల్లీ, జనవరి 31: ఉమ్మడి ఏపీకి కేటాయించిన కృష్ణా నది జలాలను విభజిత, ఏపీ, తెలంగాణ మధ్య పంపిణీ జరపాడానికి ఏర్పాటు చేసిన బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ జరగకుండానే వాయిదా పడింది. మంగళవారం నాడు రెండు రాష్ట్రాల మధ్య నీటికేటాయింపులపై ట్రిబ్యునల్‌లో వాదనలు ప్రారంభం కావాల్సి ఉంది.

02/01/2017 - 01:12

న్యూఢిల్లీ, జనవరి 31: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ మంగళవారం పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ఉభయసభల సభ్యులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలుపై ఎలాంటి వ్యాఖ్య లేకపోవటం తమకు బాధ కలిగించిందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్‌రావు వాపోయారు.

02/01/2017 - 01:08

న్యూఢిల్లీ, జనవరి 31: తమిళనాడులో సంప్రదాయ క్రీడ జల్లికట్టును అనుమతిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చట్టానికి చేసిన సవరణను నిలిపివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అదే సమయంలో జల్లికట్టుపై 2016 జనవరి 7న జారీ చేసిన నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోవడానికి కేంద్రాన్ని కోర్టు అనుమతించింది.

02/01/2017 - 05:10

న్యూఢిల్లీ, జనవరి 31:కొత్త సాధారణ బడ్జెట్ ఎలా ఉండబోతోంది..పన్నుల్లో కలిసొచ్చేదెంత..రైలు ప్రయాణం ఖేదమా..మోదమా..ఇతరత్రా సామాన్యులకు ఒరిగేదెంత..? ఇదీ బడ్జెట్‌పై జనసామాన్యంలో రేకెత్తుతున్న ఉత్కంఠ! దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా ఇటు సాధారణ బడ్జెట్..అటు రైల్వే బడ్జెట్‌లు ఒకేసారి రాబోతున్నాయి. బుధవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ చారిత్రక తరుణానికి అంకురార్పణ చేయబోతున్నారు.

02/01/2017 - 00:48

భటిండా, జనవరి 31: పంజాబ్‌లో మంగళవారం సాయంత్రం ఓ ఎన్నికల ర్యాలీలో జరిగిన కారు బాంబు విస్ఫోటనంలో ముగ్గురు దుర్మరణం చెందారు. వౌర్ మండీ సమీపంలో ఉంచిన ఓ కారులో ఈ పేలుడు సంభవించిందని భటిండా డిప్యూటీ కమిషనర్ ఘన్‌శ్యామ్ ఓరి తెలిపారు. మరణించిన ముగ్గురిలో ఇద్దరు వృద్ధులు, ఓ బాలుడు ఉన్నారని పేర్కొన్నారు. ఈ సంఘటనలో పదిహేనుమంది గాయపడ్డారని తెలిపారు.

02/01/2017 - 00:43

న్యూఢిల్లీ, జనవరి 31: పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న ఆకస్మిక నిర్ణయం ప్రభావం ఈ ఆర్థిక సంవత్సరం జిడిపి వృద్ధిపై దాదాపు అరశాతం దాకా ప్రభావం చూపించనున్నదని, ఫలితంగా ఈ ఆర్థిక సంవత్సరం జిడిపి వృద్ధి 6.5 శాతానికే పరిమితం కావచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు తిరిగి మామూలు స్థాయిలో అంటే 6.75-7.5 శాతం మధ్య ఉంటుందని కూడా ఆ సర్వే పేర్కొంది.

02/01/2017 - 00:44

న్యూఢిల్లీ, జనవరి 31: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సృష్టించిన హెచ్ -1 బి వీసాల కల్లోలం భారత ఐటి కంపెనీలను కుదిపేసింది. ఇన్ఫోసిస్, టిసిఎస్, టెక్ మహీంద్రా, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ సహా ఐదు అగ్రగామి భారత ఐటి కంపెనీలు దాదాపు 33వేల కోట్ల రూపాయల మేర నష్ట పోయాయి. అంటే వీటి విలువ దాదాపు నాలుగు శాతం మేర పడిపోయింది.

01/31/2017 - 03:05

న్యూఢిల్లీ, జనవరి 30: ముంబయి దాడి కుట్రదారు హఫీజ్ సరుూద్‌ను పాకిస్తాన్ ప్రభుత్వం గృహ నిర్బంధంలో ఉంచినట్టుగా తెలుస్తోంది. లాహోర్‌లోని చౌబుర్జీ సమీపంలోని ఖాదీసియా మసీదులోనే ఆయన్ని హౌస్ అరెస్టు చేసినట్టుగా కధనాలు వెలువడుతున్నాయి. ఆయన సారధ్యంలోని జవాదే ఉద్ దవాను (జెయుడి) కూడా నిషేధించే అవకాశం ఉందని తెలుస్తోంది.

01/31/2017 - 03:04

న్యూఢిల్లీ, జనవరి 30: ఢిల్లీ క్రికెట్ సంఘం ప్రతిష్ఠను దిగజార్చే విధంగా వ్యాఖ్యలు చేసిన కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్, బిజెపి ఎంపీ కీర్తి అజాద్‌కు మెట్రోపాలిటన్ కోర్టు సమన్లు పంపింది. నిరాధారమైన సమాచారం ఆధారంగా వీరిద్దరూ చేసిన వ్యాఖ్యల వల్ల ఈ సంస్థ, దాని అధికారులకు తీవ్రస్థాయిలో పరువునష్టం జరిగిందని కోర్టు పేర్కొంది. ఫిబ్రవరి 18న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.

01/31/2017 - 03:01

న్యూఢిల్లీ, జనవరి 30: ఉమ్మడి ఏపీకి కేటాయించిన కృష్ణా నది జలాలను విభజిత ఏపీ, తెలంగాణల మధ్య పంపిణీ చేయడంపై జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ మంగళవారం ఢిల్లీలో విచారణ జరపనుంది. ఏపీ విభజన చట్టంలోని సెక్షన్-89 ప్రకారం కృష్ణా జలాలు పంపిణీ కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకు పరిమితం చేస్తూ గతంలో ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Pages