S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

09/20/2016 - 03:40

మధుబని/ పాట్నా, సెప్టెంబర్ 19: బిహార్‌లోని మధుబని జిల్లాలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 35 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. మధుబని నుంచి 65 మంది ప్రయాణికులతో సీతామడి వెళ్తున్న బస్సు హైవేలోని బసైతాచౌక్ వద్ద ఓ చెరువులో పడిపోయింది. ఇప్పటి వరకూర 10 మృతి దేహాలు వెలికితీశామని ఎస్‌పి దీపక్ కుమార్ తెలిపారు. ప్రయాణికుల్లో కొందరు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోగలికారని ఆయన అన్నారు.

09/20/2016 - 03:18

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణ రోడ్లు, భవనాల మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన స్థానానికి ఎన్నిక నిర్వహించనున్నారు.

09/20/2016 - 02:54

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: ఆక్రమిత కాశ్మీర్‌లోని మిలిటెంట్ స్థావరాలపై పరిమిత సైనిక దాడి జరపాలన్న డిమాండ్ల నేపథ్యంలో తదుపరి చర్యలపై భారత్ దృష్టి పెట్టింది. కాశ్మీర్‌లోని యూరీ సైనిక స్థావరంపై పాకిస్తాన్ మిలిటెంట్ సంస్థ జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో 17మంది భారత సైనికులు మృతి చెందిన నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

09/19/2016 - 18:05

ఇంఫాల్: మణిపూర్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. తృణమూల్ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడితోపాటు మరో ముగ్గురు శాసన సభ్యులు సోమవారం అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2012 ఎన్నికల్లో ఆరుగురు తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచారు. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు చేరడంతో కాంగ్రెస్‌ పార్టీకి సంఖ్యా బలం మరింత పెరిగింది.

09/19/2016 - 17:57

శ్రీనగర్‌: జమ్ము--కాశ్మీర్‌లోని అధికార పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ నేత నిసార్‌ అహ్మద్‌ మండూ పార్టీకి సోమవారం రాజీనామా చేశారు. భాజపా-పీడీపీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలసీల కారణంగా తాను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశానన్నారు. 16 ఏళ్లుగా పీడీపీతో ఉన్నానని.. ప్రజలను రక్షించడానికి, ప్రజల రాజకీయ గౌరవాన్ని కాపాడడానికి ఏర్పడిన పార్టీ..

09/19/2016 - 16:44

చెన్నై: జైల్లో ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్న నిందితుడు రామ్‌కుమార్ మృత దేహానికి - తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు పోస్ట్‌మార్టం ప్రక్రియను నిలిపివేయాలని పోలీసులు, ఆసుపత్రి వైద్యులను చెన్నై హైకోర్టు ఆదేశించింది. రామ్‌కుమార్ మృతిపై తండ్రి పరమశివం అనుమానం వ్యక్తం చేయడంతో దీనిపై పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు సూచించింది.

09/19/2016 - 16:26

పాట్నా: బీహార్‌లోని మధుబని జిల్లాలో సోమవారం లోయలో బస్సు పడి 50 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. బస్సు మధుబని నుంచి సీతామర్హి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బస్సు కిక్కిరిసి ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకూ 4 మృతదేహాలను వెలికితీశారు.

09/19/2016 - 16:07

దిల్లీ: మాజీ ఎంపీ, ఆర్జేడీ నేత మహమ్మద్‌ షాబుద్దీన్‌ బెయిల్‌పై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. బెయిల్‌పై స్టే కోరుతూ దాఖలయిన రెండు పిటిషన్ల పై విచారించిన సుప్రీంకోర్టు షాబుద్దీన్‌ వాదనలను కూడా వినాలని అభిప్రాయపడింది. అతడికి నోటీసులు జారీ చేస్తూ, విచారణను సెప్టెంబర్‌ 26కు వాయిదా వేసింది.

09/19/2016 - 15:01

దిల్లీ: 1999లో భారత ఎయిర్‌లైన్స్‌ విమానం హైజాక్‌ చేసిన ఉగ్రవాది మసూద్‌ అజహర్‌ను విడిచిపెట్టి నాటి ఎన్డీయే ప్రభుత్వం దేశ భద్రతపై రాజీపడిందని కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ సోమవారం మండిపడ్డారు. ఉరి దాడి సూత్రధారిగా భావిస్తున్న జైషే మహమ్మద్‌ ఉగ్రవాద సంస్థ నేత మసూద్‌ను విడుదల చేసి ఎన్డీయే ప్రభుత్వం తప్పుచేసిందన్నారు.

09/19/2016 - 13:46

ఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ను సోమవారం ఉదయం ఆయన నివాసంలో కలుసుకుని బయటకు వస్తుండగా డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పై ఒక వ్యక్తి ఇంకు జల్లాడు. ఆయన ఎరుపు రంగు చొక్కాపైనా, ముఖంపైనా ఇంక్ మరకలు పడ్డాయి. ప్రజల దృష్టిని మరల్చేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారంటూ మనీష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకు దాడి చేసిన వ్యక్తిని బ్రజేష్‌గా గుర్తించారు.

Pages