S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ వార్తలు

07/29/2017 - 01:55

న్యూఢిల్లీ, జూలై 28: కొత్త ఖండం ‘జిలాండియా’పై పరిశోధనలకు రంగం సిద్ధమైంది. అక్కడ నెలకొన్న పరిస్థితులపై పరిశోధనలు జరిపేందుకు శాస్తజ్ఞ్రుల బృందం ఒకటి వెళ్లనుంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ‘జిలాండియా’ ఖండాన్ని శాస్తజ్ఞ్రుల కనుగొన్న విషయం తెలిసిందే. ఖండం ఏర్పడడానికి, అక్కడ నెలకొని ఉన్న భౌగోళిక పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు ఓ బృందం శుక్రవారం బయలు దేరి వెళ్లింది.

07/29/2017 - 01:55

న్యూఢిల్లీ, జూలై 28: జమ్ము కాశ్మీర్‌లో ప్రజలకు శాశ్వత నివాసం హక్కు ఇచ్చే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి కల్పించే అధికరణ 35(ఎ)ను రద్దు చేసేందుకు ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ హెచ్చరించారు. నేషనల్ కాన్ఫరెన్స్, అధికార పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ కార్యకర్తలు ఎంతో ధైర్యంతో కాశ్మీర్‌లో భారత ప్రభుత్వానికి అండగా ఉంటూ జాతీయ పతాకాన్ని భుజాన మోస్తున్నారని అన్నారు.

07/29/2017 - 02:13

న్యూఢిల్లీ, జూలై 27: ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి భారత సాయుధ బలగాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం లోక్‌సభలో చెప్పారు. అంతేకాదు సైన్యానికి ఆయుధాలు, మందుగుండులాంటి కొరతలను సైతం తక్షణం భర్తీ చేయడం జరుగుతోందని కూడా ఆయన చెప్పారు.

07/28/2017 - 23:36

న్యూఢిల్లీ, జూలై 28: సైన్యంలో సహాయక్ విధానాన్ని రద్దుచేసే ప్రతిపాదన లేదని కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి సుభాష్ భామ్రే లోక్‌సభకు చెప్పారు. సహాయక్ విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ‘సహాయక్ విధానం రద్దు యోచన లేదు. దాని స్థానే మరొక విధానం తీసుకొచ్చే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో లేదు’అని బదులిచ్చారు.

07/28/2017 - 23:36

న్యూఢిల్లీ, జూలై 28: వరకట్న చట్టం మగవాళ్లను వేధించేందుకు ఓ ఆయుధంగా మారిపోయిందని బిజెపి ఎంపీ అన్షుల్ వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం లోక్‌సభ జీరో అవర్‌లో ఆయన మాట్లాడుతూ వరకట్న చట్టానికి సవరణ చేయాలని డిమాండ్ చేశారు. 1998-2015 సంవత్సరాల మధ్య వరకట్న వేధింపుల కేసులో 27 లక్షల మందిని అరెస్టు చేశారని తెలిపారు.

07/28/2017 - 03:18

రామేశ్వరం, జూలై 27: దేశంలోని రెండు తీర్థయాత్ర కేంద్రాలైన అయోధ్య-రామేశ్వరం మధ్య నడిచే వీక్లీ ఎక్స్‌ప్రెస్‌కు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పచ్చజెండా ఊపారు. ఈ రైలు రామేశ్వరం-ఫైజాబాద్-రామేశ్వరం మధ్య వయా అయోధ్య మీదుగా నడుస్తుంది. బయో టాయిలెట్స్ సౌకర్యాలతోపాటు అనేక సదుపాయలు కల్పించినట్టు ఈ సందర్భంగా ప్రధాని మోదీ వెల్లడించారు. దీనిని శ్రద్ధాసేతు ఎక్స్‌ప్రెస్‌గా పిలుస్తారు.

07/28/2017 - 03:16

న్యూఢిల్లీ, జూలై 27: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కూడా బిజెపి ఘనవిజయం సాధించే అవకాశాలు బిహార్ పరిణామాల నేపథ్యంలో మరింత బలపడ్డాయి. ఉత్తర, ప్రశ్చిమ, తూర్పు ప్రాంతాల్లోని రాష్ట్రాల్లో బిజెపి ఇప్పటికే బలమైన శక్తిగా ఆవిర్భవించింది.

07/28/2017 - 03:15

రాంచి/ పాట్నా, జూలై 27: బిహార్ ముఖ్యమంత్రిగా మళ్లీ బాధ్యతలు చేపట్టిన నితీశ్‌కుమార్ ఓ పచ్చి అవకాశవాది అని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ గురువారం ఇక్కడ దుమ్మెత్తిపోశారు. తనను భ్రష్ఠుపట్టించడమే లక్ష్యంగా నితీశ్ పని చేస్తున్నారని, ఆయన బిజెపితో చేతులు కలపడానికి ప్రధాన కారణం తనపైన, కుటుంబ సభ్యులపైన, ఆర్జేడీ నేతలపైన సిబిఐ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు జరిగేలా చూడటానికే అన్నారు.

07/28/2017 - 03:12

రామేశ్వరం, జూలై 27: జయలలిత లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఇది ఎవరూ తీర్చలేనిదని పేర్కొన్నారు. ఆమె భౌతికంగా మన మధ్యన లేకపోయినా జయలలిత ఆశీస్సులు మాత్రం ఎప్పుడూ ఇక్కడ ప్రజలకు ఉంటాయని ఆయన అన్నారు.

07/28/2017 - 03:10

బెంగళూరు, జూలై 27: కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ధరమ్‌సింగ్ గురువారం ఇక్కడ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కన్నుమూశారు. 80 ఏళ్ల సింగ్ కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను నగరంలోకి ఎంఎస్ రామయ్య ఆసుపత్రికి తరలించగా 40 నిముషాల తరువాత మరణించారు. గుండెపోటుతో ధరమ్‌సింగ్ చనిపోయారని వైద్యులు ప్రకటించారు. 2004-2006లో కర్నాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు.

Pages